తెలంగాణ వార్తలు

అక్రిడిటేషన్లపైఆందోళనవద్దు… అర్హులైన జర్నలిస్టులందరికిఅక్రిడిటేషన్లు

అక్రిడిటేషన్లపై ఆందోళన వద్దు … అర్హులైన జర్నలిస్టులందరికి అక్రిడిటేషన్లు

అక్రిడిటేషన్ దరఖాస్తుల ప్రక్రియ నిరంతరం

సమాచార పౌరసంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్ సిహెచ్. ప్రియాంక

జర్నలిస్టుల అక్రిడిటేషన్ దరఖాస్తుల ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని సమాచార పౌరసంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్ సిహెచ్. ప్రియాంక ఒక ప్రకటనలో తెలిపారు.

దరఖాస్తుల ప్రక్రియపై ఇటీవల మీడియాలో వస్తున్న వార్తలపై జర్నలిస్టులు ఎటువంటి ఆందోళన చెందవద్దని అర్హులైన జర్నలిస్టులందరికీ కార్డులు ఇస్తామని కమిషనర్ పేర్కొన్నారు.

రాష్ట్ర స్థాయిలో ఇప్పటి వరకు వచ్చిన దరఖాస్తులను ఈ నెల 10వ తేదీన జరిగే రాష్ట్ర స్థాయి అక్రిడిటేషన్ కమిటీ సమావేశంలో స్ర్కూట్నీ చేసి అర్హులైన జర్నలిస్టులకు కొత్త అక్రిడిటేషన్ కార్డులను మంజూరి చేస్తూ నూతన కార్డులు జారీ చేయడం జరుగుతుందని, అర్హులైన జర్నలిస్టు ఆన్లైన్ లో తమ దరఖాస్తులను అప్లోడ్ చేసుకోవాలని, ఏప్రిల్ మాసంలో అక్రడేషన్ జారీ ప్రక్రియ పూర్తి చేయడం జరుగుతుందని, కమిషనర్ సిహెచ్. ప్రియాంక తెలిపారు.

అదేవిధం జిల్లా స్థాయిలో కూడా ఈనెలలోనే జిల్లా కమిటీలు సమావేశాలు ఏర్పాటు చేసి అర్హులైన జర్నలిస్టులకు అక్రెడిటేషన్ లు జారీ చేయడం జరుగుతుందని, జిల్లాలో జిల్లా స్థాయి దరఖాస్తు చేసుకొనే అర్హులైన జర్నలిస్టులు వెంటనే తమ దరఖాస్తులను ఆన్లైన్లో చేసుకోవాలని ఆమె కోరారు.

Related posts

ఫీజు బకాయిలపై చేతులెత్తేసిన ప్రభుత్వం.. కాలేజీల బంద్‌కు రంగం సిద్ధం?

Ram Narayana

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామం… సంతోష్ రావుకు సిట్ నోటీసులు

Ram Narayana

పదో తరగతి విద్యార్థినిని రహస్యంగా పెళ్లాడిన ఉపాధ్యాయుడు…

Ram Narayana