గెలిచిన నవీన్ పై ఓడిన సునీత తిట్లదండకం ..
రౌడీలు , గుండాలు దున్నపోతుల్లా ఉన్నారని విమర్శలు
గోపినాథ్ ఉన్నన్నాళ్ళు ఎవడ్రా అంటే మూసుకొని కూర్చున్నవాళ్ళు ప్రజలపై దౌర్జన్యాలు చేస్తున్నారు ..చూస్తూ ఉరుకుంటామా అంటూ ఆగ్రహం
అందరు కలిసి బెదిరించి గెలిచారు …నైతిక గెలుపు నాదే
కేసీఆర్ ప్రచారానికి రాకపోయినా కేటీఆర్ ప్రతి రోడ్ షో లో ఉన్నారు
ప్రతి భూతుల్లో రిగ్గింగ్ , గుద్దుకోవడమే , గుండా రాజ్యం
జూబ్లీహిల్స్ ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ పై ఓడిపోయిన బిఆర్ యస్ అభ్యర్థి మాగంటి సునీత తిట్లదండకంతో రెచ్చిపోయారు …రౌడీలు ,గుండాలు , దున్నపోతుల్లా ,ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలను బెదిరించారని వాపోయారు …అలంటి పరిస్థితిల్లో ప్రజలు భయపడతారని ,ఇక్కడ ఉండాల్సిన వాళ్ళు కదా ..?అంటూ ఘాటు విమర్శలు చేశారు ..
రౌడీ రాజ్యం ,గుండా రాజ్యం …దున్నపోతుల్లా ఉన్నారు…మరి భయపడరు … ప్రజలకు భయముండదా ..? గోపినాథ్ ఉన్నన్నాళ్ళు ఎవడ్రా అంటే , భయపడి మూసుకొని కూర్చున్నావు ..ఇది నీ గెలుమేమి కాదు ..అందరు కలిసి చేసిన గెలుపు ..ఇది గెలుపేమి కాదు .. నేను నైతికంగా ఎప్పుడో గెలిచాను ..నేను దైర్యంగా ఉంటేనే కదా కార్యకర్త దైర్యంగా ఉంటారు ..ఎందుకయ్యా రౌడీయిజం తో వచ్చావు .. మీరు చూశారు కదా ఏమి జరిగిందో మీకు తెలియదా …?11 వ తారీఖున ఏమి జరిగిందో …కంప్లైట్ గా రౌడీ రాజ్యం ,గుండా రాజ్యం …మీరు చూస్తన్నారు మూడు నెలలుగా …ఒక మహిళ ను ప్రశ్నిస్తారా ..? ప్రతి కొంపలోకి వెళ్లి అందరిని బెదిరించడమే ,దున్నపోతున్నాళ్ల ఉన్నారు…భయముండదా … భయపడ్డారు ..నీ స్వతహాగా గెలిచింది కాదు…ప్రతి చోట ,తన్నడం ,గుద్దటమే కదా ..? రౌడీయిజం తో గెలిచావని అర్ధం కావడంలేదా… ?కేసీఆర్ ప్రచారానికి రాకపోవడం వల్లనే ఓడిపోయారా…? అదేం లేదు ..కేటీఆర్ ప్రతి రోడ్ షో లో ఉన్నారు కదా ..? రేవంత్ రెడ్డి ఎన్ని సార్లు వచ్చారు ..?రాలేదు కదా …? రిగ్గింగ్ రాజ్యం…గుండా రాజ్యం …ఎమ్మా మీకు తెలియదా …? మూడు నెలల నుంచి చూస్తున్నారు ..మీరు కూడా మహిళను ప్రశ్నిస్తారా ..? గెలిస్తే గెలువు …జన్మానికో శివరాత్రిలా గెలిచావు … నైతికంగా నేనే గెలిచాను …వాళ్ళు పడే భాద చూడలేక బయటకు వచ్చి మాట్లాడాను… ఇన్నాళ్లు అవసరం రాలేదు కాబట్టి రాలేదు ..ప్రతిరౌండ్లో కాంగ్రెస్ ఆధిక్యం ఉందికదా ..? ప్రతి భూతుల్లో రిగ్గింగు …గుద్దుకోవడమే..రిగ్గింగ్ రాజ్యం …జరిగిందంతా చూసి మీరు కూడా ప్రశ్నిస్తారా ..? అంటూ ఆమె నవీన్ యాదవ్ పై ఫైర్ అయ్యారు..
ఫలితాలు వచ్చి 24 గంటలు గడవకముందే కాంగ్రెస్ గూండాయిజం చేస్తోంది: కేటీఆర్

- పార్టీ కార్యకర్తపై దాడి చేశారంటూ కేటీఆర్ ఆగ్రహం
- మేం గతంలో ఎన్నో ఎన్నికల్లో గెలిచినప్పటికీ ఇలా చేయలేదని వ్యాఖ్య
- కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని హామీ
జూబ్లీహిల్స్ ఫలితాలు వెలువడి 24 గంటలు కూడా గడవకముందే కాంగ్రెస్ గూండాయిజానికి పాల్పడుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. తాము కూడా ఎన్నో ఎన్నికల్లో గెలిచినప్పటికీ ఇలాంటి దాడులకు పాల్పడలేదని ఆయన అన్నారు. కాంగ్రెస్ శ్రేణులు నిన్న రాత్రి విజయగర్వంతో ఊరేగింపు నిర్వహించాయని, ఎలాంటి పరిస్థితుల్లోనైనా కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని ఆయన భరోసా ఇచ్చారు.
తమ కార్యకర్తపై దాడికి పాల్పడినందుకు కాంగ్రెస్ పార్టీ బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు. దొంగ ఓట్లు, గూండాగిరి, డబ్బులు పంచి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలిచారని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ గూండాయిజం ఇలాగే కొనసాగితే ప్రజలు తగిన బుద్ధి చెబుతారని ఆయన హెచ్చరించారు.
నిన్న రాత్రి కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన విజయోత్సవ ఊరేగింపుతోనే ఎవరిది అహంకారమో తేటతెల్లమైందని ఆయన అన్నారు. గతంలో తాము అనేక ఉప ఎన్నికల్లో విజయం సాధించామని, అప్పుడు కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు కూడా దక్కలేదని గుర్తు చేశారు. అలాంటి సమయంలో తాము కాంగ్రెస్ పార్టీ గుర్తును గాడిద మీద ఎక్కించి ఊరేగించామా? అని ప్రశ్నించారు. ఒక ఉప ఎన్నిక గెలిచినందుకే ఇంత అహంకారమా అని ఆయన ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ పార్టీ గుర్తు కారును క్రేన్‌తో లాక్కెళ్లడం సరికాదని అన్నారు.
రహమత్‌నగర్‌లో బీఆర్ఎస్ కార్యకర్త రాకేశ్‌పై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేసిన ఘటన కలకలం రేపింది. తీవ్ర గాయాలు కావడంతో ఆయనకు ఎస్ఆర్ నగర్‌లోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై మధురానగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ దాడిని కేటీఆర్ తీవ్రంగా ఖండించారు.