తెలంగాణ వార్తలు

బీసీలకు 42 శాతం రిజర్వేషలు కోసం తెలంగాణ అఖిలపక్షాల బంద్ జయప్రదం..

తెలంగాణాలో అసెంబ్లీ ఆమోదించిన ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ లకు 42 శాతం రిజర్వేషలు అమలు చేయాలనీ కోరుతూ శనివారం బీసీ సంఘాలు ఇచ్చిన బంద్ జయప్రదమైంది .రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు ఈ బంద్ కు మద్దతు ప్రకటించడమే కాక స్వయంగా పాల్గొన్నాయి…అయితే బీసీ రిజ్వేషన్లను బీజేపీ అడ్డుకుంటుందని కాంగ్రెస్ ఆరోపిస్తుండగా , కాంగ్రెస్ బీజేపీలు కలిసి దొంగాట ఆడుతున్నాయని బీఆర్ యస్ విమర్శిస్తోంది …రాజ్యాంగంలోని 9 వ షడ్యూల్ లో చేర్చి బిల్లుకు చట్టబద్దత కల్పించాలని బీసీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి..ఇప్పటికే అసెంబ్లీలో మద్దతు పలికిన బీజేపీ బిల్లు ఆమోదం కోసం చిత్తశుద్ధితో పనిచేయాలని ప్రధాని మోడీ వద్దకు అఖిలపక్షం వెళ్లి కలిసేందుకు ఆపాయిన్మెంట్ తీసుకోవాలని కాంగ్రెస్ కోరుతుంది ..

తెలంగాణలో బీసీల రాజకీయాలు భిన్నంగా సాగుతున్నాయి. రిజర్వేషన్ల కోసం అన్ని పార్టీలు మద్దతు ప్రకటించడంతో బంద్ జరుగుతోంది అనిపించారు. అయితే ఈ బంద్ అంతా రాజకీయ నేతల హడావుడిలోనే కనిపిస్తోంది. ఆ హడావుడిలోనూ ఎవరి అజెండా వారు అమలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అంతర్గత రాజకీయాలపైనా ఇతర పార్టీల నేతలు కామెంట్లు చేయడం ఇక్కడ స్పెషాలిటీ.

వివాదాల్లో ఇరుక్కున్న కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్‌లను మంత్రి పదవుల నుంచి తప్పిస్తే తాము ఊరుకోబోమని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ప్రకటించారు. మొత్తం బీసీ వర్గాలకు ఆ ఇద్దరు మంత్రుల్ని ఆయన ప్రతినిధుల్ని చేసేశారమో కానీ ఈ ప్రకటన కాస్త విచిత్రంగా ఉందని బీజేపీలో గుసగుసలు ప్రారంభమయ్యాయి. అయినా కొండా సురేఖ, పొన్నంలను తప్పించినా .. సామాజిక సమీకరణాలను చూసుకుని మరో బీసీ నేతలకే అవకాశం కల్పిస్తారు. అప్పుడు వారు బీసీ కాకుండా పోతారా? అనే మాటలు వినిపిస్తున్నాయి ..

బీసీ రిజర్వేషన్ల రాజకీయాలను మెల్లగా రెడ్డి వర్సెస్ బీసీ అన్నట్లుగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగా ఈటల రాజేందర్ కూడా తన వంతు రాజకీయం చేస్తున్నారు. ఇక్కడ కొసమెరుపేమిటంటే.. ఆటల రాజేందర్ భార్య రెడ్డి సామాజికవర్గం కావడంతో.. తన పిల్లలకు రెడ్డి అని పేర్లు పెట్టారు. కానీ ఆయన బీసీ రాజకీయాల్లో ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారు.

Ponnam Prabhaakar

తెలంగాణ ప్రభుత్వం బీసీ లకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వడానికి రాష్ట్ర వ్యాప్తంగా కుల సర్వే నిర్వహించి శాసన సభ లో చట్టం చేసి గవర్నర్ దగ్గర ఆమోదం నుండి రాష్ట్రపతి దగ్గర పెండింగ్ లో ఉంది.మార్చి 30 నుండి గవర్నర్ దగ్గరకు వెళ్ళిన బిల్లులు ఇంత వరకు ఆమోదం పొందలేదు. గ్రామ పంచాయతీ ఎన్నికలు లేక రెండు సంవత్సరాల నుండి కేంద్ర ప్రభుత్వం నిధులు రాక ఇబ్బందులు ఉంది..అన్ని రాజకీయ పార్టీల. మద్దతు బిల్లులు పాస్ చేసుకోవడం జరిగింది..నిర్ణయం తీసుకోవాల్సిన కేంద్ర ప్రభుత్వం మౌనంగా ఉండడం,తదుపరి చర్యలు తీసుకపోవడం వల్ల అమలు జాప్యం జరుగుతుంది..న్యాయ స్థానాల్లో పోరాటాలు చేస్తాం.. హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేస్తాం..అన్ని రకాల పోరాటాలు జరిగే సందర్భంలో. తెలంగాణ బలహీన వర్గాలు జాయింట్ యాక్షన్ కమిటీ గా ఏర్పడి మాదిగ దండోరా ,మాల మహానాడు ,బీసీ సంఘాలు ఐక్యత బీజేపీకి త‌ప్ప‌క త‌గులుద్ది

