ఆఫ్ బీట్ వార్తలు

గడ్డితో కరెంట్.. పంజాబ్‌లో ఏకంగా ఫ్యాక్టరీకే సప్లయ్ చేస్తున్నారు

గడ్డితో కరెంట్.. పంజాబ్‌లో ఏకంగా ఫ్యాక్టరీకే సప్లయ్ చేస్తున్నారు

పంజాబ్‌లో రైతులు పంట వ్యర్థాలను తగలబెడుతున్నారు.
పంట వ్యర్థాల సమస్య పరిష్కారానికి ప్రభుత్వ సూచనలు, మద్దతు లేకపోవడంతో వాటికి నిప్పు పెట్టడం తప్ప మరో మార్గం లేదంటున్నారు.
దీని వల్ల దేశ రాజధాని దిల్లీతో పాటు ఉత్తరాది రాష్ట్రాల్లో కాలుష్యం పెరుగుతోంది.
ఓ వైపు పంట వ్యర్థాలకు నిప్పుపెడుతున్న వారిని.. మరో వైపు అదే పంట వ్యర్థాలను ఇంధనంగా మార్చుకుని వ్యాపారం చేస్తున్నారు ..పంజాబ్ ఫతేఘర్‌ జిల్లాలో ఉన్న ఈ పరిశ్రమ పంట వ్యర్థాలను..విద్యుదుత్పత్తికి ఇంధనంలా వినియోగిస్తోంది. ఇది కాలుష్యం సమస్యను పరిష్కరించడమే కాకుండా ఈ పంట వ్యర్థాలను అమ్మడం ద్వారా రైతులు కూడా లాభపడుతున్నారు. రైతు చేసిన ఈ వినూత్న ప్రయోగం చూసి ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు పలువురు రైతులు ..

‘పంటవ్యర్థాలు ఓ రకమైన ఇంధనం . చౌకైన ఇంధనం. దీని ప్రాధాన్యత చాలా మందికి తెలీదు.. దీంతో సులభంగా విద్యుదుత్పత్తి చేయచ్చనే విషయం చాలా మందికి తెలియదు. మేం ప్రయత్నించాం… విజయం సాధించాం. ముందుగా ఈ వ్యర్థాలన్నీ బాయిలర్‌లో వేస్తాం. బాయిలర్ నుంచి ఉత్పత్తి అయ్యే నీటిఆవిరి ద్వారా విద్యుదుత్పత్తి చేస్తున్నాం. ఈ విద్యుత్తును ఉపయోగించి మేం మా ఫ్యాక్టరీని నడిపిస్తున్నాం’ అని చెప్పారు గణేష్ ఎడిబుల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ హన్స్‌రాజ్ గార్గ్.

Related posts

రష్యాలో శృంగార మంత్రిత్వశాఖ.. ఏర్పాటు వెనక కారణం ఇదే!

Ram Narayana

గాలికి నోట్లో పడ్డ ఆకును రోడ్డుపై ఉమ్మేసినందుకు 30 వేల జరిమానా..!

Ram Narayana

అదృష్టం అంటే ఇదే.. భారతీయుడిని వరించిన రూ.61 కోట్ల లాటరీ..

Ram Narayana