ప్రపంచ పోలీస్ గా వ్యవహరిస్తున్న ట్రంప్ …
పాక్ -భారత్ యుద్దాన్ని ఆపింది తానేనని పలుమార్లు ప్రకటన
పాక్ తో స్నేహసంబంధాలు …పాక్ ఆర్మీ చీఫ్ తో భేటీలు
ఇరాన్ విషయంలో జోక్యం
పాలస్తీనా -ఇజ్రాయెల్ యుద్ధంలోనూ జోక్యం
రష్యా -యుక్రేయిన్ మధ్య తగుదునమ్మా అంటూ తలదూర్చడం
రష్యా చమురు కొనుగోలు చేయొద్దని భారత్ పై వత్తడి
తాజాగా వెనిజులా అధ్యక్షుడిని భార్యతో సహా బంధించిన వైనం
ప్రపంచంలో అగ్రరాజ్యంగా వెలుగొందుతున్న అమెరికా తిరిగి ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకుంటున్న నిర్ణయాలు ,పోతున్న పోకడలు మూడవ ప్రపంచ యుద్ధం తప్పదా అన్నట్లు ఉంది ..తాను ప్రపంచ శాంతికి కట్టుబడి ఉన్నానని తనకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని కోరిన ట్రంప్ తీరు విచిత్రంగా ,విడ్డురంగా ఉంది ..శాంతి దూతనని చెప్పుకున్న ట్రంప్ యుద్ధపిచాచిగా మారాడని విమర్శలను మూట గట్టుకుంటున్నాడు …తనమాటకు ప్రపంచంలో ఎదురు లేదనే రీతిలో వ్యవహరిస్తున్నారు ..తన పక్కనున్న వెనిజులా అధ్యక్షుడిని అతని భార్యని వారి దేశంపై సైనికదాడి చేయించి అర్ధరాత్రి బంధించి సంకెళ్లతో అమెరికా తీసుకోని వెళ్లి మాదకద్రవ్యాల కేసు నమోదు చేసి జైల్లో పట్టడం పై ప్రపంచ దేశాల ముక్కున వేలేసుకున్నాయి …ఇదెక్కడి న్యాయం …అంతర్జాతీయ న్యాయసూత్రాలను , ఐక్యరాజ్యసమితి నిబంధనలు ఉల్లంఘించి అతి దుర్మార్గంగా సైనిక చర్య చేపట్టడాన్ని భారత్ తో సహా చైనా ,రష్యా ,క్యూబా ,లాంటి దేశాలు ఖండించాయి…అయినప్పటికీ తన పోలీస్ బుద్ది పోనిచ్చుకొని ట్రంప్ కొలంబియా అధ్యక్షుడిని సైతం అరెస్ట్ చేస్తామని ,డెన్మార్క్ లోని గ్రీన్ ల్యాండ్ దీవిని ఆక్రమిస్తామని చెపుతున్నారు … దమ్ముంటే తనను అరెస్ట్ చేయాలనీ కొలంబియా అధ్యక్షుడు పెట్రో సవాల్ విసిరాడు … శాంతి కామఖుడిని అన్న ట్రంప్ నిజస్వరూపం బయట పెట్టుకుంటున్నాడు …ఆయన వైఖరిపై సొంతదేశంలోని ఎంపీలే భగ్గుమంటున్నారు ..దేశంలో తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకుంటున్న చర్యలపై అమెరికన్లు పెద్ద ఎత్తున వీధుల్లోకి వచ్చి నిరసనలు తెలిపారు.
ఉక్రెయిన్ -రష్యా యుద్ధంలోనూ మధ్యవర్తిత్వం చేసి యుద్దాన్ని అవుతానని ప్రకటించారు …కానీ అది కొలిక్కి రాలేదు …ఇక ఇజ్రాయిల్ -పాలస్తీనా విషయంలో తాను ఇజ్రాయిల్ కు బాహాటంగా మద్దతు ఇస్తున్నారు .తన సైనిక బలగాలను సైతం అక్కడకు పంపారు ..
పాక్ -భారత్ యుద్దాన్ని ఆపింది తానేనని లేకపోతె పెద్ద నష్టం జరిగేదని పలుమార్లు ప్రకటించారు ..దాన్ని భారత్ అంగీకరించడంలేదు …ట్రంప్ సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్నారని మండిపడుతుంది ..
తన పొరుగున ఉంటూ తమ మాట వినడంలేదని క్యూబా ,అర్జెంటీనా ,గ్వాటిమాల ,బ్రెజిల్ ,సాల్ సాల్విడర్ , వెనిజులా లాంటి దేశాలపై అమెరికా గుర్రుగా ఉంది .
