
ఎర్రకోట మెట్రో రైలు స్టేషన్ సమీపంలోరెండు కార్లలో భారీ పేలుళ్లు 17 మంది మృతి…
చెల్లాచెదురైన మృత దేహలు..రక్తసిక్తంగా మెట్రో స్టేషన్ ప్రాంతం
10 కి పైగా వాహనాల మంటలు అంటుకొని దగ్ధం
10 నిమిషాల్లోనే అధికారులు ఘటనాస్థలానికి చేరుకున్నారన్న అమిత్ షా
ఘటనా ప్రాంతాన్ని , ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నవారిని పరామర్శించిన అమిత్ షా
చాందినీ చౌక్ మెట్రో స్టేషన్ సమీపంలో ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఆగగానే పేలిన కారు
రంగంలోకి దిగిన ఎన్ఐఏ, ఫోరెన్సిక్ బృందాలు
మార్కెట్లకు సెలవు కావడంతో తగ్గిన ప్రమాద తీవ్రత
నగర పోలీస్ కమిషనర్‌తో మాట్లాడిన అమిత్ షా
ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్‌తో ఎప్పటికప్పుడు మాట్లాడుతున్న కేంద్ర మంత్రి
ఇప్పుడేం చెప్పినా తొందరపాటు అవుతుందన్న సీఆర్పీఎఫ్ డీఐజీ
పేలుడు ఘటనపై రాహుల్, మమత, ప్రియాంక దిగ్భ్రాంతి
అందరం చనిపోతామనుకున్నామంటూ ప్రత్యక్ష సాక్షులు ఆవేదన
ఘటనాస్థలికి చేరుకున్న 20 ఫైర్ ఇంజన్లు, పోలీసుల భారీ బందోబస్తు
దేశవ్యాపితంగా హైఅలర్ట్ ..విస్తృత తనిఖీలు

ఢిల్లీలో అత్యంత రద్దీగా ఉండే ఎర్రకోట సమీపంలోని ,చాందినీచౌక్ వద్దగల మెట్రోస్టేషన్ ట్రిఫిక్ సిగ్నల్ వద్ద జరిగిన ఘోర ప్రమాదంలో 17 మంది చనిపోయారు .. అయితే ముందు ఒక కారులో పేలుడు సంభవించి మొదట 8 మంది చనిపోగా ,చికిత్స పొందుతూ మరో ఐదుగురు చనిపోయారు.. రాత్రి పొద్దు పోయిన తర్వాత ప్రమాదం ఒక కారులో కాదని రెండు కార్లలో భారీ పేలుళ్లు సంభవించి 17 మంది మృతి చెందారని ప్రకటించారు.. అయితే చనిపోయింది 8 మందినా..?లేక 13 మందినా , 17 మందినా అనేది చూడాల్సి ఉంది మరణాల సంఖ్యపై కచ్చితమైన సమాచారం రావాల్సి ఉంది .. ఇది పెద్ద ఉగ్రకుట్రగానే అనుమానించాల్సి ఉంటుందని అధికారులు అంటున్నారు ..దర్యాప్తు కోసం ఎన్ ఐ ఏ , ఎన్ ఎస్ జి , క్లూస్ టీం , డాగ్ స్కాడ్ లను రంగంలోకి దింపారు .. సరిగ్గా 6 గంటల 52 నిమిషాలకు ఈ సంఘటన జరిగినట్లు పోలీస్ ఉన్నతాధికారులు తెలిపారు ..ట్రాఫిక్ రెడ్ సిగ్నల్ వద్ద జరిగిన ఈ పేలుడుతో ఒక్క సరిగా ఉలిక్కిపడ్డ ప్రజలు పరుగులు తీశారు..క్షణాల్లోనే స్పాట్ లోనే 8 మంది చనిపోగా ,మరో ఐదుగురు చికిత్స పొందుతూ మరణించారు ..పేలుడు జరిగిన ప్రాంతమంతా రక్తసిక్తం అయింది ..మృతదేహాల మాంసపు ముద్దలు 100 మీటర్ల వరకు చెల్లాచెదురుగా ఎగిరి పడి హృదవిదారకంగా కనిపిస్తున్నాయి ..ఆ ప్రాంతమంతా ప్రజల రోదనలతో మిన్నంటింది … ఒక వ్యక్తి చేయి దూరంగా పడటం చూసిన స్థానికులు భయకంపితులు అయ్యారు ..ఇది ఉగ్ర కుట్ర లేక మరేదైనానా అనే విషయాలను చెప్పడం తొందరపాటు అవుతుందని ఢిల్లీ డీజీపీ తెలిపారు .ఇది అత్యంత హేయమైన చర్య అంటూ విమర్శలు వెల్లు ఎత్తుతున్నాయి…ప్రధాని మోడీ కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా కు ఫోన్ చేసి వివారాలు తెలుసుకున్నారు ..