తెలంగాణ రాష్ట్ర సాధనకోసం ఏర్పడిన టీఆర్ యస్ ఉద్యమ పార్టీనా ….లేక కుటుంబ పార్టీనా ? అనే సందేహాలు నెలకొన్నాయి. కేసీఆర్ తప్పుకొని తన కుమారుడు కేటీఆర్ ను ముఖ్యమంత్రి చేస్తారనే ప్రచారం ఉపందుకోవటంతో ఈ చర్చకు తెరలేచింది. కొందరు టీఆర్ యస్ నేతలు మంత్రులు , ఎమ్మెల్యేలు , ఇతర నాయకులూ కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతాడని పదేపదే అంటున్నారు. దీంతో పార్టీ ఏర్పాటు దాని వెనక ఉన్న కష్టం , పడ్డ బాధలను ఉద్యమ శ్రేణులు గుర్తు తెచ్చుకుంటున్నాయి .అసలు టీఆర్ యస్ అనేది కేసీఆర్ సొంత పార్టీనా ? కుటుంబ పార్టీనా అనేది ఇప్పుడు అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న ? ముఖ్యమంత్రి ని మార్చడంలో ఎవరికీ అభ్యతరం లేదు. అసలు తెలంగాణ ఉద్యమకాలంలో 2014 ఎన్నికల సమయంలో కేసీఆర్ రాష్ట్రమంతా తిరిగారు. టీఆర్ యస్ అధికారంలోకి వస్తే దళితున్ని ముఖ్యమంత్రిని చేస్తామన్నారు. అన్న మాట నెరవేర్చకపోతే మెడకోసుకుంటానేకాని అన్నమాటను వెనక్కు తీసుకోనున్నారు. రాష్ట్రం ఏర్పాటు అయింది . తెలంగాణాలో టీఆర్ యస్ కు మైజార్టీ వచ్చింది. దళిత ముఖ్యమంత్రి మాట నెరవేరలేదు . కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు. ఆరుసంవత్సరాలు పరిపాలన సాగించారు. ఆయన తప్పుకోవాలని అనుకున్నారో లేదో తెలియదు కానీ కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతారనే ప్రచారం ఊపందుకున్నది . దీనిపై కేసీఆర్ గానీ ,ఆయన కార్యాలయంగాని స్పందించకపోవటంతో కేటీఆర్ ముఖ్యమంత్రి ప్రచారం కొనసాగుతూనే ఉంది. కేటీఆర్ కు ముఖ్యమంత్రి పదవి అవ్వాల్సిన లక్షణాలన్నీ ఉన్నాయి. ఆయనే కాకుండా కేసీఆర్ మంత్రు వర్గంలో చాలామందికి ముఖ్యమంత్రి అయ్యే అర్హతలు ఉన్నాయి. అయినప్పటికీ కేటీఆర్ ను మాత్రమే సీఎం చేయాలనే ప్రచారం ఆగటం లేదు . కేవలం కేసీఆర్ కుమారుడు అయినందునే ఆయన్ను సీఎం చేయాలనీ అంటున్నారని ప్రతిపక్షాలు అంటున్నాయి. కేసీఆర్ మంత్రి వర్గంలో బీసీ కులానికి చెందిన ఉద్యమకారుడు , మొదటి నుంచి కేసీఆర్ తో నడిచిన ఈటల రాజేందర్ ను ముఖ్యమంత్రిని చేయాలనే అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి. కాంగ్రెస్ నేత జీవం రెడ్డి , బీజేపీ అధ్యక్షడు బండి సంజయ్ , ఎంపీ అరవింద్ , కొడుకునే ఎందుకు చేయాలి ఈటల ను చెయ్యచ్చు గా అంటున్నారు. ఈటల ఉమ్మడి రాష్ట్రంలో సైతం వైయస్ రాజశేఖర్ రెడ్డి మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశారు. కేటీఆర్ తరువాత ఉద్యమంలోకి వచ్చారు. తన మేనల్లుడైన హరీష్ రావు కూడా మొదటినుంచి ఉద్యమంలో ఉన్నారు. కానీ ఆయన్ను సీఎం గా చేయటం ఇష్టం లేదనే అభిప్రాయాలూ ఉన్నాయి. అందుకే రెండవసారి అధికారంలోకి వచ్చిన కేసీఆర్ వెంటనే మంత్రివర్గంలోకి హరీష్ రావు ను తీసుకోలేదు. హరీష్ రావు ను తీసుకోవటం లేదు కాబట్టి తన తనయుడు కేటీఆర్ కూడా తీసుకోలేదు . రెండవసారి మంత్రివర్గ విస్తరణలో కేటీఆర్ తో పాటు హరీష్ రావు కు మంత్రివర్గంలోకి తీసుకోకతప్పింది కాదు . అంతకు ముందే కేటీఆర్ ను పార్టీ వర్కింగ్ గా ప్రెసిండెంట్ గా నియమించారు. రాష్ట్ర పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖ,పట్టణాభివృద్ధి ,ఐ టి శాఖల మంత్రి గా కేటీఆర్ కు ముఖ్యమైన పోర్టు ఫోలియో ఇచ్చారు. పార్టీ వ్యవహారాలతోపాటు , మంత్రి వర్గంలో ప్రభుత్వంలో ను కీలకంగా మారిన కేటీఆర్ ను ముఖ్యమంత్రి చేయాలనే డిమాండ్ పెరిగి పోయింది . రేపో మాపో ఆయన్ను ముఖ్యమంత్రిని చేస్తారని వార్తలు వస్తున్నాయి. దీంతో కేటీఆర్ ముఖ్యమంత్రి విషయం పై పార్టీలోనే గాక బయట కూడా ఆశక్తి కర చర్చ జరుగుతుంది. 2001 లో తెలంగాణ రాష్ట్ర కోసం కేసీఆర్ నాయకత్వంలో పార్టీని ఏర్పాటు చేశారు. ప్రొఫెసర్ జయశంకర్ లాంటి వారి సలహా మేరకు కేసీఆర్ ఉద్యమాన్ని ముందుకు నడిపారు. రాష్ట్ర ఏర్పాటులో అనేక మంది త్యాగాలు ఉన్నాయి. సుమారు 1200 వందలమంది ప్రాణాలను పోగొట్టుకున్నారు. సబ్బండ వర్గాలు ఉద్యమంలో పాల్గొన్నాయి. ఎందరో కృషి ఫలితంగా వచ్చిన తెలంగాణ రాష్ట్రం లో ఒక కుటుంభం పాలనా సాగించటంపై ఇప్పటికే విమర్శలు ఉన్నాయి. అవి పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు జరిగే టీఆర్ యస్ విస్తృత సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపై ఆశక్తి నెలకొన్నది . కేసీఆర్ దీని పై ఎలాంటి ప్రకటన చేస్తారు. అసలు చేస్తారా ?లేదా? బీజేపీ పై , వ్యవసాయ చట్టాలపై, ఎన్నికలలో ఎదురు దెబ్బలపై టీఆర్ యస్ ఏమి చర్చించ బోతుంది. సాగర్, పట్టభద్రుల ఎన్నికలు, ఖమ్మం , వరంగల్ కార్పొరేషన్ ఎన్నికలపై కేసీఆర్ ఎలాంటి దేశానిర్దేహం చేయనున్నారనే ఉత్కంఠత నెలకొన్నది .
previous post
next post