తెలంగాణ రాజకీయ వార్తలు ..

బీసీ ల ఆగ్రహ జ్వాలలతో ప్రభుత్వం పతనం తప్పదు …ఎంపీ వద్దిరాజు హెచ్చరిక ..

బీసీ ల ఆగ్రహ జ్వాలలతో ప్రభుత్వం పతనం తప్పదు …ఎంపీ వద్దిరాజు హెచ్చరిక ..
ఆపరేషన్ సెక్సెస్ …పేషంట్ డెడ్ లాగా బీసీ రిజర్వేషల విధానం
అమలు కావాలని తెలిసిన కాంగ్రెస్ నాటకాలు
ఇప్పటికైనా అఖిలపక్షాన్ని ప్రధాని వద్దకు తీసుకెళ్లండి

బీసీల ఆగ్రహ జ్వాలలతో తెలంగాణ ప్రభుత్వం పతనం కాకతప్పదని బీఆర్ యస్ రాజ్యసభ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ వద్దిరాజు రవిచంద్ర హెచ్చరించారు ..గురువారం హైద్రాబాద్ లోని బీఆర్ యస్ కార్యాలయంలో మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్ ,గంగుల కమలాకర్ ,దాసోజు శ్రవణ్ తో కలిసి మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పై నిప్పులు చెరిగారు …బీసీల ఓట్ల కోసమే రిజర్వేషల డ్రామా కాంగ్రెస్ ఆడుతుందని విమర్శించారు …కులగణన సరిగా చేయకుండా బీసీ రిజర్వేషలు పై ముందుకు వెళ్లడం ఎలా సాధ్యమని ఆయన ప్రశ్నించారు …రేవంత్ సర్కార్ కు బీసీలపై ప్రేమ ఏ మాత్రం లేదని ఉన్నట్లు నాటకాలు ఆడుతున్నారని ధ్వజమెత్తారు …ఇప్పటికైనా అఖిలపక్షాన్ని ప్రధాని మోడీ వద్దకు తీసుకోని పోయి బీసీ రిజర్వేషన్లు అమలుకోసం చిత్తశుద్ధితో కృషి చేయాలనీ డిమాండ్ చేశారు …

బీసీ రిజర్వేషన్స్ పెంపుదల జీవోను హైకోర్టు కొట్టివేయడం తీవ్ర విచారకరం,దురదృష్టకరమని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర వ్యాఖ్యానించారు.చట్టసభలతో పాటుగా విద్యా,ఉద్యోగ రంగాలలో బీసీలకు 42% రిజర్వేషన్స్ అమలు జరగాలంటే పార్లమెంటులో చట్టం చేసి రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్ నందు పొందుపర్చిన తర్వాతే సాధ్యపడుతుందని బీఆర్ఎస్ మొదటి నుంచి కూడా చెబుతున్నదన్నారు.అయినప్పటికీ రేవంత్ రెడ్డి సర్కార్ అసెంబ్లీలో బిల్లులు ప్రవేశపెట్టిన సందర్భాలలో మద్దతివ్వడం జరిగిందన్నారు. బీసీ రిజర్వేషల విషయంలో “ఆపరేషన్ సక్సెస్,పేషంట్ డెడ్” అనే చందంగా కాంగ్రెస్ వ్యవహారం దుయ్యబట్టారు .అసెంబ్లీ ఎన్నికలలో ఎలాగైనా బీసీల ఓట్లు కొల్లగొట్టి అధికారంలోకి రావాలనే కుట్ర,కాంక్షతోనే కాంగ్రెస్ నాయకులు కామారెడ్డి డిక్లరేషన్ ప్రకటించారని ఎంపీ రవిచంద్ర మండిపడ్డారు.

కాంగ్రెస్ పార్టీ ప్రచారం కోసమే బీసీ అస్త్రాన్ని ప్రయోగించి ఉపయోగించుకున్నదని చెప్పారు.
అమలు కాదని తెలిసి కూడా మోసపూరిత జీఓ తీసుకొచ్చి బీసీలను దగా చేశారని,ఆగం చేస్తున్నారని,బీసీల ఆగ్రహ జ్వాలలో కాంగ్రెస్ కూలిపోవడం ఖాయమని ఎంపీ రవిచంద్ర స్పష్టం చేశారు.కులగణన సందర్భంగా జనాభాను 25లక్షలు తక్కువ చేసి చూపి
బీసీలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం చంపేసిందని ఎంపీ వద్దిరాజు ఆవేదన వ్యక్తంచేశారు.
బీసీలకు మంచి జరగాలనే ఉద్దేశం, చిత్తశుద్ధి కాంగ్రెస్, బీజేపీలకు ఉన్నట్టయితే పార్లమెంటులో చట్టం చేసి 9వ షెడ్యూల్ లో చేర్చడం రిజర్వేషన్స్ పెంపుదల సాధ్యమవుతుందని ఎంపీ రవిచంద్ర వివరించారు.కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రివర్గ కూర్పుతో పాటు జరుగుతున్న అన్యాయాలను బీసీలు ఎప్పటికప్పుడు గమనిస్తున్నారని, తగిన రీతిలో బుద్ధి చెబుతారని ఎంపీ రవిచంద్ర హెచ్చరించారు.
ఢిల్లీలో చేయాల్సింది ఇక్కడ చేయి మసిబూసి మారేడు కాయ చేయడం తగదన్నారు.పార్లమెంట్ సమావేశాలలో “ఓట్ చోర్”పై నెల రోజుల పాటు విలువైన సమయాన్ని వృధా చేశారని,కనీస ప్రస్తావన కూడా తేలేదని, వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టలేదని ఎంపీ రవిచంద్ర కాంగ్రెస్ బీసీల వ్యతిరేక వైఖరిని ఎంపీ రవిచంద్ర గుర్తు చేశారు.కాంగ్రెస్ పార్టీకి 100మంది,అది నాయకత్వం వహిస్తున్న ఇండియా కూటమికి 300 మందికిపైగా ఎంపీలు ఉన్నారని, రేవంత్ రెడ్డి అఖిలపక్షాన్ని తీసుకుపోయి ప్రధాని నరేంద్రమోడీపై వత్తిడి పెంచడం ద్వారా పార్లమెంటులో బిల్లు ప్రవేశపెడితే బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతునిస్తుందని, సునాయాసంగా పాస్ అవుతదని వివరించారు.
బీసీ బిడ్డలంతా ఏకతాటిపైకి వస్తున్నారని,తమకు జరుగుతున్న అన్యాయాలపై తిరుగుబాటు తప్పదని ఎంపీ వద్దిరాజు చెప్పారు.ఈ సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు శుభప్రద పటేల్, కురవ విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఉగాది తర్వాత జనంలోకి గులాబీ బాస్ ….

Ram Narayana

ఖమ్మం బీజేపీ ఎంపీ అభ్యర్థిగా జలగం …!

Ram Narayana

చెప్పుతో కొడతాం… వెళ్లిపోండి అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు చేదు అనుభవం

Ram Narayana