తెలంగాణ వార్తలు

హామీల అమలుకు టైం పడుతుందన్న సీఎం రేవంత్ రెడ్డి …

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హామీల అమలు పై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు దీటుగా సమాధానం ఇచ్చే ప్రయత్నం చేశారు ..కాకపోతే ఆయన ఎన్నికలు అయినా వెంటనే వాగ్దానాలు అమలు చేస్తామని ప్రకటించారు ..దీంతో ప్రతిపక్ష పార్టీలు వాటినే గుర్తు చేస్తున్నాయి.. దీంతో సోమవారం ఆదిలాబాద్ జిల్లా పిప్పిరి లో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ తాము చేసిన ప్రతి వాగ్దానానికి కట్టుబడి ఉన్నామని అంటూ కండరాలు తిరిగిన ఆరు అడుగులున్నోడైనా పెళ్లి చేసిన 3 నెలలకే పిల్లలను పుట్టించగలడా?!! అంటూ తనదైన శైలిలో స్పందించారు ..దేనికైనా ఒక పద్దతి ఉంటది… మేము హామీలు అమలు చేయాలన్నా టైమ్ పడుతుందని కుండబద్దలు కొట్టారు ..

త్వరలోనే ఆదిలాబాద్‌కు విమానాశ్రయం: రేవంత్ రెడ్డి

ఎన్నికలకు ముందు పీపుల్స్ మార్చ్ పేరుతో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చేపట్టిన పాదయాత్ర పిప్రి నుంచే మొదలయిందని… ఇక్కడి ప్రజలు ఇచ్చిన ధైర్యంతోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. పాదయాత్రకు మూడేళ్లు పూర్తయిన సందర్భంగా పిప్రిలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధిపై ఆయన వరాల జల్లు కురిపించారు.

గత ప్రభుత్వంలో ప్రతిపక్షాలను నిర్బంధించే సంస్కృతి ఉండేదని, కానీ తమ ‘ప్రజాపాలన’లో ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు కూడా వేదికలపై మాట్లాడే అవకాశం కల్పిస్తున్నామని సీఎం తెలిపారు. పార్టీలకు అతీతంగా, తమ ఎమ్మెల్యేలు లేని నియోజకవర్గాల్లో కూడా నిధులు కేటాయిస్తూ అభివృద్ధి చేస్తున్నామని స్పష్టం చేశారు. 

త్వరలోనే ఆదిలాబాద్‌కు విమానాశ్రయం రాబోతోందని, వీలైతే జూన్ 2వ తేదీన దీనికి శిలాఫలకం వేస్తామని ప్రకటించారు. వేలాది ఎకరాల్లో దేశంలోనే అతిపెద్ద పారిశ్రామికవాడను ఇక్కడ ఏర్పాటు చేయబోతున్నామని, దీని ద్వారా స్థానిక యువతకు భారీగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని చెప్పారు.


తమ్మిడిహెట్టి నుంచి ప్రాణహిత ప్రాజెక్టును తిరిగి ప్రారంభిస్తామని, ఇందుకు సంబంధించి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో సర్వేలు జరుగుతున్నాయని తెలిపారు. జిల్లాలో త్వరలోనే యూనివర్సిటీని నిర్మిస్తామని, అలాగే బాసర క్షేత్రాన్ని దేశంలోనే గొప్పగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు.

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కోసం ఇప్పటివరకు రూ. 10 వేల కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్లు పథకం వేగంగా కొనసాగుతోందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం 2027 మార్చి వరకు జిల్లాల సరిహద్దు మార్పులకు అవకాశం లేదని, ఆ తర్వాత జ్యుడీషియల్ కమిషన్ వేసి బోథ్ రెవెన్యూ డివిజన్ వంటి డిమాండ్లను పరిష్కరిస్తామని చెప్పారు.

బాసర సరస్వతి ఆలయంలో సీఎం రేవంత్ రెడ్డి మనవడికి అక్షరాభ్యాసం!
దక్షిణ భారతదేశంలోనే ఉన్న ఏకైక సరస్వతి అమ్మ వారి పుణ్యక్షేత్రం బాసర ఆలయ అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సోమవారం శ్రీకారం చుట్టారు. ఈ మేరకు రూ”225 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు ఆయన శంకు స్థాపన చేశారు. ప్రస్తుతం 20,వేల చదరపు అడు గుల విస్తీర్ణంలో ఉన్న బా సర ఆలయాన్ని సుమారు 60 వేల చదరపు అడుగు ల మేర విస్తరించనున్నా రు.

కొత్త ఆలయ శిఖరాలు మండపాలు మాఢ వీధులు ఇతర అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేశారు. పార తో మట్టి తవ్వి సీఎం చేతుల మీదుగా పనులు ప్రారంభించారు. వచ్చే ఏడాది పుష్కరాల నాటికి అభివృద్ధి పనులు పూర్తి కావాలని ఈ సందర్భంగా ఆయన అధికారులను ఆదేశించారు.

ఈ నేపథ్యంలోనే ఆయన కుటుంబంతో కలిసి బాసర లోని శ్రీజ్ఞాన సరస్వతీ దేవి అమ్మవారిని దర్శించుకు న్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు, అర్చకులు సీఎంకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సీఎం దంప తులు తమ మనవడు రియాన్ష్​కు అక్షరాభ్యాసం చేయించారు.

అధికారం అంటే గొప్ప బాధ్యత: మల్లు భట్టి

Mallu Bhatti Power is a Responsibility Not Status

తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆదిలాబాద్ జిల్లా పిప్రి బహిరంగ సభలో మాట్లాడుతూ, ‘పీపుల్స్ మార్చ్’ పాదయాత్ర ద్వారా ప్రజల కష్టాలను స్వయంగా తెలుసుకున్నామని, తమకు అధికారం అంటే హోదా కాదు, బాధ్యత అని ఆయన అన్నారు. కేవలం 9 రోజుల్లోనే రూ. 9 వేల కోట్లను రైతు భరోసా కింద రైతుల ఖాతాల్లో జమ చేశామని వివరించారు.

ప్రతి కుటుంబానికి వర్తించేలా రూ. 5 లక్షల ఇందిరమ్మ బీమా పథకాన్ని తీసుకువచ్చామని, ఇళ్లు లేని పేదలకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు వేగంగా సాగుతోందని చెప్పారు. సామాజిక అంతరాలు లేని సమాజం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ‘యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్’ నిర్మిస్తున్నామని తెలిపారు. ఆదాయాన్ని సృష్టించి, ఆ సంపదను ప్రజలకే పంచడం తమ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. నాడు పాదయాత్రలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన ప్రతి హామీని నూటికి నూరు శాతం అమలు చేస్తామని భట్టి విక్రమార్క ఈ సందర్భంగా ప్రజలకు భరోసా ఇచ్చారు.

Related posts

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భద్రత విషయంలో కీలక మార్పులు

Ram Narayana

గోదావరి-బనకచర్ల వివాదం : అన్ని పార్టీల ఎంపీలతో రేపు సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ

Ram Narayana

సింగరేణి ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టులో ప్రమాదం.. ఇద్దరు కార్మికుల సజీవ దహనం

Ram Narayana