- మధిర, ఖమ్మం నగరం లో అర్ధరాత్రి నుండి సిపిఎం నాయకుల అక్రమ అరెస్టులు
అరెస్ట్ లను తీవ్రంగా ఖండించిన సిపిఎం ఖమ్మం జిల్లా కమిటీ
మధిర పట్టణంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఉదయం 10 గంటలకు శాంతియుత ర్యాలీ నిర్వహించాలని పార్టీ డివిజన్ కమిటీ నిర్ణయించి, పోలీస్ శాఖ నుండి అనుమతి పొంది జన సమీకరణ కు సిద్ధం అయ్యింది. ఈ నేపద్యంలో ఖమ్మం నగరంలో శనివారం ఉదయం పోలీసులు హౌస్ అరెస్ట్ చేసేందుకు నాయకుల ఇళ్ళ దగ్గర పహారా కాసి, ఇంటిలో నుండి బయటకు రాకుండా హౌస్ అరెస్ట్ లు చేసినారు, అరెస్ట్ చేసిన వారిలో సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పి. సుదర్శన్ రావు,
ఖమ్మం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు,సీనియర్ నాయకులు పొన్నం వెంకటేశ్వరరావు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వై. విక్రమ్,యర్రా శ్రీనివాస్ రావు,జిల్లా కమిటీ సభ్యులు MA జబ్బార్,ఎస్. కే. వి. మీరా, భూక్యా శ్రీనివాస్ రావు, కార్పొరేటర్లు ఎర్ర గోపి, వెల్లంపల్లి వెంకట్రావు తదితర నాయకులను అరెస్ట్ లు చేశారు.
ప్రజాస్వామ్య దేశంలో శాంతియుతంగా ర్యాలీ నిర్వహించుకునే హక్కులను తమ పార్టీ కార్యకర్తలపై జరుగుతున్న,
అక్రమ అరెస్టులను నిర్బంధాలను తప్పుడు కేసులను ప్రశ్నించేందుకు నిర్వహిస్తున్న ఈ ర్యాలీని
కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ ఎమర్జెన్సీ కాలాన్ని తలపించేలా సిపిఎం పార్టీ నాయకులను కార్యకర్తలను అర్థరాత్రి నుండి ప్రతి ఇంటికి వెళ్లి అక్రమంగా అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్ లకు తరలించడం ఎంత అనైతికం. దీనిని ప్రజాస్వామ్య వాదులు ముక్తకంఠంతో ఖండించాలని జిల్లా కార్యదర్శి నున్న నాగేశ్వరరావు ఒక ప్రకటనలో కోరారు
శాంతియుతంగా నిర్వహించుకునేందుకు పోలీస్ శాఖ కు విజ్ఞాపన చేసినప్పటికీ పోలీస్ శాఖ వైఖరి అధికార పార్టీకి ఊడిగం చేయడం తప్ప చట్టాన్ని అమలుపరిచే స్థితిలో లేదని అన్నారు.ఎన్ని అరెస్టులు జరిగిన ఈరోజు మధిర లో నిరసన ర్యాలీ జరుగుతుందని అన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వ పోలీస్ శాఖ వైఖరి ప్రజల ముందు ఎండగడతామని అన్నారు.