ఆంధ్రప్రదేశ్

రూ. 3,32,205 కోట్లతో ఏపీ బడ్జెట్… హైలైట్స్ పార్ట్ – 1

  • రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం లక్ష్యంతో బడ్జెట్ రూపొందించామన్న పయ్యావుల
  • రెవెన్యూ వ్యయం  రూ.2,56,143 కోట్లు
  • అమరావతి నిర్మాణానికి రూ. 6 వేల కోట్లు
  • విశాఖ ఆర్థిక ప్రాంతానికి రూ 28 వేల కోట్లు
  • రాయలసీమ గ్లోబల్ హార్టికల్చర్ హబ్ కు రూ. 30 వేల కోట్లు

2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను ఏపీ శాసనసభలో రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. రూ. 3,32,205 కోట్లతో బడ్జెట్ ను ప్రవేశపెడుతున్నట్టు ఆర్థిక మంత్రి తెలిపారు. రాష్ట్ర అభివృద్ధిని, ప్రజా సంక్షేమాన్ని జోడెద్దుల బండిలా పరుగులు పెట్టించాలనే సంకల్పంతో ఈ బడ్జెట్ ను రూపొందించామని చెప్పారు. 

బడ్జెట్ వివరాలు:

  • మొత్తం బడ్జెట్ – రూ.3,32,205 కోట్లు
  • రెవెన్యూ వ్యయం –  రూ.2,56,143 కోట్లు
  • రెవెన్యూ లోటు – రూ.22,002 కోట్లు 
  • మూలధన వ్యయం – రూ.53,915 కోట్లు
  • ద్రవ్య లోటు – రూ.75,868 కోట్లు
  • సర్దుబాటు నిధి – రూ.1,500 కోట్లు 
  • రాజధాని అమరావతి నిర్మాణానికి – రూ.6,000 కోట్లు
  • విశాఖ ఆర్థిక ప్రాంతానికి (ఈ ఆర్థిక ప్రాంతం పరిధిలోకి పది జిల్లాలు) – రూ.28,000 కోట్లు  
  • రోడ్లు, పోర్టు, ఎయిర్‌పోర్టులకు – రూ.13,546 కోట్లు
  • విద్యుత్‌ రంగానికి – రూ.13,934 కోట్లు 
  • పరిశ్రమలకు – రూ.3,161 కోట్లు
  • ఎన్టీఆర్‌ వైద్య సేవకు – రూ.4,000 కోట్లు
  • జల్‌ జీవన్‌కు – రూ.4,000 కోట్లు
  • రాయలసీమ గ్లోబల్‌ హార్టికల్చర్‌ హబ్‌కు – రూ.30,000 కోట్లు 
  • వీబీ జీ రామ్‌ జీకి – రూ.8,365 కోట్లు
  • గృహ నిర్మాణ రంగానికి – రూ.5,451 కోట్లు
  • స్వచ్ఛ భారత్‌ మిషన్‌కు – రూ.1,037 కోట్లు
  • తల్లికి వందనంకు – రూ. 9,668 కోట్లు
  • మహిళా, శిశు సంక్షేమానికి – రూ. 4,581 కోట్లు
  • సాగు నీటి ప్రాజెక్టులకు – రూ. 9,906 కోట్లు
  • రాష్ట్రీయ కృషి వికాస్ యోజనకు – రూ. 1,927 కోట్లు
  • అన్నదాత సుఖీభవకు – రూ. 6,600 కోట్లు
  • స్కిల్ డెవలప్‌మెంట్‌ కు – రూ. 1,232 కోట్లు
  • యూత్ అండ్ స్పోర్ట్స్‌కు – రూ. 438 కోట్లు 
  • మనబడి- మన భవిష్యత్ పథకానికి – రూ. 1,500 కోట్లు
  • పీఎం స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియాకు – రూ. 707 కోట్లు
  • సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర పథకానికి – రూ. 654 కోట్లు
  • స్కాలర్‌షిప్‌ లకు – రూ. 3,836 కోట్లు
  • సమగ్ర శిక్షణకు – రూ. 2,946 కోట్లు
  • ఉన్నత విద్యకు – రూ. 2,566 కోట్లు
  • పాఠశాల విద్యకు – రూ. 32,308 కోట్లు
  • వైద్య ఆరోగ్య శాఖకు – రూ. 19,306 కోట్లు
  • డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజన పథకానికి – రూ. 2,161 కోట్లు
  • మత్య్సకారులకు – రూ. 260 కోట్లు
  • పోలవరం ప్రాజెక్టుకు – రూ. 6,105 కోట్లు
  • ధరల స్థిరీకరణ నిధి – రూ. 500 కోట్లు.

