Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

రెండు మూడు రోజుల్లో ఉద్యోగులకు పీఆర్ సి…అసెంబ్లీలో కేసీఆర్

రెండు మూడు రోజుల్లో ఉద్యోగులకు పీఆర్ సి…అసెంబ్లీలో కేసీఆర్
-కరోనా వల్లనే ఆదాయం తగ్గింది
-ఆదాయం ఉంటె మంచిగానే పీఆర్ సి
-ఇప్పటికి దేశంలో ఎక్కువ వేతనాలు ఇస్తుంది మనమే
ఉద్యోగులకు ఇవ్వాల్సిన పీఆర్ సిని రెండు ,మూడు రోజుల్లో ప్రకటిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపి తీర్మానం పై జరిగిన చర్చకు సీఎం కేసీఆర్ సమాధానం ఇస్తూ ,ప్రతిపక్షాలు లేవనెత్తిన ఉద్యోగుల పీఆర్ సి పై స్పందించారు. ఉద్యోగులకు దేశంలో ఎక్కడ లేని విధంగా వేతనాలు ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ నే అని అన్నారు. కరోనా వల్ల రాష్ట్ర ఆదాయం గణనీయంగా కోల్పోయాం . 50 వేల కోట్ల ఆదాయం తగ్గిపోయిందని , మరో 50 వేల కోట్లు వెరసి లక్ష కోట్ల ఆదాయం కోల్పోయామని అన్నారు. ఇది మన ఒక్కరికే కాదు ప్రపంచం అంతా జరిగిందన్నారు .ప్రతిపక్షాలకే ఉద్యోగుల మీద ప్రేమ ఉన్నట్లు మాట్లాడుతున్నారని అన్నారు. అయినప్పటికీ మంచి పీఆర్ సి ఇవ్వబోతున్నాం రెండుమూడు రోజుల్లో మీరే చూస్తారని తెలిపారు. గతంలో అనేక సార్లు వాయిదా పడుతూవస్తున్న పీఆర్ సి పై ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి ఉంది . దీనిపై ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ ఉద్యోగ సంఘాల నాయకులను పిలిచి పీఆర్ సి పై వారితో చర్చించారు. అప్పుడే ఎంత పీఆర్ సి ఇచ్చేది నిర్ణయించారు.ఉద్యోగ సంఘనాయకులు ముఖ్యమంత్రి తో జరిపిన చర్చల వివరాలను వెల్లడించారు. వాటిపై రకరకాల అనుమానాలు వ్యక్తం అయ్యాయి. కేవలం ఎన్నికల కోసమే సీఎం ఉద్యోగాల సంఘాలను మచ్చిక చేసుకొని వారి ద్వారా ఉద్యోగుల ఓట్లు పొందేందుకే అనే విమర్శలను ప్రతిపక్షాలు చేశాయి .కేసీఆర్ అసెంబ్లీ లో చేసిన ప్రకటనతో ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Related posts

సుదీర్ఘ బడ్జెట్ ప్రసంగం రికార్డ్ ఎవరి పేరు మీద ఉంది?

Drukpadam

మార్కెట్ లో మా వ్యాక్సిన్ కొవిషీల్డ్‌ ధరే అత్యంత తక్కువ : సీరం ఇన్‌స్టిట్యూట్‌

Drukpadam

ఖమ్మం జైలుకు రాఘవ…రహస్యంగా తరలింపు

Drukpadam

Leave a Comment