ములుగు జిల్లా వెంకటాపురం మండల సరిహద్దు అటవీ ప్రాంతంలో గురువారం మందుపాతర పేలుడు సంభవించింది. మావోయిస్టుల కోసం కూంబింగ్ చేస్తుండగా మందు పాతర పేలింది. ఈ పేలుడులో ముగ్గురు పోలీసులు దుర్మరణం పాలయ్యారని అధికారులు తెలిపారు. తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో ముమ్మర గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మావోయిస్టుల కోసం పోలీసులు ముమ్మరంగా కూంబింగ్ చేస్తున్నారు. ఆపరేషన్ కర్రెగుట్ట పేరుతో 17 రోజులుగా కూంబింగ్ కొనసాగుతోంది. ఇప్పటివరకు 200 మందుపాతరలను పోలీసులు నిర్వీర్యం చేశారు. కర్రెగుట్ట ప్రాంతంలో జరిగిన ఒక పెద్ద ఎన్‌కౌంటర్ తర్వాత ఈ ఘటన జరిగింది.
Save or share this story as a newspaper-style Epaper Clip: