తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా క్రిస్మస్ వేడుకలు.. కుటుంబ సభ్యులతో కలిసి చర్చిలో ఏపీ సీఎం జగన్ ప్రార్థనలు
- క్రైస్తవులతో నిండిపోతోన్న చర్చిలు
- ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటోన్న ప్రజలు
- పులివెందులలోని సీఎస్ఐ చర్చికి జగన్ కుటుంబం
- విద్యుత్ కాంతులీనుతోన్న మెదక్ చర్చి
తెలుగు రాష్ట్రాల్లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. చర్చిల్లో ఉదయం నుంచే ప్రత్యేక ప్రార్థనలు ప్రారంభమయ్యాయి. క్రిస్మస్ పర్వదినం సందర్భంగా ప్రజలకు ఏపీ సీఎం జగన్ శుభాకాంక్షలు తెలిపారు. కడప జిల్లా పులివెందులలో సీఎస్ఐ చర్చికి ఆయన కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లి క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ ప్రార్థనల్లో జగన్తో పాటు ఆయన తల్లి విజయమ్మ, భార్య భారతి కూడా పాల్గొన్నారు. ప్రజలందరికీ మంచి జరగాలని దేవుడిని కోరుకున్నట్లు జగన్ ఈ సందర్భంగా చెప్పారు.
కాగా, తెలంగాణలోనూ క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. మానవత్వాన్ని చాటే ఏసుక్రీస్తు బోధనలను గుర్తు చేసుకుంటూ ప్రజలు ఈ వేడుకల్లో పాల్గొంటున్నారు. క్రిస్మస్ సందర్భంగా తెలంగాణలోని మూడు లక్షల మందికి ప్రభుత్వం కానుకలు అందించినట్లు మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ చెప్పారు.