సామాజిక మార్పుకు మార్క్సిజమే మార్గమని నమ్మినవాడు కామ్రేడ్ ఇనుపనూరి జోసఫ్
……… సంస్మరణ సభలో తమ్మినేని, నున్నా

అనేక రుగ్మతలతో కూడిన ప్రస్తుత దోపిడి సమాజ మార్పుకు మార్క్సిజమే మార్గమని నమ్మినవాడు కామ్రేడ్ ఇనుపనూరి జోసఫ్ అని సిపిఎం పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం అన్నారు.
స్థానిక మంచికంటి భవనంలో బీవీకే జనరల్ మేనేజర్ వై శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన ఇనుపనూరి జోసఫ్ సంస్మరణ సభలో ఆయన ముఖ్య వక్తగా పాల్గొని ప్రసంగించారు. కామ్రేడ్ జోసెఫ్ మార్క్సిస్టు సైద్ధాంతిక విషయాలను అధ్యయనం చేయడంలో, వాటిని నిత్య జీవిత కార్యాచరణకు అన్వయించడంలో తగిన క్రమశిక్షణను పాటించేవారని కొనియాడారు. వృత్తిరీత్యా ఉపాధ్యాయుడైనప్పటికీ ఆయన ఒక మంచి మార్క్సిస్టు ప్రచారకుడిగా కృషి చేశారని తెలిపారు. ఉపాధ్యాయ వృత్తి నుండి రిటైర్ అయిన తర్వాత అనేక సామాజిక సాంస్కృతిక సేవా కార్యక్రమాల్లో చాలా చురుకుగా పాల్గొన్నారని తెలిపారు. బోడేపూడి విజ్ఞాన కేంద్రం మేనేజింగ్ కమిటీ సభ్యులుగా ,ఆదివారం మీకోసం కమిటీ నిర్వాహకులుగా, స్టడీ సర్కిల్ సభ్యులుగా అనేక రూపాలలో ఆయన సామాజిక సేవా సాంస్కృతిక కార్యకలాపాలులను నిర్వహించారని అన్నారు. జిల్లా కేంద్రంలో 2007వ సంవత్సరం నుండి జరుగుతున్న మార్క్సిస్టు స్టడీసర్కిల్లో ఒక సభ్యుడిగా పాల్గొంటూ, మార్క్సిజం లెనినిజం సైద్ధాంతిక విషయాలను కొత్త తరానికి అందించడం కోసం తపన పడేవారని అన్నారు. ఈ సందర్భంగా తమ్మినేని వీరభద్రం కామ్రేడ్ జోసెఫ్ కు ఘనంగా నివాళి అర్పించారు.ఆయన కుటుంబానికి సంతాప సానుభూతిని తెలియజేశారు. ఈ సంస్మరణ సభలో సిపిఎం పార్టీ ఖమ్మం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు మాట్లాడుతూ కామ్రేడ్ జోసఫ్ ఉపాధ్యాయ ఉద్యమంలో చాలా చురుకుగా పాల్గొన్నారని తెలిపారు. భద్రాచలం ఏజెన్సీ ప్రాంతం,ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అనేక ప్రాంతాలలో దశాబ్దాల పాటు టీచర్ గా, లెక్చరర్ గా పనిచేస్తూ అనేక వందల మంది విద్యార్థులకు విద్యాబోధన చేశారని తెలిపారు. వామపక్ష ప్రజాతంత్ర ఉద్యమాలలో పనిచేసే కార్యకర్తలను కామ్రేడ్ జోసఫ్ నిరంతరం ప్రోత్సహించేవారని,వారికి సహకరించేవారిని కొనియాడారు. కెవిపిఎస్, ఆదివారం మీకోసం, బీవీకే లాంటి ప్రజా సంఘాలు,సామాజిక సేవా సంఘాలలో ఆయన అనేక సేవలు అందించారని తెలిపారు. సిపిఎం పార్టీ, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జరిగే రాజకీయ శిక్షణా కార్యకలాపాలలో నిరంతరం ఆయన చురుకుగా పాల్గొంటూ యువతరాన్ని ప్రోత్సహించేవారిని తెలిపారు. మార్క్సిస్టు సాహిత్యాన్ని భద్రపరుస్తూ తన చుట్టూ ఉన్న వారికి అందించడంలో ఆయన నిత్యం కృషి చేసే వారిని అన్నారు. పార్టీ పట్ల, పార్టీ సిద్ధాంతం పట్ల కామ్రేడ్ జోసఫ్ సార్ అచంచలమైన విశ్వాసం కలిగి ఉండేవారని కొనియాడారు. ఈ సందర్భంగా జోసఫ్ కు ఘనంగా నివాళులు అర్పించి, కుటుంబానికి సంతాప సానుభూతిని తెలియజేశారు.
ఈ సంస్మరణ సభలో సిపిఎం పార్టీ రాష్ట్ర నాయకులు పి సోమయ్య,మాచర్ల భారతి, బుగ్గవీటి సరళ, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాదినేని రమేష్,మెరుగు సత్యనారాయణ, బండి పద్మ సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు బండారు రమేష్,నందిపాటి మనోహర్,ఎస్ కే మీరా, నాయకులు టిఎల్ నర్సయ్య, ఆర్ ప్రకాష్, K. హిమబిందు,
BVK బాధ్యులు
ఎస్కే ఆఫ్జల్ , వాసిరెడ్డి వీరభద్రం S.నాగేశ్వరరావు,
తుమ్మల వెంకటరావు, N. గోవింద్ రావు, N. పురుషోత్తం రావు,
కామ్రేడ్ జోసఫ్ సార్ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొని నివాళులు అర్పించారు.