Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

‘ఛలో విజయవాడ’ దద్దరిల్లింది …నిర్బంధాలను సైతం లెక్క చేయని ఉద్యోగులు!

  • ‘ఛలో విజయవాడ’ దద్దరిల్లింది …నిర్బంధాలను సైతం లెక్క చేయని ఉద్యోగులు!
    -విజయవంతం చేసిన ఉద్యోగులందరికీ కృతజ్ఞతలు: ఉద్యోగ సంఘం నేత సూర్యనారాయణ
    -డిమాండ్ల సాధన కోసం ఉద్యోగుల ఛలో విజయవాడ
    -లక్ష మంది వచ్చారన్న సూర్యనారాయణ
    -మరో 3 లక్షల మందిని పోలీసులు అడ్డుకున్నారని వెల్లడి
  • ఉద్యోగుల సమస్యల పరిస్కారం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు ఇచ్చిన ఛలో విజయవాడ దద్దరిల్లింది. ఉద్యోగసంఘాల ఇచ్చిన పిలుపు మేరకు ప్రభుత్వ నిర్బంధాన్ని అరెస్టులను ,గృహనిర్బంధాలను సైతం లెక్క చేయకుండా వివిధ జిల్లాలనుంచి ఉద్యోగులు ఉపాద్యాలు విజయవాడ చేరుకోవడం ప్రభుత్వాన్ని సైతం ఆశ్చర్యానికి గురిచేసింది. పోలిసుల ఆటంకాలను , ఆంక్షాలను ఎదిరించి రకరకాల మార్గాలద్వారా ఉద్యోగులు ఉపాద్యాలు విజయవాడ చేరుకున్నారు. కొందరు మరు వేషాలలో కూడా రావడం విశేషం . విజయవాడ విధులన్నీ ఉద్యోగ ,ఉపాద్యాలతో నిండిపోయాయి. మహిళా ఉద్యోగులు కూడా పెద్ద సంఖ్యలో ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు.

పీఆర్సీ జీవోలను ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలన్న డిమాండ్ తో చేపట్టిన ‘ఛలో విజయవాడ’ కార్యక్రమానికి ఉద్యోగులు తరలిరావడం తెలిసిందే. ఈ క్రమంలో పీఆర్సీ సాధన సమితి ప్రతినిధి, ఉద్యోగ సంఘం నేత సూర్యనారాయణ మాట్లాడుతూ, ఛలో విజయవాడ కార్యక్రమం విజయవంతం చేసిన ఉద్యోగులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. తీవ్ర నిర్బంధాల మధ్య కూడా లక్ష మంది విజయవాడ వచ్చారని వెల్లడించారు. మరో 3 లక్షల మందిని ప్రభుత్వం అడ్డుకుందని ఆరోపించారు.

మరో నేత బండి శ్రీనివాసరావు స్పందిస్తూ, ప్రభుత్వాధినేతగా ముఖ్యమంత్రి జగన్ ఉద్యోగులను చర్చలకు పిలవాలని అన్నారు. ఉద్యోగుల సమస్యలపై సీఎం జగన్ నేరుగా చర్చించి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. తాము శాంతియుతంగానే నిరసనలు తెలియజేస్తున్నామని, సీఎం జోక్యం చేసుకుని చర్చలతో సమస్యలు పరిష్కరించాలని బండి శ్రీనివాసరావు కోరారు.

సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ, ఛలో విజయవాడ కార్యక్రమం చూశాక అయినా ఉద్యోగుల ఆందోళనలను ప్రభుత్వం గుర్తించాలని అన్నారు. ప్రభుత్వం దిగొచ్చేంత వరకు ఉద్యమం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. సీపీఎస్ రద్దయ్యేవరకు ఆందోళనలు కొనసాగుతాయని తెలిపారు.

ఏపీ ఉద్యోగుల జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, తాము ఛలో విజయవాడ కార్యక్రమం నిర్వహించింది బల ప్రదర్శన కోసం కాదని స్పష్టం చేశారు. ఉద్యోగుల వేదనను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడమే తమ ఉద్దేశమని పేర్కొన్నారు. ఈ నెల 5 నుంచి పెన్ డౌన్ ఉంటుందని, 6వ తేదీ అర్ధరాత్రి నుంచి పూర్తిగా సమ్మెలోకి వెళతామని బొప్పరాజు వెల్లడించారు.

Related posts

లండన్ లో తెలుగు విద్యార్థిని దారుణ హత్య.. కత్తితో పొడిచిన బ్రెజిల్ యువకుడు

Drukpadam

కోడిపుంజు దశదినకర్మకు 500 మందికి భోజనాలు పెట్టారు!

Drukpadam

సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఏపీ హైకోర్టు సీజే పీకే మిశ్రా…

Drukpadam

Leave a Comment