తెలంగాణ వార్తలు

డిసెంబర్ మొదటివారంలో ఖమ్మంలో పీడీఎస్ యూ రాష్ట్ర మహాసభలు …

ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం PDSU తెలంగాణ రాష్ట్ర 23 వ మహాసభలు డిసెంబర్ మొదటి వారం ఖమ్మం జిల్లా కేంద్రంగా జరగనున్న నేపథ్యంలో ఆహ్వాన సంఘం ఎన్నిక సమావేశం PDSU రాష్ట్ర అధ్యక్షుడు కంపాటి పృథ్వి అధ్యక్షతన రామనర్సయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగింది.

ఈ సన్నాహక సమావేశానికి మాజీ TPTF రాష్ట్ర కార్యదర్శి మనోహర్ రాజు గారు హాజరై మాట్లాడుతూ నేడు దేశంలో మతం పేరుతో ప్రజలను విభజన చేస్తున్న నేటి రాజకీయాల్లో విద్యార్థులు,యువకులు మార్పు కొరకు ప్రజాస్వామ్య పరిరక్షణకై కదలాలి అని ఆహ్వాన సంఘం ఏర్పాటు సమావేశంలో పిలుపు నిచ్చారు.

మోదీ ప్రభుత్వం విద్యాను సంక్షోభంలోకి నేడుతూ నూతన జాతీయ విద్యావిధానం పేరుతో మత రాజకీయాలను జొప్పించే విధంగా కృషి చేస్తున్నది,
విదేశీ విశ్వ విద్యాలయాలకు స్వాగతం పలుకుతున్నది. దేశంలోని ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో బోధన,బోధనేతర సిబ్బంది నియమించకపోవడం మూలాన విద్యాకుంటు పడుతున్నది. విద్యార్థులకు రావాల్సిన ఫెలోషిప్ లను నిలిపివేస్తున్నారు అని అన్నారు.
భేటీ పడవో,భేటీ బచావోల పేరుతో స్త్రీ విద్య కోసం ఆర్భాటాలు చేశారు తప్ప మహిళా సాధికారత కోసం కృషి చేయలేదు.మెకిన్ ఇండియా,మేడిన్ ఇండియా ల పేరుతో మోడీ సంవత్సరానికి కోటి ఉద్యోగాలు కల్పిస్తానని గొప్పలు చెప్పుకోవడం మాత్రమే జరిగింది తప్ప నిరుద్యోగ సమస్య పరిష్కరించలేకపోయారు అన్నారు.

రాష్ట్రంలో ప్రజాపాలన పేరుతో అధికారంలోకి వచ్చిన రేవంత్ ప్రభుత్వం గత ప్రభుత్వాల మాదిరిగానే విద్యారంగం పట్ల వీరి డొల్ల తనం స్పష్టంగా కనిపిస్తున్నది.విద్యకు అరకొర నిధుల కేటాయింపుతో ప్రభుత్వ విద్యా సంస్థల్లో రాష్ట్ర వ్యాప్తంగా సమస్యలు విలయతాండవం చేస్తున్నాయి. ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు విడుదల చెయ్యాలని ప్రయివేటు యాజమాన్యాలు నిరవధిక బంద్ కు పిలుపునిచ్చాయి, బెస్ట్ అవైలబుల్ స్కూల్ లో చదువుతున్న 30 వేల మంది విద్యార్థులకు 220కోట్లకు పైగా రూపాయలు చెల్లించక పోవడంతో విద్యార్థులను పాఠశాలల యాజమాన్యాలు బయటకు పంపిస్తున్నారు మాట్లాడారు.

