తెలంగాణ వార్తలు

జర్నలిస్టులకు అందరికి ఇళ్ల స్థలాలు…సీఎం రేవంత్ రెడ్డి

జర్నలిస్టులందరికీ ఎలాంటి న్యాయ చిక్కులు లేకుండా న్యాయనిపుణలతో చర్చించి అందరికి ఇళ్లస్థలాలు ఇచ్చుకుందామని మహిళా దినోత్సవం సందర్భంగా ఇంటికి వెళ్లి ఈ శుభవార్త చెప్పండని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు .. నేను సీఎం గా వచ్చిన తర్వాత జర్నలిస్టులకు ఇచ్చిన ఇళ్లస్థలాల విషయంలో సుప్రీం కోర్ట్ అభ్యంతరాలు చెప్పిందని వాటిని కూడా న్యాయనిపుణులతో చర్చించి ఎలాంటి న్యాయపరమైన చిక్కులు లేకుండా అన్నిటిని పరిష్కరించుకుందామని అన్నారు .. ఫ్యూచర్ సిటీ లో ఎమ్మెల్యేలకు ఎంపీలకు జర్నలిస్టులకు మంచి కాలనీ నిర్మించే ప్రతిపాదనలు ఉన్నాయని అన్నారు .. ఆదివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా ప్రజాభవన్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని ప్రసంగించారు .ఈ సందర్భంగా మహిళలకు అనేక వరాలు ప్రకటిస్తూ ప్రత్యేకంగా మీడియా అకాడమీ చైర్మన్ కె .శ్రీనివాస్ రెడ్డి సూచన మేరకు మహిళల రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని అన్నారు .. శీనన్న చెప్పినట్లు కమిటీలు ఏర్పాటుచేసేందుకు కూడా చర్చించామని ఇది ఉద్యోగులలో కూడా వస్తుందని దీనిపై తప్పకుండ నిర్ణయం తీసుకుంటామని అన్నారు ..

ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో వస్తున్నా వార్తలపై ఎలాంటి ఇబ్బందులు లేకున్నా , సోషల్ మీడియా లో ప్రచారం చేసే అబద్దాలపై నియంత్రణ చేయాలని అన్నారు … అవసరమైతే శాసనసభలో చర్చించి ఒక చట్టం చేస్తామని ముఖ్యమంత్రి తెలిపారు …అక్రిడేషన్స్ విషయంలో డెస్క్ లేదా మిగతా జర్నలిస్టులు అనే తేడా ఉండదని ఒకే రకమైన కార్డులు ఇస్తామని , అందరికి అన్ని సౌకర్యాలు వర్తింప చేస్తామని హామీ ఇచ్చారు… ఈ విషయాన్నీ మంత్రిగారికి కూడా చెప్పానని అందువల్ల ఎవరు అపోహలు పెట్టుకోవద్దని అన్నారు.

ప్రభుత్వాలకు – ప్రజలకు మధ్య వారధి మీడియా. ఆ వారధికి సారథులుగా ఉన్న మహిళా జర్నలిస్టుల సమక్షంలో, ప్రజాభవన్ లో ప్రపంచ మహిళ దినోత్సవంలో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి..

పలువురు మహిళ జర్నలిస్టులను సత్కరించి, సమాజానికి వారు చేస్తున్న సేవలకు అభినందనలు తెలియజేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…

రెండేళ్లలో ప్రజాపాలన తెచ్చిన మార్పునకు ప్రత్యక్ష సాక్షులు ఆడబిడ్డలే., వారి జీవితాల్లో ఆర్థిక స్వావలంబన నుంచి ఆత్మగౌరవ జీవనం వరకు కలలను సాకారం చేసిన పాలన ఇది.., సంక్షేమం నుంచి సక్సెస్ ఫుల్ ఆంత్రప్రెన్యూర్ వరకు మహిళలను ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం ఇది., మా సర్కారుకు బ్రాండ్ అంబాసిడర్ లు ఆడబిడ్డలే అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు..

ప్రసంగం ముగించి వెలుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి జర్నలిస్ట్ ల సమస్యలు వివరించి, తిరిగి హామీ ఇప్పించిన ప్రెస్ అకాడమీ చైర్మన్, ఐజేయు జాతీయఅధ్యక్షులు కే శ్రీనివాస్ రెడ్డి…

Related posts

డీఏ పెండింగ్ పై ప్రభుత్వ ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి …

Ram Narayana

పద్దతి మార్చుకుంటేనే మనుగడ – రేవంత్ డ్డికి మేధావుల సూచన…

Ram Narayana

మల్కాజ్‌గిరి ఎమ్మెల్యేకు నిరసన సెగ

Ram Narayana