గిరి బలిజ జి ఓ ౫ ను వెంటనే రద్దు చేయాలి …కాపు జేఏసీ అధ్యక్షులు చందు జనార్దన్
బలిజలపై కక్షసాధింపు ధోరణి విడనాడాలి
కాపు ల బీసీ రిజ ర్వేషన్ కోసం, సమస్యల పరిష్కారం కోసం ఆమరణ దీక్ష
కాపు భవన నిర్మాణానికి అమరావతిలో 5 ఎకరాల స్థలం కేటాయించాలి
కృష్ణదేవరాయల జయంతిని అధికారికంగా నిర్వహించాలి
కృష్ణదేవరాయల ,కన్నెగంటి హనుమంతు విగ్రహాలను అమరావతిలో ఏర్పాటు చేయాలి
కృష్ణ జిల్లాకు ,ఐకాన్ బ్రిడ్జి కి వంగవీటి రంగా పేరు పెట్టాలి
రాష్ట్ర ప్రభుత్వం దొమ్మరుల ను వారి సామజిక గుర్తింపు మారుస్తూ గిరి బలిజగా జి ఓ నెంబర్ 5 విడుదల చేయడాన్ని ఖండిస్తునట్లు రాష్ట్ర కాపు జేఏసీ అధ్యక్షులు చందు జనార్దన్ తెలిపారు . రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని తప్పు పడుతూ శుక్రవారం విజయవాడ లో గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశం లో చందు జనార్దన్ మాట్లాడుతూ కులాలమధ్య విభేదాలు సృష్టించాల్సిన అవసరం కూటమి పెద్దలకు ఎందుకని ప్రశ్నించారు .. బలిజలపై కక్ష సాధింపు ధోరణి విడనాడాలని హితవు పలికారు . తక్షణం గిరి బలిజ జి ఓ ను రద్దు చేయాలనీ డిమాండ్ చేసారు. దశాబ్దాల నుండి పరిష్కారానికి నోచుకోనిబీసీ రిజర్వేషన్ కోసం పోరాడాలని అందుకోసం తాను ఆమరణ నిరాహార దీక్ష చేయనున్నట్లు రాష్ట్ర కాపు జేఏసీ అధ్యక్షులుచందు జనార్దన్ ప్రకటించారు. కాపుజె.ఎ.సి.సమావేశం గతం లో తీర్మానించిన కాపు,బలిజ, తెలగ,ఒంటరి,తూర్పుకాపు,మున్నూరుకాపుసమస్యలపై దశలవారి ఉద్యమ కార్యాచరణను రూపొందించడమే కాక అన్ని జిల్లాలలో పర్యటనలు, సమావేశలు, రౌండ్ టేబుల్ సమావేశాలలో పాల్గొననున్నట్లు తెలిపారు,. పెద్దన్న పాత్ర పోషించి కూటమి ప్రభుత్వాన్ని కాపులు అధికారం లోకి తెస్తే బలిజ కాపు వర్గాలను అనగదో క్కుతున్నారని చందు జనార్దన్ ఆగ్రహం వ్యక్తం చేసారు.
జేఏసీ సమావేశం వివిధ తీర్మానాలను ఆమోదించిందని వివరించారు .
1)కాపు తెలగ బలిజ ఒంటరి కులాలకు ప్రత్యేక బీసీ రిజర్వేషన్ కల్పించాలని 2) సమస్యల పరిష్కారంకోసం దశలవారి ఉద్యమం జిల్లా,డివిజన్,మండల స్థాయి సమావేశాలు అనంతరం విజయవాడ, రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలలో బహిరంగ సభలు పెట్టాలని నిర్ణయం
3)రాష్ట్రం లో కాపు వర్గాలపై జరిగే దాడులను అరికట్టాలని డిమాండ్
4)కృష్ణా జిల్లాకు,ఐకాన్ బ్రిడ్జ్ కు స్వర్గీయ వంగవీటి మోహనరంగా గారిపేరు నామకరణం చెయ్యాలి, కృష్ణదేవారాయలు జయంతిని ప్రభుత్వం ఆదికారికంగా నిర్వహించాలి తీర్మానం
5)కాపు కార్పొరేషన్ కు ప్రతి సంవత్సరం 3000 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయాలి
6)హామీ మేరకు రెండు ఎకరాల్లో కాపు భవనాల నిర్మాణాలు పూర్తి చెయ్యాలి
7)కూటమి ప్రభుత్వం కాపులకు దామాషా ప్రకారం రాజకీయ,నామినేటెడ్ పదవుల్లో ప్రాధాన్యత నివ్వాలి
8)కాపు ఉద్యోగస్తులకు పోలీస్,రెవిన్యూ లాంటి ప్రాధాన్యత గల శాఖల్లో పోకల్ స్థానాల్లో పోస్టింగ్ లు ఇవ్వాలని ఉద్యోగుల అణచివేత పై సరైన దిద్దుబాటు చర్యలు తీసుకోవాలి.
9)రాష్ట్ర విభజన నేపద్యం లో తెలంగాణనుండి ఏపీ లో కలిసిన 7 ముంపు మండలాల మున్నూరు కాపు కుటుంబ సభ్యుల సమస్యలను
పరిష్కరించేందుకు కృషి చేయాలని
10.యం.యస్.యం.ఇ.లో యస్.సి,యస్.టి,బి.సి,మైనారిటీమహిళలకు ఇచ్చే సబ్సిడీ 40శాతం కాపు,తెలగ,బలిజ,ఒంటరి మహిళల అమలు చేయాలని.ఓ.యం.యస్22నుసవరించాలని. 11)రాజధాని ఆమరావతి లో కాపు భవనానికి 5 ఎకారాలు కేటాయించాలి. 12) స్వాతంత్ర సమరయోధుడు కన్నెగంటి హనుమంతు, కృష్ణదేవరాయలు బారీవిగ్రహలను ఆమరావతి రాజధానిలో ఏర్పాటు చేయాలి అని కోరారు, సీనియర్ నాయకులు ఆకుల శ్రీనివాస్ మాట్లాడుతూ దేశం లో అగ్ర స్థాయి నాయకులు వంగ వీటి మోహన రంగా అని అటువంటి నాయకులు కి గౌరవమిస్తూ కృష్ణా జిల్లాకు వంగవీటి మోహన రంగా పేరు పెట్టాలని డిమాండ్ చేసారు. కాపు ఉద్యోగ జేఏసీ నాయకులు సోమారౌతు రామకృష్ణ మాట్లాడుతూ కాపు ఉద్యోగస్థుల సమస్యలను కూటమి ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేసారు. మీడియా సమావేశంలో కొండిశెట్టి రాజేందర్(ఐకాన్ గ్రూప్),, ,గంటా సాయి వరప్రసాద్ ,,,,చందు భావ నారాయణ,పెన్నేటి దామోదర్,,పాలంకి రామారావు, కొక్కిరాల సంజీవ్,వెలివెల సత్యనారాయణ,జొన్నా రాజేష్,కంది నాయుడు,నెలబండ్ల రాజు,,మసాబత్తుల శ్రీనివాస్,రామాయణపు సాంబయ్య, కటకం ధర్మారావు, తోట సాంబ శివరావు,,,అల్లం రాజేష్, పులిగడ్డ సత్యనారాయణ,ఆకుల తిరుమలరావు, ఎపు గంటి సాయి కృష్ణ, కలిగినిడి రాధా కృష్ణ తదితరులుపాల్గోన్నారు.