ఖమ్మం వార్తలు

ఖమ్మం బీ.ఆర్.ఎస్ పార్టీకి బిగ్ షాక్…కాంగ్రెస్ లోకి క్యూకడుతున్న బీఆర్ యస్ కార్పొరేటర్లు

ఖమ్మం జిల్లాలో రాజకీయపరిణామాలు వేగంగా మారుతున్నాయి …దీంతో రాజకీయాలు రంజుగా మారాయి…బీఆర్ యస్ -కాంగ్రెస్ పార్టీలు ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నాయి.. బీఆర్ యస్ కు చెందిన ఐదుగురు మహిళా కార్పొరేటర్లు సోమవారం మూకుమ్మడిగా మంత్రి తుమ్మల ఆధ్వరంలో హైద్రాబాద్ గాంధీ భవన్ కు చేరుకొని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సమక్షంలో కాంగ్రెస్ కండలు కప్పుకొని బీఆర్ యస్ పార్టీకి షాక్ ఇచ్చారు …మొత్తం 10 మంది కార్పొరేటర్లు చేరతారని అనుకోగా ఈ దఫా ఐదుగురు మరో సారి మరికొంతమంది చేరనున్నారని సమాచారం.. దీంతో బీఆర్ యస్ అలర్ట్ అయింది …తమ కార్పొరేటర్లను కాంగ్రెస్ లో చేరకుండా చేసేందుకు శతవిధాలుగా ప్రయత్నాలు చేస్తుంది …ఒక సామాజికవర్గానికి చెందిన కార్పొరేటర్లను కాంగ్రెస్ లో చేరకుండా అదే సామాజికవర్గానికి చెందిన బీఆర్ యస్ రాజ్యసభ సభ్యులు వత్తిడి చేస్తున్నారని తెలుస్తుంది ..అయితే తమ అవసరాలు రానున్న ఎన్నికల్లో తిరిగి గెలుపొందాలంటే తప్పని సరిగా పార్టీ మారాల్సిన అవసరం ఉందని వారు అంటున్నట్లు సమాచారం …మున్సిపల్ ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం సిద్దమవుతున్న వేళ జరుగుతున్న రాజకీయ పరిణామాలు ఆసక్తిగా మారాయి.. బీఆర్ యస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖమ్మంకు వస్తున్న సమయంలో జరుగుతున్న ఈ పరిణామాలపై బీఆర్ యస్ ఆందోళన వ్యక్తం చేస్తుంది …ఖమ్మంలో పార్టీని తిరిగి పట్టాలమీదకు తెచ్చి గులాబీ పార్టీకి పూర్వవైభవం తేవాలని ఆ పార్టీ నేతలు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయా …? లేదా చర్చలు జరుగుతున్నాయి..

ఖమ్మం మున్సిపల్ ,కార్పొరేషన్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని బీఆర్ యస్ ను మరింత బలహీన పరచాలని కాంగ్రెస్ తీవ్ర ప్రయత్నాలు చేస్తుండగా ,తమ కార్పొరేటర్లను కారు దిగకుండా చూడాలని బీఆర్ యస్ యధాశక్తి ప్రయత్నం చేస్తుంది …ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ లో 60 డివిజన్లు ఉండగా , 2021 ఏప్రిల్ లో జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో బీఆర్ యస్ 45 డివిజన్లు గెలుపొందగా , కాంగ్రెస్ 11 , సిపిఐ, సిపిఎం చెరో రెండు డివిజన్లలో విజయం సాధించాయి…మరో డివిజన్లో బీజేపీ గెలుచుకుంది. అధికార పార్టీగా ఉన్న బీఆర్ యస్ రెండవసారి కార్పొరేషన్ పై గులాబీ జెండా ఎగురవేసింది …బీఆర్ యస్ కు చెందిన పూనుకొల్లి నీరజ మేయర్ అయ్యారు …2023 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది …దీంతో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి..ఖమ్మం కార్పొరేషన్ లో కార్పొరేటర్లు ఒక్కరుగా అధికార కాంగ్రెస్ పార్టీలో చేరడం ప్రారంభించారు .చివరకు మేయర్ నీరజ కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు …నాడు 11 మందిగా ఉన్న కాంగ్రెస్ కార్పొరేటర్లు మరో 26 మంది చేరడంతో 37 కు చేరుకున్నారు …మరో ఐదారుగురు కాంగ్రెస్ చేరబోతున్నారని వారు తమతో టచ్ లో ఉన్నారని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి..దీంతో బీఆర్ యస్ సంఖ్యరీత్యా మరింత బలహీనపడి అవకాశం ఉంది …

12 వ డివిజన్ కార్పొరేటర్ చిరుమామిళ్ళ లక్ష్మీ
..25 వ డివిజన్ కార్పొరేటర్ గోళ్ల చంద్రకళ
..32 వ డివిజన్ కార్పొరేటర్ డోనవన్ సరస్వతి
..40.వ డివిజన్ కార్పొరేటర్ దాదే అమృతమ్మ
..55 వ డివిజన్ కార్పొరేటర్ మోతారపు శ్రావణి

..కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్
..ఆధునిక ఖమ్మం రూపశిల్పి తుమ్మల నాగేశ్వరరావు సమర్ధవంతమైన నాయకత్వం సీఎం రేవంత్ రెడ్డి ప్రజా పాలనలో ఖమ్మం నగరాన్ని ప్రగతి బాటలో నిలిపేందుకు కాంగ్రెస్ పార్టీలో చేరడం సంతోషంగా ఉందని పార్టీ మారిన కార్పొరేటర్లు పేర్కొన్నారు …

ఖమ్మం కార్పొరేటర్లు 5 గురు సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి

  1. చిరుమామిళ్ల లక్ష్మి 12 వ డివిజన్.
  2. డోర్నల రాధ, 17వ డివిజన్.
  3. గోళ్ళ చంద్రకళ, 25 వ డివిజన్.
  4. దాడి అమృత, 40వ డివిజన్.
  5. మోతారపు శ్రావణి, 55 వ డివిజన్.

Related posts

ప్రజా సమస్యల పరిష్కారమే మా ధ్యేయం : మంత్రి పొంగులేటి

Ram Narayana

నాగెలుపులో ప్రధానపాత్ర వహించి 50 వేల మెజార్టీ ఇచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలకు శాల్యూట్ ..! మంత్రి తుమ్మల

Ram Narayana

అంగరంగవైభవంగా బోనమెత్తిన రెడ్డిపల్లి …

Ram Narayana