మరణించిన వారికీ సంతాపం తెలిపారు…అమిత్ షా వెంటనే సంఘటన జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు .. ఎల్ ఎన్ జెపి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నవారిని పరామర్శించి దైర్యం చెప్పారు.. పేలిన కారు హర్యానా రాష్ట్ర రిజిస్ట్రేషన్ తో ఉంది ..కారు నెంబర్ HR 26 7476 గా ఉంది ..యజమాని నీదిమ్ ఖాన్ గా గుర్తించారు ..ఘటనకు భాద్యుడిగా భావిస్తున్న ఒక్కడిని పోలీసులు అదుపులోకి తీసుకోని విచారిస్తున్నట్లు తెలుస్తుంది..దీనిపై ఇప్పటికే ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించినట్లు కేంద్రమంత్రి అమిత్ షా ప్రకటించారు .ఢిల్లీలో ఇప్పటివరకు జరిగిన 34 సంఘటనల్లో 101 మంది చనిపోయారు..2011 జరిగిన సంఘటనలో 25 మంది చనిపోయారు…ఎన్డీయే అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన మొదట సంఘటన గా చెపుతున్నారు ..

దేశ రాజధాని ఢిల్లీలో భారీ పేలుడు సంభవించింది. ఎర్రకోట మెట్రో రైలు స్టేషన్ సమీపంలో రెండు కార్లలో భారీ పేలుళ్లు … ఈ ఘటనలో పలు వాహనాలకు మంటలు అంటుకున్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయని సమాచారం. ఎనిమిది కార్లు ధ్వంసమయ్యాయి. ఒక కారులో పేలుడు సంభవించగా, పక్కనే ఉన్న మిగిలిన కార్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. పేలుడులో గాయపడిన ఇద్దరిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో ఢిల్లీ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. దేశవ్యాపితంగా హైఅలర్ట్ ప్రకరించారు …బొంబాయి ,హైద్రాబాద్ , బెంగుళూర్, చెన్నై , కలకత్తా ,లక్నో , పాట్నా , భోపాల్ , నాగపూర్ , పూణే , తదితర ప్రధాన నగరాల్లో విస్తృత తనిఖీలు చేపట్టారు ..
గేట్ నెంబర్-1 సమీపంలో పార్కింగ్ చేసిన కారులో సాయంత్రం 6.52 నిమిషాలకు పేలుడు సంభవించింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుంది.
ఏడు ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తెస్తున్నారు. ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు కూడా సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. పేలుడుకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఇది ఉగ్రవాద చర్యనా? లేక ప్రమాదవశాత్తు జరిగిందా? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.ఢిల్లీ పేలుడు ఘటనలో 13 మంది మృతి కి పెరిగిన మృతుల సంఖ్య

దేశ రాజధాని ఢిల్లీ సోమవారం సాయంత్రం భారీ పేలుడుతో ఉలిక్కిపడింది. ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో పార్క్ చేసి ఉన్న కార్లలో శక్తిమంతమైన పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో మరణించిన వారి సంఖ్య 17 కి పెరిగింది. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనతో అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేసింది. ముఖ్యంగా ఢిల్లీ, ముంబై, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో హై అలర్ట్ ప్రకటించింది.
