ఖమ్మం వార్తలు

కొత్తగూడెం మేయర్ గా సిపిఐ…మిగతా మున్సిపాల్టీల్లో చైర్ పర్సన్ లుగా కాంగ్రెస్ అభ్యర్థులు

కొత్తగూడెం మేయర్ గా సిపిఐ…మిగతా మున్సిపాల్టీల్లో చైర్ పర్సన్ లుగా కాంగ్రెస్ అభ్యర్థులు

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కొత్తగూడెం కార్పొరేషన్ సిపిఐ మేయర్ కాగా ,డిప్యూటీ మేయర్ గా కాంగ్రెస్ అవగాహన మేరకు దక్కించుకుంది …సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు , ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి లు ఇరు పార్టీల నిర్ణయాలను అమలు జరిపారు ..దీంతో నిన్నమొన్నటి ఉత్కంఠకు తెరపడింది ..ఇక మిగతా మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ జెండా ఎగరవేసింది .. జిల్లాను మూడురంగులుగా మార్చడంలో మంత్రులు ,డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క , పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి , తుమ్మల నాగేశ్వరరావులు కీలకంగా వ్యవహరించారు ..కొత్తగూడెం లో ఎర్రజెండాను రెపరెపలాండించి కమ్యూనిస్టులు ఎక్కడ ఉన్నారనేదానికి సమాధానం ఇచ్చిన కొత్తగూడెం ప్రజలకు , ప్రధానంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు కృషికి ప్రశంశలు వెల్లు ఎత్తాయి..

భద్రాద్రి కొత్తగూడెం మేయర్
మూడు గణేష్ (సిపిఐ.. ఎస్టీ జనరల్)

డిప్యూటీ మేయర్ సిరిపురపు లలిత కుమారి(కాంగ్రెస్)

1) ఎదులాపురం

పోకాబత్తిని అనిత ( ఎస్సీ మహిళ)

వైస్ చైర్మెన్.. తమ్మినేని నవీన్ ( కమ్మ)

2) వైరా..

కాపా చంద్ర కళ ( కమ్మ)
వైస్ చైర్మెన్.. కట్ల సంతోష్

3) కల్లూరు

చైర్మన్ గా -మోహన్ నాయక్ ( ఎస్టీ జనరల్)
వైస్ చైర్మెన్.. శీలం కోటేశ్వరి ( రెడ్డి)

4)సత్తుపల్లి

చైర్మన్ గా – రహనా బేగం ( మైనారిటీ)
వైస్ చైర్మెన్.. బొంతు సుమలత

5) మధిర

చైర్మన్ గా -సుజాత( కమ్మ)
వైస్ చైర్మెన్.. కోనా దనీ కుమార్ ( వైశ్య )

6) అశ్వారావుపేట

జూపల్లి శశికళ ( జనరల్ మహిళ వెలమ )
వైస్ చైర్మెన్ – జూపల్లి రమేష్ (చైర్మన్ వైస్ చైర్మన్ ఇద్దరూ కూడా భార్యాభర్తలు)

మధిరను మోడల్ టౌన్‌గా తీర్చిదిద్దుతాం..మీడియా సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెల్లడి

రాజకీయాలకు తావులేకుండా అభివృద్ధి!

