ఖమ్మం వార్తలు

వెలుగుమట్ల బాధితులకు బాసటగా కేటీఆర్.. రేపు ఖమ్మం పర్యటన

వెలుగుమట్ల బాధితులకు బాసటగా కేటీఆర్.. రేపు ఖమ్మం పర్యటన
వెలుగుమట్ల బాధితులకు బాసటగా నిలవనున్న బీఆర్ యస్
పేదల జీవించే హక్కును కాలరాస్తున్న రేవంత్ సర్కార్
కాంగ్రెస్ ఇందిరమ్మ రాజ్యంలో ‘దమనకాండ’..

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 25 నెలల కాలంలో ప్రజలకు ఇచ్చిన గ్యారంటీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని, తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే ప్రతిపక్ష బిఆర్ఎస్ పార్టీపై బురద జల్లే కార్యక్రమానికి తెరలేపిందని బిఆర్ఎస్ నాయకత్వం తీవ్రంగా విమర్శించింది. గత పదేళ్ల కేసీఆర్ పాలనలో జరిగిన అభివృద్ధిని ధ్వంసం చేయడమే లక్ష్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం పనిచేస్తోందని మండిపడింది. లగచర్లలో గిరిజన సోదరుల భూములను రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం లాక్కునేందుకు అర్ధరాత్రి పూట పోలీసులను, పారా మిలటరీ బలగాలను పంపి గర్భిణీలు, వృద్ధులని కూడా చూడకుండా విచక్షణారహితంగా దాడి చేసిన చరిత్ర ఈ ప్రభుత్వానిది. హైదరాబాద్‌లో హైడ్రా పేరుతో 40 ఏళ్లుగా నివసిస్తున్న పేదల ఇళ్లను కూల్చివేసి వారిని రోడ్డున పడేశారు. “రేవంత్ అంకుల్.. మంచి చేస్తారని ఓటు వేస్తే మా ఇళ్లు కూల్చారు” అని చిన్న పిల్లలు ఏడుస్తున్నా ఈ ప్రభుత్వానికి కనీసం జాలి కలగడం లేదని నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. నిన్న ఖమ్మం నడిబొడ్డున వెలుగుమట్ల గ్రామంలో జరిగిన ఘటన అత్యంత అమానుషం. భూదాన్ ట్రస్ట్ బోర్డు ద్వారా పట్టాలు పొంది, గత కొంతకాలంగా నివసిస్తున్న 1895 మంది పేద కుటుంబాలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. కోర్టులో స్టేటస్ కో ఆర్డర్ ఉన్నప్పటికీ, వేల సంఖ్యలో పోలీసులను మోహరించి ఒక యుద్ధ వాతావరణాన్ని సృష్టించారు. పత్రికా స్వేచ్ఛను హరించి, మీడియాను కూడా అనుమతించకుండా ఒక ఎన్‌కౌంటర్ సీన్‌ను తలపించేలా బుల్డోజర్లతో ఇళ్లను కూల్చివేయడం ప్రజాస్వామ్యానికే సిగ్గుచేటు. బాధిత కుటుంబాలకు భరోసా ఇచ్చేందుకు బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) గారు రేపు మధ్యాహ్నం 12:00 గంటలకు ఖమ్మం చేరుకోనున్నారు. వెలుగుమట్ల బాధితులను పరామర్శించి, ప్రభుత్వం చేసిన విధ్వంసాన్ని స్వయంగా పరిశీలిస్తారు.
వెలుగుమట్ల బాధితులందరికీ తక్షణమే పునరావాసం కల్పించాలని, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కేటాయించాలని. మానవ హక్కుల ఉల్లంఘనపై సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నాం.

రేపటి కార్యక్రమంలో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, నామా నాగేశ్వరరావు మరియు జిల్లా ముఖ్య నాయకులు పాల్గొంటారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న పార్టీ శ్రేణులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి కేటీఆర్ పర్యటనను విజయవంతం చేయాలని, బాధితులకు అండగా నిలవాలని పార్టీ తరపున విజ్ఞప్తి చేశారు.

ఈ మీడియా సమావేశంలో మండల పార్టీ అధ్యక్షులు బెల్లం వేణుగోపాల్, పగడాల నాగరాజు, భాషబోయిన వీరన్న, మాజీ డిసిసిబి చైర్మన్ కూరాకుల నాగభూషయ్య, బిఆర్ఎస్ పార్టీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కర్నాటి కృష్ణ, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ మక్బూల్, లీగల్ సెల్ బిచ్చాల తిరుమలరావు, మైనారిటీ సెల్ జిల్లా అధ్యక్షులు తాజుద్దీన్, ఉద్యమకారులు పగడాల నరేందర్, నాయకులు తాతా ప్రసాద్, హనుమంతరావు, బలుసు మురళీకృష్ణ, మహమ్మద్ రఫీ, మంచా నాయక్ మరియు తదితరులు పాల్గొన్నారు.

వెలుగుమట్లపై ప్రతిపక్షాల రాద్ధాంతం …తుమ్మలపై విమర్శలు ..మండిపడ్డ రాయల
తుమ్మల ఏనాడైనా భూకబ్జాలు చేశారా …?బీఆర్ యస్ కు రాయల సూటి ప్రశ్న
వెలుగుమట్లలో నిజమైన పేదలు ఉన్నారా …? ఉంటె చెప్పండి న్యాయం చేస్తాం …
కాంగ్రెస్ పార్టీ పేదల పక్షపాతి.. ఖమ్మం నియోజకవర్గ పేదలకు న్యాయం చేస్తాం
భాదితుల పరామర్శ పేరుతో కేటీఆర్ వస్తే అభాసుపాలు కావడం ఖాయం
భూదాన్ భూములపై ప్రతిపక్షలు చేస్తున్న ప్రచారంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ రాష్ట్ర గిడ్డంగుల సంస్ధ చైర్మన్ రాయల నాగేశ్వరరావు..

వెలుగుమట్ల భూదాన్ భూముల్లో నివసిస్తున్న వారి ఇళ్లను మంగళవారం రెవెన్యూ పోలీస్ బలగాలు పెద్ద ఎత్తున చేరుకొని బొల్డోజర్ల సహాయంతో కూల్చివేశారు ..దీనిపై సిపిఎం , బీఆర్ యస్ పార్టీలు ప్రతిఘటించే ప్రయత్నం చేశాయి.. అయినా కూల్చివేతలు ఆగలేదు ..దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి సోషల్ మీడియా వేదికగా మంత్రుల మీద అధికార యంత్రాంగం మీద వీరుచపడ్డారు .. ప్రధానంగా నియోజకవర్గ శాసనసభ్యుడైనా మంత్రి తుమ్మల ఇందుకు కారణమనే అభిప్రాయలు రావడంతో కాంగ్రెస్ నాయకులు దాన్ని ఖండిస్తూ ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు .. మంత్రిపై వస్తున్నా ఆరోపణలను ఖండించారు . వెలుగుమట్ల భూదాన్ భూములపై ప్రతిపక్షాలు చేస్తున్న ప్రచారం పై తీవ్ర స్థాయిలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు మండిపడ్డారు..అక్కడ నిజంగా పేదలు ఉంటే ప్రభుత్వం వారికి న్యాయం చేస్తుందని ఆయన అన్నారు..తుమ్మల నాగేశ్వరరావు రాజకీయ జీవితంలో ఎక్కడైనా భూమి కబ్జా చేశారా అని బీఆర్ యస్ నాయకుల ను ప్రశ్నించారు.. ఇప్పుడు భూదాన్ భూములను ప్రభుత్వ పరంగా వినియోగిస్తుంది తప్ప ఏ ప్రయివేటు కంపెనీలకో ఒప్ప చెప్పడానికి కాదన్నారు..గత బీఆర్ యస్ ప్రభుత్వం లో భూదాన్ భూముల ఆక్రమణ దారులను ఖాళీ చేయించడానికి ప్రయత్నం జరిగిందని..కోర్టు రెవెన్యూ అధికారులకు ఖాళీ చేయించే హక్కు లేదని తీర్పు ఇచ్చిందని ఆయన చెప్పారు.ఇప్పుడు సీసీఎల్ఏ వారు కోర్టు ఉత్తర్వులు ప్రకారం ఖాళీ చేయించారని ఆయన తెలిపారు..గతంలో అక్కడ నిర్మాణం చేసుకున్న ఓ పది మంది కోర్ట్ కు వెళ్ళినప్పుడు వారికి స్టే ఇచ్చిందని మిగతా వారికి ఇవ్వలేదని ఆయన అన్నారు.. కొంతమంది వ్యక్తులు దళారీలుగా మారి డబ్బులు తీసుకుని గుడిసెలు వేయించారని ఆయన మండిపడ్డారు..కోర్టు స్టే ఇచ్చిన 10 ఇళ్లను వదిలేసి మిగతా అక్రమనదారులను కాళీ చేయించడం జరిగిందని ఆయన చెప్పారు..భూదాన్ భూమి పంచాయతీ ఇప్పటిది కాదని గత బీఆర్ యస్ ప్రభుత్వం నుంచి ఉందన్నారు.గత ప్రభుత్వం లో ఉన్న మంత్రి కూడా కాళీ చేయించే ప్రయత్నం చేసింది వాస్తవం కాదా అని ఆయన ప్రశ్నించారు..బీఆర్ యస్ నాయకులు వాస్తవాలు తెలుసుకోకుండా రాజకీయం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు..మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మీద బీఆర్ యస్ నాయకులు బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని వాటిని పట్టించుకోవాల్సిన అవసరం తమకు లేదన్నారు..గత బీఆర్ యస్ ప్రభుత్వం లో జరిగిన ప్రక్రియనే ఇప్పుడు జరుగుతుందన్నారు..ఖమ్మం నియోజకవర్గనికి సంబంధించిన వారు అక్కడ 40 మంది కూడా లేరన్నారు..నిజమైన పేదలను గుర్తించి వారికి తప్పకుండా న్యాయం చేస్తామని ఆయన తెలిపారు..భూదాన్ భూములకు వ్యవహారానికి సంబంధించి కేటీఆర్ వస్తున్నారని బీఆర్ యస్ నాయకులు చెప్తున్నారని వారి మాటలు విని కేటీఆర్ వస్తే అబాసుపాలు అవుతారని ఆయన అన్నారు..ఈ కార్యక్రమంలో ఖమ్మం మేయర్ పూనకోల్లు నీరజ,డిసిసి మాజీ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్, డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహ్ర, ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ హనుమంతరావు,ఓబీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు పుచ్చలకాయల వీరభద్రం,జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు దోబ్బల సౌజన్య, బాలగంగాధర్ తిలక్,తదితరులు పాల్గొన్నారు..

Related posts

బడులు తెరిచినరోజునే పిల్లలకు పుస్తకాలూ ,దుస్తులు పంపిణి చేసిన డిప్యూటీ సీఎం భట్టి ,మంత్రి తుమ్మల …

Ram Narayana

ట్రాఫిక్ ఫ్రీ నగరంగా ఖమ్మం… మంత్రి తుమ్మల

Ram Narayana

ఖమ్మం కాంగ్రెస్ లో లొల్లి …ముగ్గురు మంత్రుల సమక్షంలోనే వాదులాట

Ram Narayana