ఖమ్మం వార్తలు

మధిర నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకుందాం …డిప్యూటీ సీఎం భట్టి

నాకు మధిర నియోజకవర్గ ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని వారి సేవకే ఉపయోగిస్తానని ,అన్ని రంగాల్లో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ముందుకు పోతున్నట్లు నియోజకవర్గ శాసనసభ్యులు , డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు ..ముదిగొండ మండలం గంధసిరి గ్రామంలో 2 కోట్ల రూపాయల వ్యయంతో కాకతీయుల కాలంనాటి సృ సుందర మౌలీశ్వరస్వామి పురాతన దేవాలయ పునర్నిర్మాణానికి శంకుస్థాపన చేసిన సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు ..

ప్రభుత్వాన్ని పూర్తిగా ప్రజలకు అంకితం చేశాం. రాష్ట్రంలో ఎంత విద్యుత్ అవసరం పెరిగినా అంతరాయం లేకుండా సరఫరా చేస్తున్నాం.ఉచిత విద్యుత్తు, రైతులకు ఉచిత సరఫరా అన్నవి కాంగ్రెస్ ప్రభుత్వాల కట్టుబాట్లు. ప్రజల సొమ్మును దోచుకునే వ్యవస్థలకు తావు ఇవ్వం.
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు నిర్మాణం పూర్తిచేసినంత వేగంగా బిల్లులు విడుదల చేస్తాం.
విద్యారంగ అభివృద్ధికి ఎక్కువ నిధులు ఖర్చు చేస్తూ, పిల్లల భవిష్యత్తును బలోపేతం చేస్తున్నాం.మహిళల ఆత్మస్థైర్యం కోసం వడ్డీ లేని రుణాలు అందిస్తున్నాం. ఐదేళ్లలో కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దడం లక్ష్యం. రెండు సంవత్సరాల్లో 70 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశాం. వేలాది ప్రైవేట్ ఉద్యోగాల కోసం ప్రతి నియోజకవర్గంలో జాబ్ మేళాలు నిర్వహిస్తున్నాం.

మధిర నియోజకవర్గంలోని ఇందిరా మహిళా డైరీ దేశానికి ఆదర్శంగా నిలుస్తుందన్నారు .
మధిర ప్రజల సంక్షేమమే లక్ష్యంగా మీరు వేసిన ప్రతి ఓటుకు గౌరవం తీసుకువచ్చేలా నియోజవర్గాన్ని అభివృద్ధి చేసుకుందాం అని డిప్యూటీ సీఎం అన్నారు. ఈ కార్యక్రమంలో.. జిల్లా కలెక్టర్ దూరిశెట్టి అనుదీప్, సిపి సునీల్ దత్, రాష్ట్ర గిడ్డింగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పువ్వాళ దుర్గాప్రసాద్, మత్కేపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ అంబటి వెంకటేశ్వరరావు, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ బండారు నరసింహారావు, ముదిగొండ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొమ్మినేని రమేష్ బాబు,మట్ట రవీందర్ రెడ్డి, బుల్లెట్ బాబు, తదితరులు, పాల్గొన్నారు.

Related posts

రాష్ట్రమంత్రులు పొంగులేటి,,తుమ్మల ఖమ్మం జిల్లా పర్యటన….

Ram Narayana

అర్జీల పరిష్కారం సత్వరమే చేయాలి …. జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్

Ram Narayana

సెహబాష్ కలెక్టర్ గౌతమ్ గారు … పిల్లల చదువుల పట్ల చూపుతున్న శ్రద్ధకు హ్యాట్సప్ …

Ram Narayana