ఖమ్మం వార్తలు

ఆహ్లదకరంగా తల్లంపాడు పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం ..

ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టునీడలో అంటూ స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాలో పాడిన పాటను తలపిస్తూ 48 సంవత్సరాల క్రితం తల్లంపాడు లో 10 వ తరగతి చదివిన విద్యార్థుల అపూర్వ కలయిక ఆదివారం అత్యంత జయప్రదంగా జరిగింది . ఖమ్మం రూరల్ మండలం తల్లంపాడు ఉన్నత పాఠశాలలో 1976 -77 ,1977 -78 బ్యాచ్ లకు చెందిన విద్యార్థులు పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళన ఘట్టం పాతజ్ఞాపకాలను గుర్తు చేసింది . వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్న పూర్వ విద్యార్థులు ,విద్యార్థినులు ఎంతో ఉత్సాహంతో తమ తీపిగుర్తులు నెమరువేసుకున్నారు ..ఒకరినొకరు ఆత్మీయ పలకరింపులు కుటంబ విశేషాలు ,యోగక్షేమాలు తెలుసుకున్నారు .. నాటి ఆటపాటలు ,ఉపాధ్యాయులు చెప్పిన పాఠాలు తమ జీవితానికి ఒక వెలుగు చూపాయని నాటి కఠిన శిక్షణే క్రమ శిక్షణగా మారిందని తమ భావోద్యేగాలను నెమరు వేసుకున్నారు ..

ఇలాంటి కలయికలు మళ్ళీ మళ్ళీ జరగాలని నిర్ణయించుకున్నారు …వచ్చిన ప్రతివారిలో తమ పాత మిత్రులను కలిసిన ఆనందం కనిపించింది ..హలో మిత్రమా ఎక్కడ ఉంటున్నారు …ఏమి చేస్తున్నారు …పిల్లలు ఏమిటి…? ఎక్కడ ఉన్నారు ..? అనే సరదా కబుర్లుతో చిన్న నాటి జ్ఞాపకాలు నెమరువేసుకున్నారు . నాడు చేసిన చిలిపి చేష్టలు ,నిక్ నేమ్ లతో పిలుచుకున్న పిలుపులు ,ఉపాధ్యాయులను ఆటపట్టించిన సన్నివేశాలు చెప్పుకుని కడుపుబ్బా నవ్వుకున్న ఘటనలు ఆవిష్కృతం అయ్యాయి … వజ్జా శ్రీనివాస్ రావు అధ్యక్షత జరిగిన ఈ సమావేశంలో గురువులు చిమ్మపూడి శ్రీరామమూర్తి ,హనుమంతరావు, ప్రసాద్ రావు , రమాదేవి , పూర్వ విద్యార్ధి యలమూడి రవీందర్ ,దండ్యాల రామారావు , రెంటాల సుదర్శన్ , కొండా వెంకటేశ్వర్లు , రామలక్ష్మణుడు ,తమ్మినేని రామారావు , బత్తిని అరుణ కుమారి , సుబ్బలక్ష్మి సుహాషిని తదితరులు పాల్గొన్నారు .. గురువులను శాలువాలు ,పూలదండలతో ఘనంగా సత్కరించారు …

ఈ సందర్భంగా పాఠ శాలను మరువకుండా, పాఠ శాల పేరున లక్ష రూపాయలను ఫిక్సుడ్ డిపాజిట్ చేసి వడ్డీని 10 వ తరగతిలో స్కూల్ ఫస్ట్ వచ్చిన విద్యార్థి కి ప్రతి సంవత్సరం బహుకరించాలనే సంకల్పాన్ని పలువురు అభినందించారు ..

Related posts

కేంద్ర బడ్జెట్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్ నిరసనలు …ఖమ్మంలో పాల్గొన్నమంత్రి తుమ్మల

Ram Narayana

నేను గుత్తేదారును కాను …నువ్వు గుత్తేదారుకాక గాడిదపాళ్ళుతోముతున్నావా..పోంగులేటిపై కందాల ఫైర్

Ram Narayana

డిప్యూటీ సీఎం పర్యటనకు పకడ్బందీగా ఏర్పాట్లు….. జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్

Ram Narayana