అలాగే ప్రగతిశీల పూర్వ విద్యార్థి వడ్డెల్లి కృష్ణ మూర్తి , ఐవి రమణ గారు మాట్లాడుతూ ఫాసిస్ట్ ఆలోచన పరులు ఆనాడు ఉస్మానియా కేంద్రంగా జార్జ్ రెడ్డి ని కత్తి పోట్లతో పొడిచి చంపిందో అలాగే నేడు ప్రగతిశీల భావజాలంపై మోడీ ప్రభుత్వం దాడి జరుపుతున్నది,ప్రశ్నించే గొంతులను జైల్లో నెడుతున్న ఈ సంధి కాలంలో PDSU రాష్ట్ర మహాసభలు ఖమ్మం కేంద్రంగా విజయవంతం కావాలని అలాగే నూతన ఆలోచనల వొరవడితో ముందుకు సాగాలని కోరారు.

పి డి ఎస్ యు రాష్ట్ర 23వ మహాసభల విజయవంతం కోసం ఆహ్వాన సంగం ఏర్పాటు చేయడం జరిగింది. ఆహ్వాన సంఘం గౌరవ అధ్యక్షులుగా ప్రముఖ విద్యావేత్త హైవి రమణ రావు, అధ్యక్షులుగా వి మనోహర్ రాజు మాజీ టి పి టి ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,
ప్రధాన కార్యదర్శిగా కాంపాటి పృద్వి,
రాష్ట్ర కోశాధికారిగా ఆవుల అశోక్ మాజీ పి డి ఎస్ యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, లతోపాటు మరి కొంతమందిని ఉపాధ్యక్షులుగా సహాయ కార్యదర్శులుగా సభ్యులుగా ఎన్నుకోవడం జరిగింది.

ఈ కార్యక్రమంలో పి డి ఎస్ యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ అనిల్, పూర్వ పి డి ఎస్ యు నాయకులు పోటు రంగారావు, ఆవుల అశోక్, ప్రముఖ విద్యాసంస్థల యాజమాన్యాలు రామచంద్రరావు, మతీన్, రవి మారుత్, శశిధర్ రెడ్డి, బ్రహ్మం,సూరిబాబు, ప్రముఖ వైద్యులు జగదీష్, సర్పంచుల సంఘం రాష్ట్ర మాజీ అధ్యక్షులు పుసులూరి నరేందర్, ఎస్ విజయ్ టి పి టి ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి, రాయల రవికుమార్ పెన్షనర్స్ సంఘం నాయకులు, సిహెచ్ శిరోమణి పిఓడబ్ల్యు రాష్ట్ర కార్యదర్శి, తేలే రాకేష్ పి వై ఎల్ రాష్ట్ర అధ్యక్షులు, లక్ష్మణరావు ప్రైవేట్ లెక్చరర్ సంఘం నాయకులు, దేర్ కళాశాల యాజమాన్యం కిరణ్, రిటైర్డ్ లెక్చరర్స్ చావా రమేష్ బాబు, ఆర్ కృష్ణయ్య, పూర్వ, ప్రస్తుత విద్యార్థి నాయకులు జి రామయ్య, నామాల ఆజాద్, కమ్మకోటి. నాగేశ్వరరావు, ఝాన్సీ, కే శ్రీనివాస్, నరేందర్, వెంకటేష్,అఖిల్, సాయి రాకేష్ అనూష, లక్ష్మణ్, సంధ్య, బల్లేపల్లి వెంకటేశ్వర్లు, భరత్, రామారావు, మల్లయ్య, దేవయ్య, ధరణి కృష్ణ , మమత, లక్ష్మి, శివ కుమార్ హరీష్ యశ్వంత్ వినయ్ సురేష్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

అధిక వడ్డీ ఆశతో కొంప కొల్లేరు …భాదితుల లబోదిబో …

Ram Narayana

హైదరాబాద్ జూలో ఏనుగు దాడి… జూ ఉద్యోగి మృతి

Ram Narayana

తెలంగాణలో వర్ష బీభత్సం… సీఎం రేవంత్ రెడ్డి ఉన్నతస్థాయి సమీక్ష

Ram Narayana