క్రీడా వార్తలు

క్రికెట్ దేవుడితో ఫుట్‌బాల్ మాంత్రికుడు.. ’10/10 డే’ అన్న సచిన్!

  • వాంఖడే స్టేడియంలో లియోనెల్ మెస్సీతో సచిన్ భేటీ
  • ఇద్దరు క్రీడా దిగ్గజాలు ఒకేచోట కలవడంపై అభిమానుల హర్షం
  • మెస్సీకి తన నంబర్ 10 జెర్సీని బహూకరించిన లిటిల్ మాస్ట‌ర్ 
  • ఈ రోజు ’10/10 డే’ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన టెండూల్కర్

క్రీడా ప్రపంచంలోని దిగ్గజాలైన క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్, ఫుట్‌బాల్ మాంత్రికుడు లియోనెల్ మెస్సీ ఒకేచోట కలిశారు. నిన్న‌ ముంబైలోని వాంఖడే స్టేడియంలో వీరిద్దరి అరుదైన భేటీ జరిగింది. ఈ కలయిక క్రీడాభిమానులకు కనుల పండుగ చేసింది. దేశ క్రీడా చరిత్రలో ఇది ఒక మైలురాయిగా నిలిచిపోనుంది.

ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని సచిన్ టెండూల్కర్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’లో ఒక ఆసక్తికరమైన పోస్ట్ చేశారు. మెస్సీతో దిగిన ఫొటోను షేర్ చేస్తూ.. “ఈ రోజు నిజంగా 10/10 డే, లియో మెస్సీ” అని రాసుకొచ్చారు. ఈ పోస్ట్ క్షణాల్లో వైరల్ అయింది.

సచిన్ తన పోస్ట్‌లో ’10/10′ అని పేర్కొనడానికి ఒక ప్రత్యేక కారణం ఉంది. క్రికెట్‌లో సచిన్, ఫుట్‌బాల్‌లో మెస్సీ ఇద్దరూ తమ జట్ల కోసం 10వ నంబర్ జెర్సీని ధరించడం విశేషం. ఈ భేటీ సందర్భంగా సచిన్ తన 10వ నంబర్ టీమిండియా జెర్సీని మెస్సీకి బహుమతిగా అందించారు. ఇద్దరు లెజెండ్స్ ఒకే ఫ్రేమ్‌లో కనపడటంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. క్రికెట్, ఫుట్‌బాల్ మధ్య అభిమానుల్లో ఉండే పోటీ వాతావరణం పక్కకుపోయి, ఇద్దరు గొప్ప ఆటగాళ్ల కలయికను అందరూ ఆస్వాదించారు.

వాంఖడేలో మెస్సీ.. సచిన్‌తో భేటీ.. ‘రోహిత్ శర్మ’ నామస్మరణతో హోరెత్తిన స్టేడియం!

Messi visit Wankhede Stadium Rohit Sharma chants erupt
  • ‘గోట్ టూర్ ఆఫ్ ఇండియా’లో భాగంగా ముంబైకి వచ్చిన లియోనెల్ మెస్సీ
  • వాంఖడే స్టేడియంలో సచిన్, సునీల్ ఛెత్రీలతో ప్రత్యేక భేటీ
  • మెస్సీ ఈవెంట్‌లో ‘రోహిత్ శర్మ’ నామస్మరణతో హోరెత్తించిన అభిమానులు
  • మెస్సీ రాక ముంబైకి ఒక స్వర్ణ ఘట్టమన్న సచిన్ టెండూల్కర్

ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ ‘గోట్ టూర్ ఆఫ్ ఇండియా 2025’లో భాగంగా నిన్న ముంబైలో పర్యటించారు. చారిత్రక వాంఖడే స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమంలో మెస్సీ, క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్, భారత ఫుట్‌బాల్ కెప్టెన్ సునీల్ ఛెత్రీలతో భేటీ అయ్యారు. క్రీడా ప్రపంచంలోని ముగ్గురు దిగ్గజాలు ఒకే వేదికపై కనిపించడంతో అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.

అయితే, ఈ కార్యక్రమంలో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. అభిమానులు మెస్సీని ఉత్సాహపరుస్తూనే, స్థానిక హీరో, టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పేరుతో నినాదాలు చేయడం విశేషం. “ముంబైచా రాజా, రోహిత్ శర్మ.. ఇండియాచా రాజా, రోహిత్ శర్మ” అంటూ వాంఖడే స్టేడియాన్ని హోరెత్తించారు. ఈ ఈవెంట్‌లో మెస్సీ, రోహిత్‌ను కలవలేదు.

ఈ సందర్భంగా సచిన్ టెండూల్కర్ మాట్లాడుతూ, మెస్సీ ముంబైకి రావడం ఒక స్వర్ణ ఘట్టమని అభివర్ణించారు. 2011లో ఇదే మైదానంలో భారత్ ప్రపంచ కప్ గెలిచిన క్షణాలతో ఈ రోజును పోల్చారు. “మెస్సీ వంటి గొప్ప ఆటగాళ్లు ఇక్కడ ఉండటం ముంబైకి, భారత్‌కు గర్వకారణం. ఆయన అంకితభావం, నిబద్ధత అందరికీ ఆదర్శం” అని సచిన్ ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో మెస్సీతో పాటు అతని సహచరులు లూయిస్ సువారెజ్, రోడ్రిగో డి పాల్ కూడా పాల్గొన్నారు. 

Related posts

కోహ్లీ ఇంత బేలగా మాట్లాడతాడని అనుకోలేదు: కపిల్ దేవ్!

Drukpadam

మ్యాచ్ మధ్యలో గుండెపోటు.. చైనా బ్యాడ్మింటన్ ప్లేయర్ మృతి..

Ram Narayana

ఐపీఎల్ వేలంలో అత్యధిక ధర సామ్ కరన్ కు 18 .50 కోట్లు

Drukpadam