చైనా, రష్యా, ఇరాన్, క్యూబాలతో ఆర్థిక సంబంధాలను తెంచుకోండి: వెనిజువెలాకు ట్రంప్ టీమ్ వార్నింగ్

- ఆగమ్యగోచరంగా వెనిజువెలా భవిష్యత్తు
- వెనిజువెలాను తానే నియంత్రిస్తున్నానన్న ట్రంప్
- చమురు ఉత్పత్తిలో అమెరికాతో మాత్రమే భాగస్వామ్యం చేయాలని హుకుం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెనిజువెలా దేశంపై తన ఆధిపత్యాన్ని చూపించాలని పట్టుదలతో ఉన్నారు. వెనిజువెలాలో ఇటీవల ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా దళాలు బంధించి తీసుకువెళ్లాయి. ఆ తర్వాత డెల్సీ రోడ్రిగెజ్ తాత్కాలిక అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టారు. అయితే ట్రంప్ మాత్రం వెనిజువెలాను తానే నియంత్రిస్తున్నానని ప్రకటిస్తున్నారు. ఇప్పుడు ఆ దేశానికి చెందిన చమురు ఉత్పత్తిని పెంచుకోవాలంటే కొన్ని షరతులు పాటించాలని అమెరికా డిమాండ్ చేస్తోందని ఏబీసీ న్యూస్ నివేదిక వెల్లడించింది. దీని ప్రకారం వెనిజువెలా కొత్త నాయకత్వం చైనా, రష్యా, ఇరాన్, క్యూబాలతో ఆర్థిక సంబంధాలను తెంచుకోవాలి. అంతేకాదు, చమురు ఉత్పత్తిలో అమెరికాతో మాత్రమే భాగస్వామ్యం చేయాలి, ముఖ్యంగా హెవీ క్రూడ్ ఆయిల్ విక్రయాల్లో అమెరికాకు ప్రాధాన్యం ఇవ్వాలి.
మరోవైపు, వెనిజువెలా దేశం చైనాతో చాలా సన్నిహిత సంబంధాలు కలిగి ఉంది. చైనా ఆ దేశం నుంచి అత్యధిక చమురు కొనుగోలు చేస్తుంది. ఇప్పుడు అమెరికా తన షరతులను ఎలా రుద్దుతుందనేది కీలకం. యూఎస్ విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఒక ప్రైవేట్ మీటింగ్‌లో ఎంపీలతో మాట్లాడుతూ, వెనిజువెలా చమురు ట్యాంకర్లు పూర్తిగా నిండిపోయాయని, అందుకే వారు తమ డిమాండ్లకు లొంగక తప్పదని చెప్పారు. బ్లూంబర్గ్ రిపోర్ట్ ప్రకారం, డిసెంబర్ చివరి నుంచి వెనిజువెలా చమురు బావులను మూసేస్తోంది. ఎందుకంటే అమెరికా ఆంక్షల వల్ల స్టోరేజ్ స్పేస్ లేకుండా పోయింది. మరిన్ని బావులు మూసేస్తే ఆ దేశ ఆర్థిక వ్యవస్థ మరింత కుదేలవుతుంది, తాత్కాలిక అధ్యక్షురాలు రోడ్రిగెజ్ అధికారం కూడా ప్రమాదంలో పడుతుంది.
అమెరికా అంచనాల ప్రకారం, వెనిజువెలా రాజధాని కారకాస్‌కు కేవలం కొన్ని వారాల్లోనే ఆర్థికంగా నిర్వీర్యమైపోయే పరిస్థితి వస్తుంది. చమురు విక్రయాలు లేకుండా దేశం తట్టుకోలేదని చెబుతున్నారు. సెనేట్ ఆర్మ్డ్ సర్వీసెస్ కమిటీ చైర్మన్ రోజర్ వికర్ ఏబీసీ న్యూస్‌తో మాట్లాడుతూ, అమెరికా ప్రభుత్వం వెనిజువెలా చమురును తమ నియంత్రణలోకి తీసుకోవాలని భావిస్తోందని, ఆ ట్యాంకర్లు హవానా వంటి చోట్లకు వెళ్లకుండా చూసుకుంటామని అన్నారు. ఓపెన్ మార్కెట్‌లోకి వెళ్లకుండా ఉంటే మరిన్ని ట్యాంకర్లు నింపే అవకాశం లేదని… ఎందుకంటే అన్నీ పూర్తిగా నిండిపోయాయని ఆయన వివరించారు.
అంతేకాకుండా, ట్రంప్ మరో ఆశ్చర్యకరమైన ప్రకటన చేశారు. వెనిజువెలా తాత్కాలిక అధికారులు 30 మిలియన్ నుంచి 50 మిలియన్ బ్యారెల్స్ చమురును అమెరికాకు అప్పగించనున్నారని, దాన్ని మార్కెట్ ధరకు విక్రయించి వచ్చిన డబ్బును తాను నియంత్రిస్తానని చెప్పారు. ఆ నిధులు వెనిజువెలా ప్రజలు మరియు అమెరికా ప్రజల ప్రయోజనాలకు వినియోగిస్తానని ఆయన పేర్కొన్నారు. ఈ పరిణామాలు వెనిజువెలా భవిష్యత్తును మరింత అనిశ్చితంగా మార్చాయి. అమెరికా ఆధిపత్యం వల్ల ఆ దేశం ఆర్థికంగా ఎలాంటి పరిణామాలు ఎదుర్కొంటుందో చూడాలి. ఇటువంటి ఒత్తిళ్లు ఇతర దేశాలతో సంబంధాలను ఎలా ప్రభావితం చేస్తాయనేది కూడా చర్చనీయాంశం.