ఆంధ్రప్రదేశ్ రాజకీయవార్తలు

ఏపీలో రాష్ట్రపతి పాలన విధించండి: పార్లమెంటు వద్ద వైసీపీ ఎంపీల నిరసన…

  • ప్లకార్డులు చేతపట్టి ఆందోళనకు దిగిన వైసీపీ ఎంపీలు
  • ఏపీలో ఆటవిక పాలన కొనసాగుతోందని నినాదాలు
  • కేంద్రం జోక్యం చేసుకోవాలని డిమాండ్

పార్లమెంట్ ఎదుట వైసీపీ ఎంపీలు ప్లకార్డులు చేతపట్టి ఆందోళనకు దిగారు. ఏపీలో ఆటవిక పాలన కొనసాగుతోందని వారు నినాదాలు చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతల విషయంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని… అవసరమైతే ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు. 

మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేశ్ ల నివాసాలపై దాడుల నేపథ్యంలో వైసీపీ ఎంపీలు ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఇప్పటికే కేంద్ర హోం శాఖ కార్యదర్శిని కలిసి పరిస్థితిని వివరించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కూడా కలిసి పరిస్థితులను ఆయనకు వివరించాలని వైసీపీ భావిస్తోంది.

Related posts

ప్రజా జీవితంలోకి వంగవీటి రంగా కుమార్తె.. రాజకీయాలపై కీలక ప్రకటన!

Ram Narayana

కూటమిది కిచిడి మ్యానిఫెస్టో …జగన్ ధ్వజం….

Ram Narayana

చంద్రబాబు అసెంబ్లీలో తప్పుడు లెక్కలు చెప్పారు: పేర్ని నాని ధ్వజం…

Ram Narayana