తెలంగాణ రాజకీయ వార్తలు ..

తెలంగాణ తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు…

మొదటి విడత గ్రామ పంచాయతీల్లో ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు
ఉనికి చాటుకున్న బీఆర్ యస్
పెద్దగా ప్రభావం చూపని బీజేపీ
అక్కడక్కడా ఎగిరిన ఎర్రజెండాలు

  • తొలి విడతలో 3,834 సర్పంచ్ పదవులకు ఎన్నికలు
  • 776 మంది కాంగ్రెస్, 312 మంది బీఆర్ఎస్, 63 మంది బీజేపీ బలపరిచిన అభ్యర్థుల గెలుపు
  • కోరుట్ల మండలం తిమ్మయ్యపల్లెలో తల్లి గంగవ్వపై కూతురు సుమలత 91 ఓట్లతో విజయం

గురువారం జరిగిన మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ సత్తా చాటింది ..రాష్ట్రంలో వివిధ జిల్లాలనుంచి అందిన సమాచారం మేరకు కాంగ్రెస్ గణనీయమైన స్థానాలను కైవశం చేసుకుంది …మెజార్టీ సర్పంచులను గెలుచుకుంది …ఎమ్మెల్యేలు , ఇంచార్జిలు పడ్డ కష్టానికి ఫలితం దక్కింది ..

తెలంగాణ రాష్ట్రంలో మొదటి విడత పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. సాయంత్రానికి వెలువడిన ఫలితాల సరళిని పరిశీలిస్తే, కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు అధిక సంఖ్యలో విజయం సాధించారు. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం తిమ్మయ్యపల్లె గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తల్లి, కుమార్తె మధ్య పోటీ నెలకొంది.

రిజర్వేషన్‌లో బీసీ మహిళకు కేటాయించడంతో శివరాత్రి గంగవ్వ‌ను బీఆర్ఎస్ బలపరచగా, ఆమె కుమార్తె సుమలతను కాంగ్రెస్ బలపరిచింది. పోలింగ్ అనంతరం ఓట్ల లెక్కింపులో తల్లి గంగవ్వపై కుమార్తె సుమలత 91 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.

మొదటి విడతలో 3,834 సర్పంచ్ పదవులకు ఎన్నికలు జరగగా, ఏకగ్రీవాలతో కలుపుకుని 776 మందికి పైగా కాంగ్రెస్ మద్దతుదారులు విజయం సాధించారు. బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు 312 మంది, బీజేపీ బలపరిచిన అభ్యర్థులు 63 మంది, ఇతరులు బలపరిచిన 164 మంది అభ్యర్థులు విజయం సాధించారు.

మొదటి విడతలో 3,834 సర్పంచ్ పదవులకు 12,960 మంది అభ్యర్థులు, 27,628 వార్డులకు 65,455 మంది పోటీ పడ్డారు. యాదాద్రి జిల్లా లక్ష్మక్కపల్లిలో సర్పంచ్ అభ్యర్థులకు ఇద్దరికీ సమానంగా ఓట్లు వచ్చాయి. లాటరీ తీయడంతో డ్రాలో బీఆర్ఎస్ మద్దతుదారు ఇండ్ల రాజయ్య విజయం సాధించారు.

తెలంగాణలో ఆ రెండు గ్రామాల్లో టీడీపీ మద్దతిచ్చిన అభ్యర్థులు గెలుపు…

TDP Supported Candidates Win in Two Telangana Villages
  • ఖమ్మం జిల్లాలోని పెద్దగోపతి గ్రామంలో టీడీపీ బలపరిచిన సునీత విజయం
  • మధిర మండలం అల్లిపురంలోనూ టీడీపీ మద్దతుదారు కృష్ణకుమారి గెలుపు
  • జడ్చర్ల ఎమ్మెల్యే స్వగ్రామంలో బీజేపీ బలపరిచిన అభ్యర్థి విజయం

మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలోని కొణిజెర్ల మండలంలో తెలుగుదేశం పార్టీ బలపరిచిన అభ్యర్థి విజయం సాధించారు. పెద్దగోపతి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థి సునీత 1,258 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.

అదేవిధంగా, మధిర మండలం అల్లినగరం గ్రామంలో ఆవుల కృష్ణ కుమారి 89 ఓట్ల తేడాతో విజయం సాధించారు. వీరిద్దరూ తెలుగుదేశం పార్టీ మద్దతునిచ్చిన అభ్యర్థులు కావడం విశేషం.

మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి స్వగ్రామం రంగారెడ్డిగూడలో బీజేపీ అభ్యర్థి రేవతి 31 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. గ్రామంలో మొత్తం 972 ఓట్లు పోలయ్యాయి. కాంగ్రెస్ మద్దతు తెలిపిన అభ్యర్థి అంజలికి 459 ఓట్లు రాగా, బీజేపీ బలపరిచిన అభ్యర్థి రేవతికి 490 ఓట్లు లభించాయి. తొలుత రేవతి ఆరు ఓట్ల తేడాతో విజయం సాధించగా, ప్రత్యర్థులు రీకౌంటింగ్‌కు పట్టుబట్టారు. రీకౌంటింగ్‌లో రేవతి మెజార్టీ 31 ఓట్లకు పెరిగింది.

ఖమ్మం జిల్లాలోని డిప్యూటీ సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న చింతకాని మండలం మధిర నియోజకవర్గ పరిధిలోని పాతర్లపాడు గ్రామ సర్పంచ్ గా సిపిఎం కు చెందిన వ్యక్తి 567 ఓట్ల మెజార్టీతో ఎన్నికయ్యారు …

Related posts

తెలంగాణలో లోక్‌సభ నియోజకవర్గాలకు బీజేపీ ఇన్ఛార్జీల నియామకం.. !

Ram Narayana

గవర్నర్ కోట ఎమ్మెల్సీ అభ్యర్థుల సిఫార్స్ లో అధికార పార్టీకి గవర్నర్ తమిళశై షాక్ …!

Ram Narayana

కాంగ్రెస్‌లో చేరిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే, బీజేపీ మాజీ ఎంపీ!

Ram Narayana