పేలుడు సమాచారం అందిన వెంటనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. హోంమంత్రి అమిత్ షా వెంటనే ఢిల్లీ పోలీస్ కమిషనర్ సతీశ్ గొల్చా, ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) చీఫ్ తపన్ డేకాలతో ఫోన్‌లో మాట్లాడారు. అలాగే, జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) డైరెక్టర్ జనరల్ సదానంద్ వసంత్‌కు ఫోన్ చేసి, వెంటనే ఎన్ఐఏ బృందాన్ని ఘటనా స్థలానికి పంపాలని ఆదేశించారు.
గాయపడిన వారిని చికిత్స కోసం సమీపంలోని ఎల్ఎన్‌జేపీ ఆసుపత్రికి తరలించారు. ఎర్రకోట పరిసర ప్రాంతాలు అత్యంత రద్దీగా ఉండటంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది. ఘటనా స్థలానికి 10 అగ్నిమాపక శకటాలు చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చాయి. మరోవైపు, నాగ్‌పూర్‌లోని ఆర్‌ఎస్‌ఎస్ ప్రధాన కార్యాలయం వద్ద కూడా భద్రతను కట్టుదిట్టం చేశారు.
ఇది ఉగ్రవాదుల పనేనని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నప్పటికీ, దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. అయితే, ఇదే రోజు ఉదయం ఢిల్లీ సమీపంలోని హరియాణాలోని ఫరీదాబాద్‌లో జైషే మహ్మద్ (JeM), అన్సార్ ఘజ్వత్-ఉల్-హింద్ ఉగ్రవాద సంస్థలతో సంబంధం ఉన్న ఓ భారీ ఉగ్రవాద ముఠాను జమ్మూకశ్మీర్ పోలీసులు ఛేదించడం గమనార్హం. ఈ దాడిలో ఏడుగురు ఉగ్రవాదులను అరెస్ట్ చేయడంతో పాటు, 2,900 కిలోల పేలుడు పదార్థాలు, ఏకే-47 రైఫిళ్లు, పిస్టళ్లు, టైమర్లు స్వాధీనం చేసుకున్నారు.
హ్యుందాయ్ ఐ20 కారులో పేలుడు: ఢిల్లీ పేలుడుపై అమిత్ షా ఫస్ట్ రియాక్షన్

ఢిల్లీలోని ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో జరిగిన భారీ పేలుడు ఘటనపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పందించారు. HR 26 7476 నెంబర్ గల హ్యుందాయ్ ఐ20 కారులో పేలుడు సంభవించిందని ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈరోజు సాయంత్రం ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలోని సుభాష్ మార్గ్ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద కారులో పేలుడు సంభవించిందని తెలిపారు. ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ పేలుడు ఘటనలో కొంతమంది ప్రాణాలు కోల్పోయారని, మరికొంతమంది గాయపడ్డారని, కొన్ని వాహనాలు దెబ్బతిన్నాయని తెలిసిందని అన్నారు.
పేలుడు సమాచారం అందిన వెంటనే ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్, ఢిల్లీ స్పెషల్ బ్రాంచ్ బృందాలు 10 నిమిషాల్లోనే సంఘటన స్థలానికి చేరుకున్నాయని ఆయన తెలిపారు. ఎఫ్ఎస్ఎల్, ఎన్‌ఎస్‌జీ, ఎన్ఐఏ బృందాలు సంఘటన స్థలానికి వెళ్లి సమగ్ర దర్యాప్తు ప్రారంభించినట్లు చెప్పారు. సమీపంలోని సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తారని వెల్లడించారు. తాను ఢిల్లీ నగర పోలీస్ కమిషనర్, స్పెషల్ బ్రాంచ్ ఇన్‌ఛార్జ్‌తో మాట్లాడానని, వారు ఇంకా సంఘటన స్థలంలోనే ఉన్నారని తెలిపారు.
అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని దర్యాప్తు చేస్తామని అమిత్ షా పేర్కొన్నారు. ఈ పేలుడుకు సంబంధించిన కారణాలను ప్రజల ముందు ఉంచుతామని అన్నారు. పేలుడు జరిగిన ప్రాంతానికి తాను వెళుతున్నానని, ఆసుపత్రిని కూడా సందర్శించి క్షతగాత్రులను పరామర్శిస్తానని అమిత్ షా తెలిపారు.
రెడ్ లైట్ వద్దకు ఓ కారు నిదానంగా వచ్చి ఆగింది… ఆ కారులోనే పేలుడు జరిగింది: ఢిల్లీ పోలీస్ కమిషనర్

ఈ ఘటనపై ఢిల్లీ పోలీస్ కమిషనర్ (సీపీ) మీడియాకు వివరాలు వెల్లడించారు. సాయంత్రం 6:52 గంటల సమయంలో ఎర్రకోట వద్ద ఉన్న ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఈ దుర్ఘటన జరిగిందని తెలిపారు. రెడ్ లైట్ పడటంతో ఓ కారు నెమ్మదిగా వచ్చి ఆగిందని, అది ఆగుతున్న సమయంలోనే భారీ శబ్దంతో పేలిపోయిందని వివరించారు.
పేలుడు తీవ్రత చాలా ఎక్కువగా ఉందని, మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా ఛిద్రమయ్యాయని సీపీ తెలిపారు. గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. పేలుడు ధాటికి సమీపంలో ఉన్న అనేక వాహనాలు ధ్వంసం కాగా, కొన్ని వాహనాలు మంటల్లో పూర్తిగా దగ్ధమయ్యాయి.
సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారని సీపీ వెల్లడించారు. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ), ఫోరెన్సిక్ నిపుణుల బృందాలు రంగంలోకి దిగి ఆధారాలు సేకరిస్తున్నాయని తెలిపారు. 
భారీ పేలుడుతో ఢిల్లీలో హైఅలర్ట్… సెలవు కావడంతో తగ్గిన ప్రమాద తీవ్రత
ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో భారీ పేలుడు సంభవించడంతో ఢిల్లీలో హైఅలర్ట్ ప్రకటించారు. నగర వ్యాప్తంగా పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎర్రకోట మెట్రో స్టేషన్ గేట్ 1 వద్ద పార్కింగ్ స్థలంలో నిలిపి ఉంచిన కారులో ఈ పేలుడు సంభవించింది. 17 మంది మరణించారు.
మారుతీ ఎకో కారులో పేలుడు జరిగినట్లు సమాచారం. వెంటనే ఎన్ఏఐ, ఎన్ఎస్‌జీ బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి.
కారులో ఉంచిన పేలుడు పదార్థాలను రిమోట్ కంట్రోల్ ద్వారా పేల్చి ఉంటారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సోమవారం కావడంతో ఢిల్లీలోని పర్యాటక ప్రదేశాలు, మార్కెట్లకు సెలవు ఉంది. అందువల్ల ప్రమాద తీవ్రత తక్కువగా ఉందని స్థానికులు భావిస్తున్నారు. ఎర్రకోట సమీపంలోని మెట్రో రైలు వద్ద పేలుడు సంభవించడంతో పర్యాటకులను లక్ష్యంగా చేసుకున్నారా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి.
ఢిల్లీ పేలుడు ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమిత్ షా ఆరా
ఢిల్లీలోని ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో జరిగిన భారీ పేలుడు ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆరా తీశారు. అమిత్ షా ఢిల్లీ పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడారు. కేంద్ర హోంమంత్రి ఢిల్లీ నగర పోలీస్ కమిషనర్‌తో మాట్లాడారని అధికారులు తెలిపారు. ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్‌తో మాట్లాడి ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటున్నారని వెల్లడించారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పరిస్థితిని సమీక్షించారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో కూడా మాట్లాడి పేలుడు ఘటనపై ఆరా తీశారు.
