అంతర్జాతీయం

సముద్రంలో అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం.. నౌకలపై ప్రత్యేక ఛార్జీ వసూలు..

  • పరస్పరం ప్రత్యేక ఛార్జీ వసూలు చేస్తున్న ఇరుదేశాలు
  • అమెరికా జెండాతో వచ్చే ఓడలపై ప్రత్యేక ఛార్జీని వసూలు చేస్తామన్న చైనా
  • చైనా నిర్మించిన నౌకలకు ప్రత్యేక మినహాయింపు ఉంటుందని వెల్లడి

అమెరికా – చైనా మధ్య వాణిజ్య యుద్ధం మరింత ముదురుతోంది. తాజాగా, ఇరుదేశాలు నౌకలపై పరస్పరం ప్రత్యేక ఫీజులను ప్రకటించాయి. అమెరికా యాజమాన్యంలోని నౌకలు, అమెరికా నిర్వహించే లేదా ఆ దేశపు జెండాలతో వచ్చే ఓడలపై ప్రత్యేక ఛార్జీని వసూలు చేయనున్నట్లు చైనా ప్రకటించింది. చైనాలో నిర్మించిన నౌకలకు మాత్రం ఈ ఛార్జీ నుంచి మినహాయింపు ఉంటుందని స్పష్టం చేసింది. ఇదివరకే అమెరికా కూడా చైనా నౌకలపై ప్రత్యేక ఫీజును వసూలు చేస్తోంది.

అమెరికా విధిస్తున్న అదనపు సుంకాలపై చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ స్పందించింది. వాణిజ్య యుద్ధం, టారిఫ్‌ల అంశంపై తమ వైఖరి స్థిరంగా ఉందని, అమెరికా ఈ తరహా యుద్ధం కోరుకుంటే తాము చివరి వరకు పోరాడుతామని పేర్కొంది. ఒకవేళ చర్చలు జరపడానికి సిద్ధమైతే, అందుకు తమ తలుపులు తెరిచే ఉన్నాయని వాణిజ్య మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి తెలిపారు.

Related posts

పహల్గామ్ దాడికి ప్రతీకారంగానే ‘ఆపరేషన్ సిందూర్’ -… కేంద్ర రక్షణ, విదేశాంగ శాఖల సంయుక్త ప్రకటన

Ram Narayana

అమెరికా-భారత్ మధ్య పెరిగిన గ్యాప్… అవకాశాన్ని అనుకూలంగా మలుచుకునే దిశగా పాకిస్థాన్!

Ram Narayana

రష్యాలో విమాన ప్రమాదం.. కిరాయి సైన్యం వ్యాగ్నర్ గ్రూప్ అధినేత మృతి

Ram Narayana