ఆఫ్ బీట్ వార్తలు

భద్రాద్రిలో ‘బాలభీముడు’.. 5.2 కిలోల బరువుతో జన్మించిన బాబు!

  • ములుగు జిల్లాకు చెందిన సంధ్యారాణికి రెండో కాన్పు
  • సిజేరియన్ చేసి శిశువును సురక్షితంగా బయటకు తీసిన వైద్యులు
  • తల్లీబిడ్డలు సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారని వెల్లడి

భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఓ అరుదైన ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళ ఏకంగా 5.2 కిలోల బరువున్న మగ శిశువుకు జన్మనిచ్చింది. సాధారణంగా నవజాత శిశువులు 2.5 నుంచి 3 కిలోల మధ్య బరువు ఉంటారు. కానీ, అందుకు భిన్నంగా ఈ బాబు భారీ బరువుతో జన్మించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ప్రస్తుతం తల్లీబిడ్డలు ఇద్దరూ క్షేమంగా ఉన్నారు.

ములుగు జిల్లా వెంకటాపురం మండలం నూగూరు గ్రామానికి చెందిన ఎం.సంధ్యారాణి రెండో కాన్పు కోసం భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు. శిశువు బరువు అధికంగా ఉండటంతో ఇది క్లిష్టమైన కాన్పుగా వైద్యులు గుర్తించారు. ఈ క్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్ రామకృష్ణ, ఆర్‌ఎంవో డాక్టర్ రాజశేఖర్‌రెడ్డి ప్రత్యేక పర్యవేక్షణలో వైద్య నిపుణులు డాక్టర్ షంషాద్ బేగం, మల్లేశ్‌ల బృందం సిజేరియన్ చేయాలని నిర్ణయించింది.

బుధవారం రాత్రి విజయవంతంగా శస్త్రచికిత్స నిర్వహించి 5.2 కిలోల బరువున్న మగ శిశువును బయటకు తీశారు. భారీ కాయంతో పుట్టడంతో ఆ చిన్నారిని అందరూ ముద్దుగా ‘బాలభీముడు’ అని పిలుస్తున్నారు. గిరిజన ప్రాంతంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఇంతటి క్లిష్టమైన ప్రసవాన్ని సురక్షితంగా నిర్వహించిన వైద్య బృందాన్ని పలువురు అభినందిస్తున్నారు.

Related posts

పాకిస్థాన్ యువతిని ఆన్‌లైన్‌లో పెళ్లి చేసుకున్న బీజేపీ కార్పొరేటర్ కొడుకు!

Ram Narayana

విమానంలో పైలట్ భార్య ప్రయాణం.. హృదయాన్ని హత్తుకునే ప్రకటన చేసిన పైలట్!

Ram Narayana

చైనాలో వినూత్న ప్రయోగం.. రాకెట్ ద్వారా నిమిషాల్లో వస్తువుల డెలివరీ!

Ram Narayana