తెలంగాణ రాజకీయ వార్తలు ..

కాంగ్రెస్ 420 హమీల్లానే, ఈ 42 శాతం బిసి రిజర్వేషన్ల డ్రామా..మాజీ మంత్రి ఎర్రబెల్లి

అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్ ఇచ్చిన హామీల్లానే 42 శాతం బీసీ రిజర్వేషలు ఒక డ్రామా అని మాజీ మంత్రి బీఆర్ యస్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు రేవంత్ రెడ్డి పైన మంత్రులపైనా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు …శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ ఈ లిల్లీ ఫుట్ ముఖ్యమంత్రికి పాలన తెలియదని ,మంత్రులు కూడా అట్లాగానే ఉన్నరారని తీవ్రస్థాయిలో విమ్మర్శలు గుప్పించారు …ఎన్నికల్లో బ్రోకర్ మాటలను ప్రజలు నమ్మారు కానీ కోర్టులు నమ్మలేదని దుయ్యబట్టారు …గ్రామాల అభివృద్ధి పట్ల ఈ ప్రభుత్వానికి ఏ మాత్రం చిత్తశుద్ధి లేదని ,22 నెలల పాలనలో బీసీ లకు ఏమి చేశారో చెప్పాలని నిలదీశారు …

కోర్టును గౌరవించకుండా పొద్దుగాల నామినేషన్లు తీసుకొని సాయంత్రం నవ్వుల పాలయ్యే పరిస్థితి ఈ ప్రభుత్వానిదని దెప్పి పొడిచారు .. తుపాకి రాముని కథలు ప్రజలకు అర్ధం అయినాయని ఇక మాయమాటలు ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని అన్నారు ..
పొద్దుగాల లేస్తే కేసీఆర్‌ను తిట్టుడు, దేవుళ్ళ మీద ఒట్టు పెట్టుడు తప్పా ఈ లిల్లీఫుట్‌ ముఖ్యమంత్రికి ఏం తెలియదని అన్నారు . ఈ బ్రొకర్‌ మాటలు గతంలో ప్రజలు నమ్మారు కాని కోర్టులు నమ్మలేదు కాబట్టే హైకోర్టు గూబ గుయ్యిమనిపించిందని చురకలు అంటించారు .రాష్ట్రంలో కనీసం ఇద్దరు మంత్రులు కలిసి తిరిగే పరిస్థితి లేదు. ఎవరి కుర్చీ ఎవరు లాక్కుంటారనే భయంతో ఉన్నారు. ఏ ఒక్క మంత్రి కూడా నియోజకవర్గంలో తిరగడం లేదు. ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతను తట్టుకొలేక కొత్త డ్రామాకి తెరలేపిన కార్రగెస్‌ స్థానిక ఎన్నికలు నిర్వహించలేక ఏదో కోర్టు ఆపింది మేము బిసిల కోసం అన్ని చేశాం అని చెప్పుకోవాలని కాంగ్రేస్‌ కుట్ర పన్నిందని విమర్శించారు . 55 ఏండ్లు కాంగ్రేస్‌ కేంద్రంలో అధికారంలో ఉండి బిసిల గురించి ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు .తూతూ మంత్రంగా జివో ఇచ్చి ఎన్నికలు నిర్వహించలేకనే డ్రామా ఆడుతున్నారని అన్నారు . నిజంగా బిసిల పట్ల ప్రేమ ఉంటే రిజర్వేషన్లపై కేంద్రంతో కొట్లాడండి. దానికి మేమంతా కలిసి వస్తాం.అయినా ఈ రేవంత్‌రెడ్డికి బిసిల పట్ల ప్రేమ ఉంటే రిజర్వేషన్లు కోర్టులో నిలబడని తెలిసిన కూడా జివో ఇవ్వడమేమిటని అన్నారు .

బిసి బంధు బందు పెట్టింది, చేప పిల్లల పంపిణీ బందు పెట్టింది, నాయి బ్రాహ్మణ, రజకుల ఉచిత విద్యుత్‌ బకాయిలు పెండిరగ్‌లో పెట్టింది. గొల్లకురుమలకు గొర్రెలు బందు పెట్టి ఇంకా ఏదో బిసిల మీద ప్రేమ ఉన్నట్లు నటిస్తుంది.ఆనాడు ఈ రేవంత్‌రెడ్డి  ఏమన్నారు. అసలు రాష్ట్రాలకి రిజర్వేషన్ల అధికారం ఇవ్వడం నేరం అడుగితే జైల్లో పెట్టాలన్న ఈ రేవంత్‌రెడ్డిని మరి ఇప్పుడు ఏ జైల్లో పెట్టాలి.42 శాతం బిల్లు గవర్నర్‌ ఆమోదం పొందకుండా ఎన్నికలకు పోవటమే ఒక తెలివి తక్కువ పని అయినా కూడా ఈ రిజర్వేషన్‌ చట్టం ఆమోదం పొందకుండా ఎన్నికలు నిర్వహించి, మళ్లీ ఆ ఎన్నికలు రద్దు అయితే నష్టపోయేది బిసి బిడ్డలు కాదా ?అంటే బిసిలను ఆర్ధికంగా నష్టపరచడమే మీ ప్రభుత్వ ధ్యేయమా ? అని ఎర్రబెల్లి అన్నారు 

ఈ కాంగ్రెస్‌ అసమర్ధ పాలన వల్ల గ్రామాలు అన్ని వెనకబడి పోతున్నాయి. 22 నెలల పాలనలో గ్రామ పంచాయితీలకు ఈ ప్రభుత్వం ఒరగ బెట్టింది ఏం లేదు ఆనాడు కేసీఆర్‌ గ్రామాలు బాగుపడతేనే రాష్ట్రం బాగుంటుందని గ్రామ పంచాయితీలకు అధిక నిధుల ఇచ్చి అభివృద్ది చేస్తే..ఈ ప్రభుత్వం ఆ గ్రామాల అభివృద్దికి అడ్డుగా నిలిచి గ్రామాలు ఆధ్వాన్న స్థితిలోకి వచ్చాయని అన్నారు …

Related posts

ఖమ్మం నుంచి కాంగ్రెస్ లోకసభ అభ్యర్థి రాయల నా … ?మండన నా …?

Ram Narayana

కాంగ్రెస్‌కు నాయకుల్లేరు, బీజేపీకి కేడర్ లేదు: హరీశ్ రావు

Ram Narayana

ఇక ప్రజల సర్కారు పని మొదలైంది: రాహుల్ గాంధీ

Ram Narayana