 తొమ్మిది జిల్లాలతో అమరావతి ఆర్థిక ప్రాంతం.. ఏపీ బడ్జెట్ హైలైట్స్ పార్ట్ – 2

Payyavula Keshav Amaravati Economic Zone with Nine Districts AP Budget Highlights
  • బీసీ కాంపోనెంట్ కోసం రూ. 51,021 కోట్లు
  • ఎన్టీఆర్ భరోసా ( పెన్షన్స్)కు రూ. 27,719 కోట్లు
  • ఎంఎస్‌ఎంఈలకు రూ. 3,161 కోట్లు

2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను రాష్ట్ర బడ్జెట్ ను ఏపీ శాసనసభలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… స్వర్ణాంధ్ర 2047కు అనుగుణంగా బడ్జెట్ ను రూపొందించామని తెలిపారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తమ విధానమని చెప్పారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పెట్టుబడిదారులకు అనుకూల వాతావరణం ఉందని తెలిపారు.

రాష్ట్రాన్ని విధ్వంసం నుంచి వికాసం వైపుకు తీసుకెళుతున్నామని పయ్యావుల చెప్పారు. రాయలసీమ రైతుల కలలను ఈ బడ్జెట్ సాకారం చేస్తుందని అన్నారు. శ్రీకాకుళం జిల్లా యువతకు గుండె నిబ్బరాన్ని ఇస్తుందని చెప్పారు. తొమ్మిది జిల్లాలతో అమరావతి ఆర్థిక ప్రాంతాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు.

బడ్జెట్ వివరాలు:

  • ఎంఎస్‌ఎంఈలకు – రూ. 3,161 కోట్లు
  • మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల శాఖకు – రూ. 1,283 కోట్లు
  • ఎన్టీఆర్ భరోసా ( పెన్షన్స్)కు – రూ. 27,719 కోట్లు
  • స్త్రీ శక్తి పథకానికి – రూ. 1,420 కోట్లు
  • గృహ నిర్మాణ శాఖకు – రూ. 6,357 కోట్లు
  • ఎనర్జీ శాఖకు – రూ. 13,934 కోట్లు
  • పోలీస్ శాఖకు 3 వేల కొత్త వాహనాలు
  • కొత్త ఏపీ పోలీస్ అకాడమీ ఏర్పాటు కోసం 94 ఎకరాలు
  • ఐటీ శాఖకు – రూ. 536 కోట్లు
  • పర్యావరణం, అటవీ, విజ్ఞాన శాస్త్రంకు – రూ. 714 కోట్లు 
  • పట్టాణాభివృద్ధి శాఖకు – రూ. 14,539 కోట్లు 
  • హౌసింగ్ కు – రూ. 5,451 కోట్లు 
  • పంటల బీమాకు – రూ. 250 కోట్లు
  • మైనార్టీ వర్గాల సంక్షేమానికి – రూ. 6,090 కోట్లు
  • ఎస్సీ కాంపోనెంట్ కోసం – రూ. 20,644 కోట్లు
  • బీసీ కాంపోనెంట్ కోసం – రూ. 51,021 కోట్లు
  • ఎస్టీ కాంపోనెంట్ కోసం – రూ. 9,190 కోట్లు
  • ఏప్రిల్ ఒకటి నుంచి చేనేత కార్మికులకు నెలకు 200 యూనిట్లు, పవర్ లూమ్ కార్మికులకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్.
  • ఈడబ్ల్యూఎస్ వెల్ఫేర్ కు – రూ.10,699 కోట్లు.

Related posts

పల్లెల ప్రగతి ,పట్టాన ప్రగతిపై కేసీఆర్ సమీక్ష;తాను ఒక జిల్లా దత్తత

Drukpadam

గవర్నర్ కు ఫిర్యాదు చేసే అధికారం ప్రభుత్వ ఉద్యోగులకు లేదు: ఏపీ ఎన్జీవో నేత బండి శ్రీనివాసరావు!

Drukpadam

కల్లుగీత కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలి ..

Ram Narayana