ఇదిలా ఉండగా, పేలుడు సంభవించిన చోటుకు ఎన్ఎస్‌జీ, ఎన్ఐఏ చేరుకున్నాయి. ఢిల్లీ పోలీసు ప్రత్యేక సెల్, డీఐజీ సీఆర్పీఎఫ్ కూడా సంఘటన స్థలానికి వచ్చాయి. ఈ ప్రమాదంపై ఇప్పుడే ఏమీ చెప్పలేమని, ఏం చెప్పినా తొందరపాటు అవుతుందని సీఆర్పీఎఫ్ డీఐజీ కిశోర్ ప్రసాద్ అన్నారు.
పేలుడు తర్వాత, రోడ్డుపై శరీర భాగాలు కనిపించాయని ఒక ప్రత్యక్ష సాక్షి వివరించాడు. అక్కడి పరిస్థితిని చూసి ప్రజలు షాక్ అయ్యారని అన్నాడు. “రోడ్డుపై ఒకరి చేయి రక్తపు మడుగులో కనిపించడం చూసి మేం షాకయ్యాం. మాటల్లో వివరించలేని విధంగా ఉంది” అని అతను తెలిపాడు. పేలుడు ఘటనలో తీవ్రంగా గాయపడిన వారిని లోక్ నాయక్ ఆసుపత్రికి చికిత్స కోసం తరలించారు. ఆసుపత్రి వద్ద పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.
ఎర్రకోట పేలుడు ఘటనపై జాతీయ నేతల స్పందన

దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం భారీ పేలుడు సంభవించింది. ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో జరిగిన ఈ కారు బాంబు పేలుడులో కనీసం17 మంది ప్రాణాలు కోల్పోగా, మరో డజనుకు పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనతో దేశ రాజధాని ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అధికారులు వెంటనే ఢిల్లీ-ఎన్‌సీఆర్, ఉత్తరప్రదేశ్, ముంబై నగరాల్లో హై అలర్ట్ ప్రకటించారు.
ఈ విషాద ఘటనపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. “ఢిల్లీలో పేలుడు వార్త అత్యంత హృదయ విదారకంగా, ఆందోళనకరంగా ఉంది. అమాయకులు ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరం. ఈ క్లిష్ట సమయంలో మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను” అని రాహుల్ గాంధీ ‘ఎక్స్’ వేదికగా పేర్కొన్నారు.
మమతా బెనర్జీ, ప్రియాంక గాంధీ కూడా ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తూ, క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ ఘటన హృదయాన్ని కలచివేసిందని ప్రియాంక పేర్కొన్నారు. బాధిత కుటుంబాల పరిస్థితి తలచకుంటే గుండె తరుక్కుపోతోందని మమతా పేర్కొన్నారు.
అందరం చచ్చిపోతామనుకున్నాం: ఢిల్లీ పేలుడుపై ప్రత్యక్ష సాక్షుల భయానక అనుభవాలు

“నా జీవితంలో ఇంత పెద్ద శబ్దం ఎప్పుడూ వినలేదు. ఆ పేలుడు ధాటికి మూడుసార్లు కింద పడిపోయాను. ఇక అందరం చచ్చిపోతామనే అనిపించింది,” అంటూ ఢిల్లీ ఎర్రకోట వద్ద జరిగిన భీకర పేలుడు ఘటనను ఓ స్థానిక దుకాణదారుడు వణికిపోతూ వివరించారు. దేశ రాజధానిలోని అత్యంత రద్దీ ప్రాంతమైన ఎర్రకోట సమీపంలో సోమవారం సాయంత్రం చోటుచేసుకున్న ఈ విస్ఫోటనం తీవ్ర భయాందోళనలకు కారణమైంది. ఈ ఘటనలో 13 మంది ప్రాణాలు కోల్పోగా, అనేక మంది గాయపడ్డారు.
