Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

వైసీపీలో పెరుగుతున్న అసమ్మతి!

వైసీపీలో పెరుగుతున్న అసమ్మతి!
-నిన్న నగరి ఎమ్మెల్యే రోజా ,నేడు పాయకరావు పేట ఎమ్మెల్యే బాబురావు
-సొంత పార్టీ వారినుంచి వ్యతిరేకత
-బాబూరావుకు వ్యతిరేకంగా జాతీయ రహదారిపై నిరసన, మానవహారం
-ఎమ్మెల్యే వసూలు రాజాలా మారారు
-ఆయన వల్లే పంచాయతీ ఎన్నికల్లో ఓటమి
-ఔట్ సోర్సింగ్ పోస్టుల భర్తీకి లక్షల్లో వసూలు
-68 బియ్యం పంపిణీ వాహనాల నుంచి రూ. 50 వేల చొప్పున వసూలు
-తీవ్ర ఆరోపణలు చేసిన ఎంపీపీ బొలిశెట్టి శారద

వైసీపీలో అసమ్మతి స్వరాలూ పెరుగుతున్నాయి…ఇప్పటికే కొందరు సీనియర్ ఎమ్మెల్యేలు పార్టీ పట్ల గుర్రుగా ఉన్నారు .ప్రధానంగా సీనియర్లుగా ఉన్న ధర్మాన ప్రసాదరావు , ఆనం రాంనారాణయణరెడ్డి అప్పుడప్పుడు వారి అసమ్మతిని వెళ్లదీస్తున్నారని అభిప్రాయాలూ ఉన్నాయి. ఇక నగరి ఎమ్మెల్యే రోజాది మరో పంచాయతీ , ఆమెకు సొంత నియోజకవర్గంలో పార్టీలో వైరి వర్గం ఇబ్బందులు పెడుతుంది. దీనిపై ఆమె అనేక సార్లు సీఎం జగన్ దృష్టికి తెచ్చారు. పెద్దిరెడ్డి పేరు చెప్పుకొని వారి తనకు వ్యతిరేకంగా పని చేస్తున్నారని ఆమె ఆరోపణ . ఇటీవల ఆమె వారిపై చిత్తూరు ఎస్పీ కూడా ఫిర్యాదు చేశారు. ఇక పెద్దారెడ్డి నేరుగా జగన్ పాలనపైనే విమర్శలు చేశారని వార్తలు వచ్చాయి. అయితే ఆతరవాత ఆయన వాటిని ఖండించారనుకోండి . ఇప్పుడు విశాఖ కు చెందిని పాయకరావు పేట ఎమ్మెల్యే బాబూరావుపై సొంతపార్టీ వారే నిరసన తెలపడం ,మానవహారాలు తో రాజకీయాలు వేడెక్కాయి. దీంతో వైసీపీ లోని అంతర్గత విభేదాలు పార్టీని ఇబ్బందులు పెట్టె అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి.

విశాఖపట్టణం జిల్లా పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు వసూల్ రాజాలా మారారని ఆరోపిస్తూ ఆయన వ్యతిరేక వర్గం నేతలు ఎంపీపీ బొలిశెట్టి శారదా కుమారి దంపతులు, మద్దతుదారులు పెదగుమ్ములూరు నుంచి వెయ్యిమందితో నిన్న నిరసన ర్యాలీ చేపట్టారు. వీరు జాతీయ రహదారిపైకి రాకుండా పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

ఈ క్రమంలో కొందరు రోడ్డుపై బైఠాయించడంతో ట్రాఫిక్ పెద్ద ఎత్తున నిలిచిపోయింది. పోలీసు ఉన్నతాధికారులు వచ్చి సర్దిచెప్పడంతో అక్కడి నుంచి పాత జాతీయ రహదారి కూడలి వద్దకు చేరుకుని మానవహారంగా ఏర్పడ్డారు. ఈ సందర్భంగా జగన్ ముద్దు.. ఎమ్మెల్యే వద్దు అని నినాదాలు చేశారు.

అంతకుముందు శారద, ఆమె భర్త గోవిందరావు రాయవరం మండలం అడ్డురోడ్డులో విలేకరులతో మాట్లాడుతూ.. ఎమ్మెల్యేపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఎమ్మెల్యే బాబూరావు ప్రజల కష్టసుఖాలను గాలికొదిలేశారని, కార్యకర్తలను పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంటింటికీ బియ్యం పంపిణీ చేసే 68 వాహనాల నుంచి రూ. 50 వేల చొప్పున వసూలు చేశారని అన్నారు.

సచివాలయాల నుంచి రైతు భరోసా కేంద్రాల వరకు ఏ ఒక్కదానినీ వదిలిపెట్టకుండా అన్నింటి నుంచి వసూళ్లు చేసిన ఘనత ఒక్క ఎమ్మెల్యేకే దక్కుతుందన్నారు. లింగరాజుపాలెం రెసిడెన్షియల్ పాఠశాలలో రెండు ఔట్ సోర్సింగ్ పోస్టుల భర్తీకి రూ. 2 లక్షల చొప్పున వసూలు చేశారని ఆరోపించారు. తిరుమల వెంకన్న దర్శనానికి ఇచ్చే లేఖలకు కూడా విలువ కట్టి విక్రయించారని మండిపడ్డారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి ఓటమికి కూడా ఆయనే కారణమని తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

Related posts

భారతీయ జనతా పార్టీని ముక్కలు ముక్కలు చేసే వ్యక్తిని : కన్నయ్య కుమార్!

Drukpadam

పంజాబ్ ప్రజలు విప్లవం సృష్టించారు: కేజ్రీవాల్

Drukpadam

వైసీపీ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తుంది పేర్ని నాని సంచల వ్యాఖ్యలు!

Drukpadam

Leave a Comment