konda Surekha

కాంగ్రెస్ నాయకులు, కార్య‌క‌ర్త‌ల‌తో క‌లిపి… బీజేపీ, బీఆర్ఎస్ తోడు దొంగ‌లు… బీసీ ద్రోహులు అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

ఎల్ఓపీ రాహుల్ గాంధీ ఆలోచ‌న మేర‌కు బీసీల‌కు 42 శాతం రిజ‌ర్వేష‌న్లు ఇవ్వాల‌ని అనుకున్నం… మా ముఖ్య‌మంత్రి ఒక రెడ్డి బిడ్డ అయిన‌ప్ప‌టికీ చాలెంజ్ గా తీసుకొని బిల్లును తీసుకొచ్చారు.

ఆర్డినెన్స్ తీసుకొచ్చినం… అసెంబ్లీలో బిల్లు పాయి చేయించుకున్నం. అసెంబ్లీలో బీసీ బిల్లుకు మ‌ద్ధ‌తు తెలిపిన బీజేపీ… గ‌వ‌ర్న‌ర్ ఆమోదం తెలుప‌కుండా అక్కడ అడ్డుకుంటూ… దొంగాట ఆట ఆడుతున్న‌ది.

రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ ఒక్క సంత‌కం పెట్టి… బీసీ బిల్లుకి ఆమోదం తెలిపి ఉంటే ఎక్క‌డా స‌మ‌స్య వ‌చ్చేది కాదు. ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికలు జరిగేవి. బీజేపీ డ్రామా వ‌ల్ల బీసీల ఆశ‌లన్నీ అడియాశ‌ల‌య్యాయి
బీసీ ర్యాలీలో కిందపడిపోయిన కాంగ్రెస్ నాయకుడు వీ హనుమంత రావు

ర్యాలీ చేస్తుండగా బ్యానర్ అడ్డు తగలడంతో ముందుకి పడిపోయిన హనుమంతరావు. దీంతో ఆయనను అక్కడున్న కార్యకర్తలు

తెలంగాణ రాష్ట్రంలో మా జనాభా.ఎంతో…మాకు అంత వాటా…కావాలి..పాలకుల కుట్రలను సహించేది లేదు…బీసీ కులాలకు 42శాతం రిజర్వేషన్లు ఖరారు చేయాల్సిందే….లేకపోతే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం జరిగిన ఉద్యమం తరహా లో రాష్ట్రంలో మరో ఉద్యమం ఉవ్వెత్తున ఎగసి పడుతుంది…అంటూ పలువురు బీసీ సంఘాల నాయకులు హెచ్చరించారు. బీసీ లకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీసీ కులాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో శనివారం రాష్ట్ర వ్యాప్త బంద్ లో భాగంగా ఖమ్మం లో చేపట్టిన బంద్ విజయవంతమైంది. బంద్ లో బీసీ సంఘాల తో పాటు సీపీయం,సిపిఐ,ఎం.ఎల్.మాస్ లైన్ ,న్యూడెమోక్రసీ,కాంగ్రెస్, బిఆర్ ఎస్ నాయకులతో పాటు పలువురు ఎస్సి,ఎస్టి కుల సంఘాల నాయకులు మద్దతు గా పాల్గొన్నారు.బంద్ సందర్భంగా తొలుత తెల్లవారు జామున వారు ఖమ్మం బస్ డిపో ముట్టడి కార్యక్రమం నిర్వహించారు.అదేవిధంగా పాత బస్టాండ్ వద్ద ధర్నా నిర్వహించారు. అఖిల పక్ష నాయకులు , బీసీ సంఘాల నాయకులు వన్,టు,త్రీ టౌన్ ప్రాంతాలలో బంద్ నిర్వహించి ర్యాలీ గా పాత బస్టాండ్ కు చేరుకున్నారు.అక్కడి నుండి వైరారోడ్ మీదుగా జడ్పీ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్భంగా జరిగిన సభలో నాయకులు మాట్లాడారు.

