తెలంగాణ వార్తలు

అట్టహాసంగా గ్లోబల్ సమ్మిట్ ప్రారంభం … పెద్ద ఎత్తున పెట్టుబడులు …

 ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025’… మొదటిరోజు రూ.1.88 లక్షల కోట్ల ఒప్పందాలు

  • డీప్ టెక్నాలజీ, గ్రీన్ ఎనర్జీ, ఏరోస్పేస్ సహా వివిధ రంగాల్లో పెట్టుబడులు
  • డీప్ టెక్నాలజీ రంగంలో రూ.75 వేల కోట్ల పెట్టుబడులు
  • ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాల్లో రూ.19,350 కోట్ల పెట్టుబడులు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025’ మొదటి రోజున భారీగా అవగాహన ఒప్పందాలు (ఎంవోయూలు) కుదిరాయి. రంగారెడ్డి జిల్లా, కందుకూరు మండలం, ఫ్యూచర్ సిటీలో జరిగిన ఈ సదస్సులో వివిధ కంపెనీలతో రూ.1.88 లక్షల కోట్ల మేర ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకుంది. డీప్ టెక్నాలజీ, గ్రీన్ ఎనర్జీ, ఏరోస్పేస్ సహా వివిధ రంగాల్లో ఆయా కంపెనీలు పెట్టుబడులకు ముందుకు వచ్చాయి.

డీప్ టెక్నాలజీ రంగంలో రూ.75 వేల కోట్లు, గ్రీన్ ఎనర్జీ రంగంలో రూ.27 వేల కోట్లు, పునరుత్పాదక రంగంలో రూ.39,700 కోట్లు, ఏరోస్పోస్, డిఫెన్స్ రంగాల్లో రూ.19,350 కోట్లు, ఏవియేషన్ రంగంలో జీఎంఆర్ గ్రూపుతో రూ.15 వేల కోట్లు, తయారీ రంగంలో రూ.13,500 కోట్లు, ఉక్కు రంగంలో రూ.7 వేల కోట్లు, టెక్స్‌టైల్స్ రంగంలో రూ.4 వేల కోట్ల మేర ఒప్పందాలు కుదిరినట్లు ప్రభుత్వం వెల్లడించింది.

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్: ట్రంప్ మీడియా టెక్నాలజీస్ భారీ పెట్టుబడుల

Trump Media Technologies to Invest Heavily in Telangana Rising Global Summit
  • తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు పలు కంపెనీలు ఆసక్తి
  • పెట్టుబడులు పెడతామని ట్రంప్ మీడియా టెక్నాలజీస్ డైరెక్టర్ వెల్లడి
  • పదేళ్లలో రూ.1 లక్ష కోట్లు పెట్టుబడులు 

‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025’ సదస్సు నేపథ్యంలో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి పలు కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి. ట్రంప్ మీడియా టెక్నాలజీస్ సంస్థ భారీ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. సదస్సు వేదికగా కంపెనీ డైరెక్టర్ ఎరిక్ ఈ విషయాన్ని ప్రకటించారు. రానున్న పదేళ్లలో రూ.1 లక్ష కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు ఆయన వెల్లడించారు.

‘ఫ్యూచర్ సిటీ’కి సీఐఐ మాజీ చైర్మన్ కితాబు

ఫ్యూచర్ సిటీ పేరుతో తెలంగాణలో కొత్త నగరం ఆలోచన అభినందనీయమని సీఐఐ మాజీ ఛైర్మన్ దినేశ్ అన్నారు. తెలంగాణ ఇప్పటికే వేగంగా అభివద్ధి చెందుతున్న రాష్ట్రంగా ఉందని ఆయన తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంస్థలను ఒకే వేదికపైకి రప్పించడం అభినందనీయమని అన్నారు. తెలంగాణ విజన్‌లో భాగస్వాములయ్యేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆయన తెలిపారు.