త్వరలో డెవలప్‌మెంట్ కమిటీ’ ఏర్పాటు

​* ఓటర్ల నమ్మకాన్ని వమ్ము చేయబోం

​* కాంగ్రెస్ – టీడీపీ కూటమి వాగ్దానాలన్నీ అమలు చేస్తాం

మధిర పట్టణాన్ని రాష్ట్రంలోనే ఒక ‘రోల్ మోడల్’గా, నివసించడానికి అత్యంత అనువైన ‘మోస్ట్ లివబుల్ టౌన్’గా అభివృద్ధి చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. సోమవారం మధిరలో
మున్సిపల్ నూతన పాలు ఒక వర్గం ఎన్నిక తర్వాత ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అఖండ విజయాన్ని చేకూర్చిన ఓటర్ల నమ్మకాన్ని వమ్ము చేయబోమని, అత్యంత బాధ్యతగా ఈ ప్రాంతాలను అభివృద్ధి పథంలో నడిపిస్తామని స్పష్టం చేశారు. ప్రజలు తమపై ఉంచిన అపారమైన నమ్మకాన్ని గౌరవిస్తూ, అత్యంత బాధ్యతగా ఈ ప్రాంతాల అభివృద్ధికి కృషి చేస్తామని డిప్యూటీ సీఎం భరోసా ఇచ్చారు. “అభివృద్ధి, సంక్షేమం, పారదర్శకత.. ఈ మూడు సూత్రాలతో మధిర పట్టణ వాసులకు మెరుగైన పాలన అందిస్తాం. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ – తెలుగుదేశం కూటమి అభ్యర్థులు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని తూచా తప్పకుండా అమలు చేసి మధిర ప్రజల రుణం తీర్చుకుంటాం” అని ఆయన పేర్కొన్నారు.
​రాజకీయాలు పక్కన పెట్టండి..
మధిర పట్టణాన్ని భవిష్యత్తు తరాలకు ఒక ‘రోల్ మోడల్’గా తీర్చిదిద్దడమే తమ తక్షణ కర్తవ్యమని వెల్లడించారు. ఈ మేరకు నూతనంగా ఎన్నికైన మున్సిపల్ పాలకవర్గానికి దిశానిర్దేశం చేశారు.
నూతనంగా ఎన్నికైన మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ మరియు కౌన్సిలర్లకు భట్టి విక్రమార్క కీలక ఆదేశాలు జారీ చేశారు. “పదవులు చేపట్టాక ఇక రాజకీయం ఉండకూడదు. ‘నో పాలిటిక్స్ – ఓన్లీ డెవలప్‌మెంట్’ అనే నినాదంతో పని చేయాలి. పట్టణాన్ని క్లీన్ అండ్ గ్రీన్ గా మార్చడానికి ఉమ్మడి ప్రణాళికతో ముందుకు సాగాలి” అని సూచించారు.

అభివృద్ధి కమిటీ ఏర్పాటు
భవిష్యత్తు తరాలకు ఆదర్శంగా నిలిచేలా మధిరను అభివృద్ధి చేసేందుకు పట్టణంలోని పెద్దలు, మేధావులతో రాజకీయాలకు అతీతంగా ఒక ‘డెవలప్‌మెంట్ కమిటీ’ని ఏర్పాటు చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ కమిటీ పట్టణ అభివృద్ధి కోసం తీసుకోవాల్సిన చర్యల గురించి నూతన పాలకవర్గానికి తగిన సలహాలు సూచనలు ఇస్తుందన్నారు. ​వీరి సలహాలు, సూచనలతో పట్టణ రూపురేఖలు మార్చి, రాష్ట్రంలోనే మధిరను ఒక మోడల్ టౌన్‌గా నిలబెడతామని ధీమా వ్యక్తం చేశారు. ప్రతి 15 రోజులకు లేదా నెలకు ఒకసారి అభివృద్ధి పనులపై తానే స్వయంగా సమీక్ష నిర్వహిస్తానని తెలిపారు. ​ఇందుకోసం ఒక ప్రత్యేక క్యాలెండర్‌ను ఫిక్స్ చేసుకుని, ప్రణాళికాబద్ధంగా పట్టణ రూపురేఖలు మారుస్తామని చెప్పారు.
​ప్రతిభావంతంగా పనిచేసి మధిరను ప్రగతి పథంలో అగ్రస్థానంలో నిలపాలని పాలకవర్గానికి ఆయన దిశానిర్దేశం చేశారు.

కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్‌ను దక్కించుకున్న సీపీఐ మేయర్ పీఠంపై ఒక మాములు సిపిఐ కార్యకర్తను కూర్చోబెట్టింది ..పార్టీకి ఏంతో లాయల్ గా ఉండే మూడ్ గణేష్ డ్రైవర్ గా తన జీవనం కొనసాగిస్తున్నారు …ఎన్నికల్లో పార్టీ పిలిచి మరి సీటు ఇచ్చి గెలిపించడమేగాక , మేయర్ గా చేసింది …కాంగ్రెస్ -సిపిఐ అవగాహనలో భాగంగా సిపిఐ కి మొదటి రెండున్నర సంవత్సరాలు మేయర్ అవకాశం దక్కడంతో గణేష్ ను ఆ పదవి వరించింది ..

సీపీఐకి చెందిన మూడ్ గణేశ్‌ మేయర్‌గా, డిప్యూటీ మేయర్‌గా కాంగ్రెస్ పార్టీకి చెందిన లలితకుమారి ఎన్నికైయ్యారు .. గతంలో ఆటో డ్రైవర్‌గా, ప్రైవేట్ వాహనాలకు డ్రైవర్‌గా పని చేసిన గణేశ్

Related posts

ఖమ్మంలో అట్టహాసంగా కాంగ్రెస్ అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డి నామినేషన్

Ram Narayana

వైరాలో కాంగ్రెస్ షాక్..

Ram Narayana

రాష్ట్రమంత్రులు పొంగులేటి,,తుమ్మల ఖమ్మం జిల్లా పర్యటన….

Ram Narayana