బీసీ లకు 42 శాతం రిజర్వేషన్లు వెంటనే అమలు చేయాలని,లేనియెడల రాష్ట్రం లో తెలంగాణ ఏర్పాటు కోసం జరిగిన ఉద్యమం తరహా లో మరో ఉద్యమం ఉవ్వెత్తున ఎగసి పడుతుంది అని బిఆర్ఎస్ సీనియర్ నాయకులు, బీసీ నేత గుండాల కృష్ణ తెలిపారు.బిల్లును 9వ షెడ్యూల్ లో చేర్చి ఆమోదింప జేయాలని డిమాండ్ చేశారు.లేనియెడల బీసీ లా ఆగ్రహాన్నిచవిచూడాల్సి వస్తుందని హెచ్చరించారు.

బీసీల రిజర్వేషన్ల పెంపుపై మాట్లాడేందుకు కాంగ్రెస్, బీజేపీ లకు అర్హత లేదు: న్యూడెమోక్రసీ నాయకులు గోగినేపల్లి వెంకటేశ్వర్లు …బీసీ బిల్లు పై బిజెపి,కాంగ్రెస్ పార్టీ లకు బీసీ బిల్లు పై మాట్లాడే హక్కు లేదని న్యూడెమోక్రసీ నేత గొగినేపల్లి వెంకటేశ్వర్లు ఆరోపించారు.
తెలంగాణ అసెంబ్లీ, కౌన్సిల్ పాస్ చేసిన బిల్లులను ఆమోదించకుండా నెలల తరబడి పెండింగ్ లో పెట్టిన బీజేపీ ,కాంగ్రెస్ లు ఇప్పుడు బంద్ లో పాల్గొంటున్నాయని మండి పడ్డారు. బీసీ ల పై ప్రేమ ఉంటే బిల్లు ఆమోదం పొందేలా చూడాలనీ డిమాండ్ చేశారు.


అధికారంలో ఉన్న పాలకులు తమ అవసరాలకు బీసీ లను వాడుకొని వంచిస్తున్నారని సీపీఐ నేత భాగం హేమాంతరావు ఆరోపించారు. బీసీ ల రిజర్వేషన్ల కోసం వారు చేపట్టే ఆందోళనలకు తమ పార్టీ పూర్తి మద్దతు ఉంటుందన్నారు.


కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలు అవలంబిస్తూ బీసీల పట్ల ద్వంద్వ వైఖరి అవలంభిస్తోందని మండిపడ్డారు.అధికారంలో ఉండి బిల్లు ఆమోదం కోసం పోరాడటం విడ్డూరంగా ఉందన్నారు వెంటనే బీసీ లకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు.


కేంద్రం వైఖరి తోనే బీసీల రిజర్వేషన్లు అమలు కావడం లేదని కాంగ్రెస్ నేత పువ్వాళ్ల దుర్గా ప్రసాద్ అన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం రిజర్వేషన్ల ను అమలు చేయడానికి
సిద్ధంగా ఉందన్నారు. కేంద్రం వైఖరి తోనే బీసీల కు అన్యాయం జరుగుతుందన్నారు.ఈ కార్యక్రమంలో ఆయా పార్టీల,కుల,ప్రజా సంఘాల నాయకులు నున్నా నాగేశ్వర్రావు,దండి సురేష్,కొత్తా సీతారాములు,యర్రా శ్రీనివాసరావు నూనె శశిధర్,ఆవుల అశోక్, మీగడ రామారావు,వై.విక్రమ్, కురాకుల నాగభూషణం,జా విద్,కనకం జనార్దన్, బొమ్మా రాజేశ్వర రావు, కత్తి నెహ్రూ,తూరుగంటి అంజయ్య, చెరుకుపల్లి నాగేశ్వరరావు, పొదిల సతీష్,లింగాల రవికుమార్,దానయ్య, లింగరాజు తదితరులు పాల్గొన్నారు.

బంద్ రూపంలో నిరసన మంచిదే…రిజర్వేషన్లు అమలు కావాల్సిందే ..
అందరు బంద్ కు మద్దతు ఇచ్చారు …
మరి నిరసన ఎవరి మీద ,
బిల్లు పెట్టిన కాంగ్రెస్ మీదనా ?
బిల్లు అడ్డగించిన బీజేపీ మీదనా ?
బీసీ బిల్లు పాస్ కాకూడదు అని కోరుకున్న బీఆర్ యస్ మీదనా ?
*అందరూ శాకాహారులే మరి రొయ్యల మూట ఎక్కడ పోయే ?

Related posts

రాజోలిలో ఇథనాల్ చిచ్చు : రైతుల ఆందోళనతో తీవ్ర ఉద్రిక్తత

Ram Narayana

సీనియర్ జర్నలిస్టు ఫజల్ మృతి…షాక్ అయిన మిత్రులు

Ram Narayana

కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇంజినీర్ కేసీఆరే…మూడు ప్రాజెక్టులకు రాత్రిపూటే డిజైన్లు…

Ram Narayana