తెలంగాణలో తాము ఇప్పటికే పెట్టుబడులు పెడుతున్నామని అదానీ గ్రూప్ తెలిపింది. గ్రీన్ డేటా సెంటర్స్, రెన్యూవబుల్ ఎనర్జీ, సిమెంట్ రంగంలో పెట్టుబడులు పెడుతున్నామని, డిఫెన్స్, ఏరోస్పేస్ పార్కును ఏర్పాటు చేశామని అదానీ పోర్ట్స్ అండ్ సెజ్ ఎండీ కరణ్ అదానీ తెలిపారు. దేశంలోనే తొలిసారిగా యూఏవీ సాంకేతికతను హైదరాబాద్‌లో రూపొందిస్తున్నామని తెలిపారు. ఇక్కడ తయారయ్యే యూఏవీలను సైన్యానికి అందిస్తామని, ప్రపంచ మార్కెట్‌లో కూడా విక్రయిస్తామని ఆయన అన్నారు.

బెంగళూరు తర్వాత ఐటీ ఎగుమతుల్లో తెలంగాణ గణనీయ వాటాను కలిగి ఉంది: డీకే శివకుమార్

DK Shivakumar Says Telangana Has Significant Share in IT Exports After Bangalore
  • బెంగళూరుతో హైదరాబాద్ నగరం పోటీ పడుతోందన్న డీకే శివకుమార్
  • ఈ రెండు మహా నగరాలు ప్రపంచంతో పోటీ పడుతున్నాయని వ్యాఖ్య
  • తెలంగాణ అభివృద్ధికి కర్ణాటక సహకరిస్తుందని హామీ

దేశీయ ఐటీ ఎగుమతుల్లో బెంగళూరు 40 శాతం వాటా కలిగి ఉండగా, చిన్న రాష్ట్రమైనప్పటికీ తెలంగాణ కూడా గొప్ప వాటాను కలిగి ఉందని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం ఫ్యూచర్ సిటీలో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025’లో ఆయన ప్రసంగించారు.

అభివృద్ధి, పెట్టుబడుల విషయంలో బెంగళూరుతో హైదరాబాద్ నగరం పోటీ పడుతోందని డీకే శివకుమార్ అన్నారు. ఈ రెండు మహానగరాలు ప్రపంచంతో పోటీ పడుతున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. భవిష్యత్ తరానికి ఏం కావాలో తెలంగాణ ప్రభుత్వం ఆలోచన చేసిందని ఆయన ప్రశంసించారు.

తెలంగాణ రాష్ట్రం, దక్షిణ భారతదేశ అభివృద్ధికి కర్ణాటక సహకరిస్తుందని ఆయన హామీ ఇచ్చారు. ఐటీ ఎగుమతుల్లో తెలంగాణ రాష్ట్రం కూడా గణనీయమైన వాటాను కలిగి ఉందని అన్నారు. కాలిఫోర్నియా వంటి ప్రపంచస్థాయి నగరాల్లో 13 లక్షల మంది భారతీయ ఇంజినీర్లు పనిచేస్తున్నారని ఆయన వెల్లడించారు. ముఖ్యమంత్రిగా రెండేళ్లు పూర్తి చేసుకున్న రేవంత్ రెడ్డికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి మరింత దృఢంగా నిలదొక్కుకోవాలన్న ఉద్దేశంతో తాను ఈ సదస్సుకు వచ్చానని ఆయన పేర్కొన్నారు.

Related posts

ధరణి పోర్టల్ నిర్వహణపై తెలంగాణ ప్రభుత్వం కీలక ఒప్పందం..

Ram Narayana

ట్రాఫిక్ చలాన్ల రాయితీ ప్రచారంపై స్పందించిన అధికారులు…

Ram Narayana

మెదక్‌లో అమానుషం.. పని ఇస్తామని నమ్మించి.. మహిళపై అత్యాచారం.. ప్రాణాలు కోల్పోయిన బాధితురాలు

Ram Narayana