ఖమ్మం వార్తలు

ఖమ్మంలో ఉద్రిక్తత…తోపులాట కల్వకుంట్ల కవిత అరెస్ట్ …విడుదల .. దీక్ష కొనసాగింపు

ఖమ్మంలో వెలుగుమట్ల కూల్చివేతలు నిరసనగా జాగ్రతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ధర్నా చేపట్టారు … ఆమెను పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేశారు …. అయితే ఆందోళన కార్యక్రమాన్ని విరమిస్తున్నట్లు చెప్పిన కవిత తిరిగి వారికీ మద్దతుగా అంబెడ్కర్ భవనంలో దీక్షకు దిగారు ..

అంతకు ముందు జడ్పీ వద్ద ఆందోళనలో పెద్ద సంఖ్యలో నిర్వాసితులు పాల్గొన్నారు … ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు .. అంబేద్కర్ సెంటర్ లో ధర్నా , మానవహారం నిర్మించారు ..వందలాది మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ..ఒక సందర్భంలో పోలీసులకు ఆందోళన కారులకు మధ్య తోపులాట జరిగింది …ఈ సందర్భంగా అటు పోలీసులకు ఇటు ఆందోనళన కారులకు చిన్న చిన్న దెబ్బలు సైతం తగిలాయి.. ఒక విలేకరి చేయి తోపులాటలో వత్తుకొని పోయి రక్తం కారింది ..

ఖమ్మం వెలుగుమట్ల బాధితులకు న్యాయం కోసం ….జడ్పీ వద్ద భారీ రాస్తారోకో మహా ధర్నా…. ఈ కార్యక్రమంలో కల్వకుంట్ల కవిత , డా. విశారదన్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు రాకేష్ దత్త పాల్గొన్నారు.

ఖమ్మం జడ్పీ వద్ద ఉద్రిక్తత వెలుగుమట్ల బాధితుల తో కలిసి రాకేష్ దత్త ….ఖమ్మం జిల్లా లో వెలుగుమట్ల లోని స్థానిక ఖమ్మం కలెక్టర్ అక్కడ నివసిస్తున్న చాలా మంది పేద వారి ఇల్లులు వారికి నోటీసు లు ఇవ్వకుండా వారి ఇళ్లను నిర్ధాక్షిణ్యంగా అర్ధరాత్రి 3 గంటలకు 4000 మంది పోలీసు బలగాల తో వచ్చి కూల్చివేయడం జరిగింది. బాధితుల కోసం విద్యార్థి నాయకుడు రాకేష్ దత్త దాదాపు 12 రోజులు గా న్యాయ దీక్ష చేస్తు ప్రతి విషయం లో బాధితులకు తోడూ గా ఉండి రాష్ట్రం నుంచి అన్ని పార్టీ నాయకులను ఖమ్మం రప్పించి బాధితులకు జరిగిన అన్యాయం గురించి పోరాటం చేస్తున్నాడు. ఈ పోరాటం లో భాగంగా ఈ రోజు కల్వకుంట్ల కవితని మరియు డా.విశారదన్ మహారాజ్ ని ఖమ్మం రప్పించి వారి సమస్య పై పెద్ద యుద్ధం ప్రకటించారు. ఈ యుద్ధం లో విద్యార్ధి నాయకుడు రాకేష్ దత్త జడ్పీ వద్ద బాధితులతో కలిసి దాదాపు 3 గంటల పాటు ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ ధర్నా లో చాలా పెద్ద ఎత్తున ట్రాపిక్ జామ్ అయ్యి ,3 గంటల వరకు వాహనాలు నిలిచి పోవడం జరిగింది. అక్కడికి కలెక్టర్ రాకుండా ఆర్. డి ఓ ను పంపించడం జరిగింది.

K Kavitha Warns Government Against Upsetting Women

ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో ఇళ్ల కూల్చివేతల బాధితులను తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇవాళ‌ పరామర్శించారు. ఇళ్లు కోల్పోయి కన్నీరు పెట్టుకుంటున్న మహిళలను చూసి ఆమె చలించిపోయారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. ఆడబిడ్డల దుఃఖం, వారి కన్నీళ్లు ప్రభుత్వానికి మంచిది కాదని హెచ్చరించారు.

“నేను టూరిస్ట్‌ను కాదు. మీ సమస్యకు పరిష్కారం చూపేవరకూ ఇక్కడే ఉండి పోరాడతా” అని కవిత బాధితులకు భరోసా ఇచ్చారు. జిల్లా కలెక్టర్, మంత్రులు తక్షణమే వెలుగుమట్లకు వచ్చి బాధితులతో మాట్లాడి, వారి సమస్యలకు పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. పేదల ఇళ్లపై బుల్డోజర్లు పంపడం అన్యాయమని మండిపడ్డారు. కొన్ని రాజకీయ పార్టీలు ఈ దుఃఖాన్ని కూడా రాజకీయం కోసం వాడుకుంటున్నాయని ఆమె ఆరోపించారు.

గతంలో బీఆర్ఎస్ వాళ్లు కూడా ఇళ్లు కూల్చడానికి ప్రయత్నాలు చేశారని కవిత అన్నారు. ఎక్కడైతే ఇళ్లు కూల్చివేశారో అక్కడే తిరిగి స్థలాలు ఇచ్చి, ప్రభుత్వమే ఇళ్లు నిర్మించి ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. బాధితులకు న్యాయం జరిగే వరకు, సమస్యకు శాశ్వత పరిష్కారం దొరికేంత వరకు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తానని కవిత స్పష్టం చేశారు.

వెలుగుమట్ల బాధితులకు న్యాయం చేయాలని రోడ్డుపై బైఠాయించిన కవిత

Kalvakuntla Kavitha Protests for Velugumatla Victims in Khammam
  • బాధితులకు న్యాయం జరిగే వరకు అండగా ఉంటామన్న కవిత
  • ప్రభుత్వం బాధితులకు అండగా లేదని విమర్శ
  • బాధితులతో కలిసి జెడ్పీ కూడలిలో ఆందోళన
  • పోలీసులు సర్దిచెప్పడంతో నిరసన విరమించిన కవిత

ఖమ్మం జిల్లా వెలుగుమట్ల బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఖమ్మం నగరం జెడ్పీ కూడలిలో ఆందోళనకు చేపట్టారు. ఖమ్మంలోని అంబేద్కర్ భవనంలో వెలుగుమట్ల బాధితులను ఆమె పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, బాధితులకు న్యాయం జరిగే వరకు తాము అండగా ఉంటామని అన్నారు.

ప్రభుత్వం ఇప్పటి వరకు బాధితులకు మద్దతుగా లేదని మండిపడ్డారు. ప్రభుత్వం తరఫున వారికి వైద్య సహాయం కూడా అందడం లేదని విమర్శించారు.

అనంతరం కార్యకర్తలు, బాధితులతో కలిసి జెడ్పీ కూడలిలో ఆందోళనకు దిగారు. వెలుగుమట్ల బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. జెడ్పీ కూడలిలో రోడ్డుపై బైఠాయించారు. దీనితో రోడ్డుపై ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు జోక్యం చేసుకుని, సర్ది చెప్పడంతో కవిత నిరసన విరమించారు.

Related posts

ఘనంగా కత్తి నెహ్రు 60 వసంతాల వేడుకలు!

Ram Narayana

త్రాగునీటి ఇబ్బందులు రానివ్వొద్దు – రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి

Ram Narayana

వైరా మండలం సోమవారం వద్ద కూలిన స్లాబ్ పోస్తున్న గ్రీన్ ఫీల్డ్ హైవే బ్రిడ్జి…

Ram Narayana