తెలంగాణ వార్తలు

శతాధిక వృద్ధుడు విద్యావేత్త చుక్క రామయ్య…పలువురి శుభాకాంక్షలు

శతాధిక వృద్ధుడు యువకుడు విద్యావేత్త చుక్క రామయ్య..పలువురి శుభాకాంక్షలు

విద్యావేత్త చుక్కా రామయ్య వందవ ఏట అడుగు పెట్టారు..1925 నవంబర్ 20న ఆయన జన్మించారు..పాలకుర్తి గడ్డ గర్వించదగ్గ మహోన్నతమైన వ్యక్తి ప్రముఖ విద్యావేత్త, ‘ఐఐటీ రామయ్య’ గా సుపరిచితులైన గూడూరు వాస్తవ్యులు చుక్కా రామయ్య “100 వందవ ఏట అడుగుపెట్టిన సందర్భంగా హైదరాబాద్ లోని వారి పలువురు ప్రముఖులు వెళ్లి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు .. ఈమధ్య కాలంలో ప్రముఖులుగా గుర్తించబడిన వాళ్లలో వందేళ్లు పూర్తి చేసుకున్నవాళ్లు ఎవరు లేరనే చెప్పాలి..పలుమార్లు అనారోగ్యానికి గురైనప్పటికీ ఆరోగ్యం విషయంలో ఎంతో క్రమశిక్షణగా వ్యవహరించే రామయ్య నేడు శతకంలోకి అడుగుపెట్టారు..

ఐఐటీ చుక్కా రామయ్య జన్మదిన సందర్బంగా వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన: మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు….ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ: తరగతి గదిలో ఐఐటీ పాఠాలు నేర్పడమే కాదు, తెలంగాణ పోరులో మేధో పాఠాలు నేర్పిన దిక్సూచి ఆయన.

అక్షరం ఆయన ఆయుధం, నిరాడంబరత్వానికి నిలువుటద్దం, క్రమశిక్షణకు మారుపేరు.
వందేళ్ల చరిత్రకు సాక్ష్యంగా నిలిచిన మన చుక్కా రామయ్య ఆరోగ్యంగా ఉండాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నానన్నారు..

Related posts

వెన్నం సోదరులను పరామర్శించిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి..

Ram Narayana

భద్రాచలం వద్ద ఉగ్రరూపం దాల్చిన గోదావరి.. రెండో ప్రమాద హెచ్చరిక జారీ!

Ram Narayana

ఐపీఎస్ అధికారి అంజనీకుమార్‌పై సస్పెన్షన్‌ను ఎత్తివేసిన ఎన్నికల సంఘం

Ram Narayana