తెలంగాణ వార్తలు

తొర్రూరు మున్సిపాలిటీ లో కోసం కాంగ్రెస్ -బీఆర్ యస్ ఎత్తులు పై ఎత్తులు ..

తొర్రూరు మున్సిపాలిటీ లో కోసం కాంగ్రెస్ -బీఆర్ యస్ ఎత్తులు పై ఎత్తులు ..

ఉమ్మడి వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ మెజారిటీతో గెలిచిన ఏకైక స్థానం తొర్రూరుపై కూడా కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది…తొర్రూరులో మొత్తం 16 వార్డులుండగా, బీఆర్ఎస్ 9, కాంగ్రెస్ 7 చోట్ల విజయం సాధించింది. పాలకుర్తి ఎమ్మెల్యే, వరంగల్ ఎంపీ ఎక్స్ అఫిషియో సభ్యులుగా తొర్రూరు మునిసిపాలిటీలో నమోదు చేసుకున్నారు. రెండు పార్టీలో ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నాయి …

ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, బీఆర్ఎస్ కౌన్సిలర్లు స్పందించారు. తొర్రూరు మున్సిపాలిటీ పీఠాన్ని బీఆర్ఎస్ కైవసం చేసుకుంటుందని ఎర్రబెల్లి సంచలన వ్యాఖ్యలు చేశారు. మా సభ్యులు ఎవరూ కాంగ్రెస్ లోకి వెళ్లడం లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ వార్డు సభ్యులు మా వైపు వస్తున్నారనే భయంతో దుష్ప్రచారాలు చేస్తున్నారని అన్నారు. 16 మంది వార్డు సభ్యులలో మా వాళ్ళు 9 మంది గెలిచారని అన్నారు. ఎక్స్ అఫిషియో ఓట్లతో కూడా కాంగ్రెస్ చైర్మన్ పీఠాన్ని గెలవలేదని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చెప్పుకొచ్చారు.

Related posts

తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్ .. రైతు భరోసా మార్గదర్శకాలు విడుదల!

Ram Narayana

ఎన్నికల హామీ నెరవేర్చేందుకు 300 కుక్కలను చంపించిన సర్పంచ్ ..

Ram Narayana

రైతులకు పెట్టుబడి సాయం… నిధులు విడుదల చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం

Ram Narayana