పీసీసీ చీఫ్ రేవంత్ పై కౌశిక్ రెడ్డి నిప్పులు
రూ. 50 కోట్లు ఇచ్చి రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు అయ్యారు
దుమ్ము ఉంటే హుజురాబాద్ లో డిపాజిట్ తెచ్చుకోవాలని సవాల్
ఆరు నెలల్లో కాంగ్రెస్ ఖాళీ అవుతుందని శాపనార్థాలు
ఎంతో బాధతో కాంగ్రెస్ కు రాజీనామా చేశాను
అమ్ముడుపోయింది నేను కాదు.. రేవంత్ అమ్ముడుపోయారు
తనకే టీఆర్ యస్ టికెట్ వస్తుందని ఆడియో లీక్ … పీసీసీ షోకాజు నోటీసు … అవసరమైంటె పార్టీ నుంచి భావిష్కరిస్తామని పీసీసీ అధ్యక్షుడి హెచ్చరికల నేపథ్యంలో కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పిన హుజురాబాద్ కాంగ్రెస్ ఇంచార్జి కౌశిక్ రెడ్డి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పై సంచలన ఆరోపణలు చేశారు. 50 కోట్లు ఇచ్చి రేవంత్ పీసీసీ అధ్యక్షుడు అయ్యాడని తీవ్ర ఆరోపణలు చేశారు. తాను కాదు అమ్ముడు పోయింది ఈటలకు రేవంత్ అమ్ముడు పోయాడని ఆరోపణలు గుప్పిచారు. తాను బాధతోనే కాగ్రెస్ ను వీడుతున్నట్లు చెప్పారు. రేవంత్ కు దమ్ము ఉంటేహుజూరాబాద్లో డిపాజిట్ తెచుకోవాలం సవాల్ సైతం విసిరారు.
ఎంతో బాధతోనే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశానని కౌశిక్ రెడ్డి అన్నారు. రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు కావాలని కోరుకున్న వారిలో తాను మొదటివాడినని చెప్పారు. అయితే, రూ. 50 కోట్లు ఇచ్చి రేవంత్ పీసీసీ అధ్యక్షుడు అయ్యారని తీవ్ర ఆరోపణలు చేశారు. అమ్ముడుపోయింది తాను కాదని, రేవంత్ అమ్ముడుపోయారని, ఈటల రాజేందర్ కు అమ్ముుపోయారని ఆరోపించారు. హుజూరాబాద్ లో కాంగ్రెస్ గెలవలేదన్న రేవంత్ వ్యాఖ్యలు బాధాకరమని అన్నారు.
ఇదే సమయంలో రేవంత్ కు కౌశిక్ రెడ్డి సవాల్ విసిరారు. సత్తా ఉంటే హుజూరాబాద్ ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ తెచ్చుకోవాలని ఛాలెంజ్ చేశారు. ఆరు నెలల కాలంలో కాంగ్రెస్ పార్టీ ఖాళీ అవుతుందని చెప్పారు. గత ఎన్నికల్లో తనపై నమ్మకం ఉంచి హుజూరాబాద్ నియోజకవర్గ టికెట్ ఇచ్చిన రాహుల్ గాంధీ, ఉత్తమ్ కుమార్ రెడ్డిలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు. తెలంగాణలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో పార్టీని వీడాలనే నిర్ణయం తీసుకున్నానని… తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామిని కావాలనుకుంటున్నానని చెప్పారు.