ఎర్రకోట మెట్రో స్టేషన్ గేట్ నంబర్ 1 సమీపంలో ఆగి ఉన్న ఒక కారులో ఒక్కసారిగా భారీ విస్ఫోటనం సంభవించింది. పేలుడు తీవ్రతకు సమీపంలోని మరో మూడు, నాలుగు వాహనాలకు మంటలు అంటుకుని దగ్ధమయ్యాయి. ఘటనా స్థలంలోని దృశ్యాలు భయానకంగా ఉన్నాయి. ఒక వ్యాన్ డోర్లు పేలిపోయి ఎగిరిపడగా, మరో కారు నుజ్జునుజ్జయింది. ఇంకో కారు అద్దాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. క్షతగాత్రులు ఆర్తనాదాలతో ఆ ప్రాంతమంతా భీతావహ వాతావరణం నెలకొంది.
“మా ఇంటి డాబా పైనుంచి చూస్తుండగా ఒక పెద్ద అగ్నిగోళం కనిపించింది. ఆ తర్వాత చెవులు చిల్లులు పడేంత శబ్దం వచ్చింది. మా భవనాల కిటికీలు కూడా కంపించాయి” అని మరో ప్రత్యక్ష సాక్షి తెలిపారు. “నేను గురుద్వారాలో ఉన్నప్పుడు పెద్ద శబ్దం వినిపించింది. అది ఎంత పెద్దదంటే, అసలేం జరిగిందో కూడా అర్థం కాలేదు” అని మరొకరు చెప్పారు.
సమాచారం అందుకున్న వెంటనే ఢిల్లీ అగ్నిమాపక సిబ్బంది 20 ఫైర్ ఇంజన్లతో ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. పోలీసులు ఆ ప్రాంతాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకుని, ట్రాఫిక్‌ను నిలిపివేశారు. గాయపడిన వారిని సమీపంలోని ఎల్ఎన్‌జేపీ ఆసుపత్రికి తరలించారు.17 మంది మరణించినట్లు ఢిల్లీ ఫైర్ సర్వీసెస్, ఎల్ఎన్‌జేపీ ఆసుపత్రి వర్గాలు ధృవీకరించాయి.
అయితే, ఇది ఎలాంటి పేలుడు అనేది ఇంకా తెలియరాలేదు. ఫోరెన్సిక్, సాంకేతిక నిపుణుల బృందాలు ఘటనాస్థలికి చేరుకుని ఆధారాలు సేకరిస్తున్నాయి. పేలుడుకు గల కారణాలను అన్వేషిస్తున్నారు. ఇదే రోజు హర్యానాలోని ఫరీదాబాద్‌లో ఒక ఇంట్లో సుమారు 2,900 కిలోల పేలుడు పదార్థాలు లభ్యం కావడం ఈ ఘటనపై పలు అనుమానాలకు తావిస్తోంది. జమ్మూకశ్మీర్‌కు చెందిన ఓ డాక్టర్ అద్దెకు తీసుకున్న ఇంట్లో ఈ పేలుడు పదార్థాలు దొరకడంతో, ఢిల్లీ పేలుడు వెనుక ఉగ్రకోణం ఉందా అనే దిశగా కూడా అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
ఢిల్లీలో భారీ పేలుడు… పలు నగరాల్లో హై అలర్ట్ ప్రకటించిన కేంద్ర హోంశాఖ

దేశ రాజధాని ఢిల్లీ భారీ పేలుడుతో దద్దరిల్లింది. ఎర్రకోట సమీపంలోని రద్దీ ప్రాంతంలో సోమవారం సాయంత్రం ఓ కారులో శక్తివంతమైన పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో 17 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 24 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన నేపథ్యంలో మహారాష్ట్ర రాజధాని ముంబైతో పాటు ఉత్తర ప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. దేశంలోని పలు నగరాల్లో కేంద్ర హోంశాఖ హై అలర్ట్ ప్రకటించింది.
