తెలుగు రాష్ట్రాలు

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ తరపున పవన్ కల్యాణ్ ప్రచారం..

  • పవన్ కల్యాణ్ ను కలిసిన కిషన్ రెడ్డి, రాంచందర్ రావు
  • బీజేపీకి పవన్ మద్దతు ప్రకటించారన్న రాంచందర్ రావు
  • బీజేపీ తరపున ప్రచారం చేయడానికి అంగీకరించారని వెల్లడి

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల హడావుడి జోరందుకుంది. అన్ని పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ముఖ్యంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు వీలైనన్ని ఎక్కువ స్థానాలను గెలుచుకునే లక్ష్యంతో వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఈ తరుణంలో బీజీపీ కీలక ప్రకటన చేసింది. బీజేపీకి జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మద్దతు ప్రకటించారని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు ప్రకటించారు. 

పవన్ కల్యాణ్ తో తాను, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమావేశమయినట్టు రాంచందర్ రావు ఎక్స్ వేదికగా తెలిపారు. తెలంగాణ మున్సిపల్ ఎన్నికలతో పాటు పలు కీలక అంశాలపై తమ మధ్య చర్చ జరిగిందని వెల్లడించారు. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి పవన్ పూర్తి మద్దతు ప్రకటించారని… బీజేపీ తరపున ప్రచారం చేయడానికి అంగీకరించారని పేర్కొన్నారు. పవన్ మద్దతు తెలంగాణ బీజేపీకి తిరుగులేని బలాన్ని, వేగాన్ని ఇస్తుందని అన్నారు.

Related posts

రిపబ్లిక్ డేలో ఆకట్టుకున్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ శకటాలు

Ram Narayana

అజ్ఞాతంలో మోహ‌న్ బాబు.. పోలీసుల గాలింపు…

Ram Narayana

తిరుమలలో తెలంగాణ లేఖలను అనుమతించడం లేదు… ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి 

Ram Narayana