Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

రాహుల్ గాంధీ ఎన్నికలప్పుడే హిందువుగా మారతారు: బీజేపీ నేత తేజీందర్ పాల్ సింగ్!

రాహుల్ గాంధీ ఎన్నికలప్పుడే హిందువుగా మారతారు: బీజేపీ నేత తేజీందర్ పాల్ సింగ్!

  • దేశంలో ఐదు రాష్ట్రాల ఎన్నికల వేడి
  • ఉత్తరాఖండ్ లో ప్రచారానికి వెళ్లిన రాహుల్ గాంధీ
  • గంగానదికి పూజలు
  • ఎద్దేవా చేసిన తేజీందర్ పాల్ సింగ్ బగ్గా

ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో రాజకీయాలు మరింత వాడీవేడిగా మారాయి. రాజకీయ పార్టీల నేతలు పరస్పరం విమర్శనాస్త్రాలు సంధించుకుంటున్నారు. కాగా, ఉత్తరాఖండ్ లో పర్యటించిన కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఇక్కడి హర్ కీ పౌరీ ఘాట్ వద్ద గంగానదికి పూజలు చేశారు. ఉత్తరాఖండ్ సంక్షేమం కోసం గంగామాతను ప్రార్థించానని రాహుల్ తెలిపారు.

అయితే, బీజేపీ నేత తేజీందర్ పాల్ సింగ్ బగ్గా దీనిపై విమర్శలు చేశారు. రాహుల్ గాంధీ సరిగ్గా ఎన్నికలప్పుడే హిందువులా మారతారని వ్యంగ్యం ప్రదర్శించారు. రాహుల్ ఓ ఎన్నికల హిందువు అని అభివర్ణించారు. కాబట్టే రాహుల్ హారతి ఇస్తుండగా పూజారి సూచనలు చేయాల్సి వచ్చిందని ఎద్దేవా చేశారు. దీనికి సంబంధించిన వీడియోను కూడా బగ్గా సోషల్ మీడియాలో పంచుకున్నారు.

Related posts

రఘురామ బెయిల్ పై వైసీపీ ఆశక్తికర వ్యాఖ్యలు …

Drukpadam

కేసీఆర్​ రైతుల మధ్య చిచ్చు పెడుతున్నారు: కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫైర్​!

Drukpadam

జ‌మిలి ఎన్నిక‌ల అంశం లా క‌మిష‌న్ ప‌రిశీల‌న‌లో ఉంది: కేంద్ర ప్ర‌భుత్వం!

Drukpadam

Leave a Comment