ఆంధ్రప్రదేశ్

కోనసీమ జిల్లాలో భారీ పేలుడు… దంపతుల దుర్మరణం..

  • అయినవిల్లి మండలం విలాస గ్రామంలో ఘటన 
  • గత ఏడాది నిల్వ ఉంచిన మందుగుండు సామాగ్రి తీస్తుండగా సంభవించిన పేలుడు 
  • పేలుడు ధాటికి ఇంటి గోడలు కూలడంతో దంపతులు మృతి

బాణాసంచా పేలి దంపతులు దుర్మరణం పాలైన ఘటన అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లి మండలం విలస గ్రామంలో చోటుచేసుకుంది. గత సంవత్సరం నిల్వ ఉంచిన మందుగుండు సామాగ్రిని బయటకు తీసే క్రమంలో ప్రమాదవశాత్తు పేలుడు సంభవించడంతో ఈ దుర్ఘటన జరిగింది. 

పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన కంచర్ల శ్రీనివాస్ (55), ఆయన భార్య సీతామహాలక్ష్మి (50) తమ నివాసంలో గతంలో నిల్వ చేసిన మందుగుండు పదార్థాలను బయటకు తీసేందుకు ప్రయత్నించారు.  ఈ సమయంలో ప్రమాదవశాత్తు ఒక్కసారిగా పేలుడు సంభవించింది. పేలుడు తీవ్రతకు ఇంటి గోడలు కూలడంతో వారు శిథిలాల కింద పడిపోయారు. 

ప్రమాద స్థలానికి పి.గన్నవరం సీఐ భీమరాజు నేతృత్వంలో పోలీసులు, రెవెన్యూ సిబ్బంది చేరుకుని విచారణ ప్రారంభించారు. శిథిలాల కింద ఉన్న మృతదేహాలను వెలికితీశారు. 

ఈ ఘటనపై స్పందించిన కోనసీమ జిల్లా ఎస్పీ రాహుల్ మీనా సంఘటన స్థలాన్ని సందర్శించి మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. 

Related posts

అంతర్జాతీయ నెంబర్ల నుంచి వాట్సప్ స్పామ్ కాల్స్ పై రంగంలోకి కేంద్రం!

Drukpadam

ఇంగ్లాండ్ ఎన్నికల్లో ఖమ్మం వాసి నాగేంద్ర లేబర్ పార్టీ నుంచి కౌన్సిల్ కు ఎన్నిక!

Drukpadam

నా సెక్యూరిటీని వెనక్కి తీసుకోండి రిషికేశ్ లో తపస్సు చేసుకుంటా.. స్వరూపానందేంద్ర స్వామి

Ram Narayana