జాతీయ వార్తలు

కారులో సజీవ దహనం.. మహారాష్ట్రలో బ్యాంక్ ఏజెంట్ దారుణ హత్య

  • మహారాష్ట్ర లాతూర్‌లో దారుణ హత్య
  • మృతుడు ఐసీఐసీఐ బ్యాంక్ రికవరీ ఏజెంట్ గణేశ్ చవాన్
  • హత్య కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు

మహారాష్ట్రలోని లాతూర్ జిల్లాలో అత్యంత దారుణమైన ఘటన వెలుగుచూసింది. ఓ యువకుడిని గోనె సంచిలో కట్టి, కారులో బంధించి నిప్పంటించి సజీవదహనం చేశారు. ఈ ఘటన నిన్న జరుగగా, పోలీసులు దీనిని హత్యగా నిర్ధారించి దర్యాప్తు ప్రారంభించారు.

వివరాల్లోకి వెళ్తే, ఆసా తాండకు చెందిన గణేశ్ చవాన్ అనే యువకుడు ఐసీఐసీఐ బ్యాంకులో రికవరీ ఏజెంట్‌గా పనిచేస్తున్నాడు. గుర్తుతెలియని వ్యక్తులు అతడిని ఓ సంచిలో బంధించి, అతని కారులోనే ఉంచి నిప్పంటించారు. గణేశ్ ఫోన్ స్విచాఫ్ వస్తుండటంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు, స్నేహితులు అతని కోసం గాలించారు. ఈ క్రమంలోనే వారికి ఈ ఘోర ఘటన గురించి తెలిసింది.

“తెల్లవారుజామున 12:30 గంటల ప్రాంతంలో వనవాడ రోడ్డులో ఓ కారు తగలబడుతోందని మాకు ఫోన్ కాల్ వచ్చింది. మా సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని అగ్నిమాపక శాఖకు సమాచారం ఇచ్చారు. మంటలు ఆర్పిన తర్వాత, కారులో పూర్తిగా కాలిపోయిన మృతదేహాన్ని గుర్తించాం. పోస్ట్‌మార్టం నిర్వహించి, దర్యాప్తు కొనసాగిస్తున్నాం” అని ఓ పోలీసు అధికారి తెలిపారు.

పోలీసులు ఘటనా స్థలంలో ప్రాథమిక విచారణ జరిపి, మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ హత్య వెనుక ఉన్న కారణాలను తెలుసుకునేందుకు దర్యాప్తు ముమ్మరం చేశారు.

Related posts

పుతిన్ కు భారత్ లో గ్రాండ్ వెల్కమ్ …స్వయంగా ఎయిర్ పోర్ట్ కు వెళ్లిన మోడీ ..

Ram Narayana

ప్రతి ఒక్కరినీ కాపాడడం ప్రభుత్వానికి సాధ్యం కాదు: హర్యానా సీఎం

Ram Narayana

క‌న్హ‌య్య కుమార్‌పై దాడి.. మురుగునీటి కాల్వలో పడిపోయిన మహిళా జర్నలిస్టు..!

Ram Narayana