Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

మోదీ హత్యకు కాంగ్రెస్ కుట్ర.. పంజాబ్ సీఎంను అరెస్ట్ చేయండి: అసోం సీఎం డిమాండ్!

మోదీ హత్యకు కాంగ్రెస్ కుట్ర.. పంజాబ్ సీఎంను అరెస్ట్ చేయండి: అసోం సీఎం డిమాండ్!
-కాంగ్రెస్ కుట్రలో పంజాబ్ సీఎం భాగం
-మోదీ హత్యకు కుట్ర జరుగుతోందని ఈ నెల 2నే పంజాబ్ పోలీసులకు సమాచారం
-ఓ టీవీ చానల్ స్టింగ్ ఆపరేషన్‌లో కాంగ్రెస్ కుట్ర బహిర్గతం
-కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలు కూడా దీనిని బలపరుస్తున్నాయి

కాంగ్రెస్‌ పార్టీపై అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ పంజాబ్ పర్యటన సందర్భంగా చోటుచేసుకున్న భద్రతా వైఫల్యంపై ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మోదీని హత్య చేసేందుకు కాంగ్రెస్ కుట్ర పన్నిందని ఆరోపించారు. పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్‌జీత్ సింగ్‌ను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కేసులో ఇప్పటి వరకు లభించిన ఆధారాలు కాంగ్రెస్ కుట్రను బహిర్గతం చేస్తున్నాయని, అందులో భాగమైన పంజాబ్ సీఎంను అరెస్ట్ చేయాలని అన్నారు.

ప్రధాని హత్యకు కుట్ర జరగబోతోందని జనవరి 2వ తేదీనే పంజాబ్ పోలీసులకు నిఘా వర్గాల నుంచి సమాచారం అందిందని, అయినప్పటికీ వారు ఎలాంటి చర్యలు తీసుకోలేదని అన్నారు. ఓ టీవీ చానల్ స్టింగ్ ఆపరేషన్‌లో కాంగ్రెస్ కుట్ర బయటపడిందని, అలాగే, ఈ ఘటన అనంతరం కాంగ్రెస్ నేతలు చేసిన వ్యాఖ్యలు కూడా కుట్ర కోణాన్ని బహిర్గతం చేస్తున్నాయని అసోం సీఎం అన్నారు.

Related posts

మోదీ సత్తా ఏపాటిదో చైనాకు తెలిసిపోయిందా?: ఒవైసీ

Drukpadam

ఆయన రాష్ట్రంలో కొత్త జిల్లా ఏర్పాటు చేసుకుంటే ఈయనకు ఎందుకు మంట!

Drukpadam

ఓడిన పట్టభద్రులు … గెలిచిన టీఆర్ యస్

Drukpadam

Leave a Comment