తెలంగాణ రాజకీయ వార్తలు ..

సామినేని రామారావు హత్య పై సిట్ ఏర్పాటు చేయాలి…అసెంబ్లీలో కూనంనేని డిమాండ్

సామినేని రామారావు హత్య పై సిట్ ఏర్పాటు చేయాలి…అసెంబ్లీలో కూనంనేని డిమాండ్

సిపిఎం నేత సామినేని రామారావు హత్యపై సిట్ ఏర్పాటు చేసి విచారణ జరపాలని సిపిఐ శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు సోమవారం అసెంబ్లీలో డిమాండ్ చేశారు ..రామారావు సౌమ్యుడు ,ఆదర్శ కమ్యూనిస్ట్ నేత …గ్రామంలో రెండు సార్లు సర్పంచ్ గా పనిచేశారు. సిపిఎం నాయకుడుగా రాష్ట్ర రైతు సంఘం అధ్యక్షులుగా ,కార్యదర్శిగా పనిచేశారు …ఆలాంటి వ్యక్తిని హత్యచేసి రెండు నెలలు గడిచిన ఇంతవరకు హంతకులను పట్టుకోవడంలో పోలీస్ శాఖ విఫలమైందని అన్నారు .ఇప్పటికైనా హత్యలో నిజానిజాలు బయటకు రావాలంటే సిట్ విచారణ అవసరమని కూనంనేని అన్నారు .. ఈరోజు శాసనసభలో స్వల్ప వ్యవధిలో జరిగిన చర్చలో ఆయన సామినేని హత్య ఉదంతాన్ని ఆయన ప్రస్తహించారు. తన కొద్దీ సేపటి క్రితం వామపక్షాల ఆధ్వరంలో సామినేని రామారావు హత్యపై ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నానని తెలిపారు …

రామారావును హత్య చేసిన నిందితులను అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని సిపిఎం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో హైదరాబాదులో రౌండ్ టేబుల్ సమావేశం.. పాల్గొన్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేనిసాంబశివరావు గారు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ గారు మాజీ శాసనసభ్యులు జూలకంటి రంగారెడ్డి గారు గుమ్మడి నరసయ్య గారు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ గారు జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరావు గారు జిల్లా నాయకులు పొన్నం వెంకటేశ్వరావు డివిజన్ కార్యదర్శి మడిపల్లి గోపాలరావు తదితరులు

Related posts

మా ఎమ్మెల్యే మీ స్టార్ క్యాంపెయినరా?: కాంగ్రెస్‌పై కేటీఆర్ ఘాటు విమర్శలు…

Ram Narayana

బీఆర్ఎస్‌కు మిగిలింది 99 రోజులే… ఆ పార్టీ రోజులు లెక్కబెట్టుకుంటోంది: రేవంత్ రెడ్డి

Ram Narayana

తెలంగాణలో బిజెపి నథింగ్… కాంగ్రెస్ తోని మాకు ఫైట్… కేటీఆర్

Ram Narayana