జనరల్ వార్తలు ...

ఏపీ సీఎం చంద్రబాబుతో మంత్రి తుమ్మల భేటీ…

తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, హ్యాండ్‌లూమ్స్ & టెక్స్టైల్స్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని కలిసి ఖమ్మం జిల్లాకు సంబంధిచిన సాగునీటి వసతులు, భక్తులు మరియు ప్రజల సౌకర్యానికి సంబంధించిన పలు కీలక విజ్ఞప్తులు చేసారు.
రాష్ట్ర పునర్విభనలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం మండలానికి ఆనుకుని ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అయిదు గ్రామపంచాయతీలను తెలంగాణలో విలీనం చేయాల్సిన అవసరం ఉందని మంత్రి వివరించారు. యేటపాక, కన్నాయిగూడెం, పిచ్చికలపాడు, పురుషోత్తపట్నం, గుండాల గ్రామపంచాయతీలు భౌగోళికంగా తెలంగాణ ప్రాంతాల మధ్యలో ఉండటం వల్ల ప్రజలు పరిపాలనా పరంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లారు.
ఈ గ్రామాలు గోదావరి నది, అటవీ ప్రాంతాల మధ్య ఉండటంతో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఎంక్లేవ్‌లా మారిపోయాయని, జిల్లా కేంద్రాలకు చేరుకోవడానికి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చంద్రబాబు దృష్టికి తుమ్మల తెచ్చారు ..

Related posts

మొబైల్ నంబర్ పోర్టబిలిటీకి కొత్త మార్గదర్శకాలు విడుదల చేసిన ట్రాయ్

Ram Narayana

మరోసారి స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి కరోనా …సీఎల్పీ నేత భట్టికి కరోనా!

Drukpadam

దేశంలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు….ప్రధాని మోదీ ఉన్నతస్థాయి సమావేశం…

Drukpadam