వివరాల్లోకి వెళితే.. చాందినీ చౌక్ మెట్రో స్టేషన్ సమీపంలో ఈ పేలుడు జరిగినట్లు డిప్యూటీ చీఫ్ ఫైర్ ఆఫీసర్ ఏకే మాలిక్ తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే సుమారు 20 ఫైర్ ఇంజన్లు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. రాత్రి 7:29 గంటల సమయానికి మంటలను అదుపులోకి తెచ్చినట్లు ఆయన వెల్లడించారు. పేలుడు తీవ్రతకు సమీపంలోని మూడు, నాలుగు వాహనాలు కూడా ధ్వంసమయ్యాయి.
క్షతగాత్రులను హుటాహుటిన సమీపంలోని లోక్‌నాయక్ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే 17 మంది మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. పేలుడు చాలా పెద్ద శబ్దంతో సంభవించిందని, భారీ అగ్నిగోళం ఎగిసిపడినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఘటనా స్థలంలోని దృశ్యాలు పేలుడు తీవ్రతను తెలియజేస్తున్నాయి.
సమాచారం అందుకున్న వెంటనే ఉగ్రవాద నిరోధక దళం (యాంటీ-టెర్రర్ స్క్వాడ్), ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ బృందాలు రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించాయి. పర్యాటకులు ఎక్కువగా ఉండే ఈ ప్రాంతాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు.
ఈ ఘటనతో ముంబై, ఉత్తర ప్రదేశ్ అప్రమత్తమయ్యాయి. ముంబైలోని కీలక ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేసినట్లు భద్రతా వర్గాలు తెలిపాయి. అదేవిధంగా, యూపీలోని అన్ని జిల్లాల్లో హై అలర్ట్ ప్రకటించారు. సున్నితమైన ప్రాంతాల్లో గస్తీ, తనిఖీలను పెంచాలని లక్నో నుంచి ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.
ఢిల్లీలో భారీ పేలుడు.. హైదరాబాద్ సీపీ సజ్జనార్ కీలక ఆదేశాలు, పాతబస్తీలో తనిఖీలు
- రద్దీ ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించాలని, నాకా బందీ చేపట్టాలని ఆదేశం
- సున్నిత ప్రాంతాలపై నిఘా ఉంచాలన్న సజ్జనార్
- అనుమానాస్పదంగా కనిపిస్తే డయల్ 100కు ఫోన్ చేయాలని సూచన
దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన పేలుడు నేపథ్యంలో హైదరాబాద్ నగర సీపీ సజ్జనార్ కీలక ఆదేశాలు జారీ చేశారు. నగరంలోని రద్దీ ప్రాంతాల్లో వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని, నాకాబందీ చేపట్టాలని ఆయన ఆదేశించారు. హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లకు ఈ ఆదేశాలు జారీ అయ్యాయి.
దేశ రాజధాని ఢిల్లీ నగరం సాయంత్రం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో భారీ శబ్దంతో పేలుడు సంభవించింది. ఈ పేలుడు ధాటికి 17 మంది మృతి చెందగా, 20 మంది గాయపడ్డారు. దేశ రాజధానిలో పేలుడు సంభవించడంతో కేంద్ర హోంమంత్రిత్వశాఖ అప్రమత్తమైంది. పలు రాష్ట్రాలను సైతం అప్రమత్తం చేసింది. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా పలు నగరాల్లో హై అలెర్ట్ ప్రకటించారు.
ఈ క్రమంలో, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ సీపీ సజ్జనార్ ఆదేశించారు. సున్నిత ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులు కనిపిస్తే వెంటనే డయల్ 100కు సమాచారం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్‌లో అప్రమత్తమైన పోలీసులు పాతబస్తీలోనూ విస్తృత తనిఖీలు చేపట్టారు. అన్ని రైల్వే స్టేషన్‌లలో బాంబు స్క్వాడ్‌తో తనిఖీలు నిర్వహించారు.