ఆంధ్రప్రదేశ్

అమెరికాలో కాల్పులు… తెలుగు యువకుడి విషాదాంతం

  • అలబామాలో కాల్పులు
  • విశాఖ వాసి చిట్టూరి సత్యకృష్ణ మృతి
  • ఇటీవలే అమెరికా వెళ్లిన సత్యకృష్ణ
  • సత్యకృష్ణ కుటుంబంలో విషాదం

తుపాకీ సంస్కృతికి ఆలవాలమైన అమెరికాలో మరోసారి కాల్పుల మోత మోగింది. ఏపీకి చెందిన ఓ యువకుడు ఈ కాల్పుల్లో మృతి చెందడం విషాదకరం. ఆ యువకుడిని విశాఖకు చెందిన చిట్టూరి సత్యకృష్ణగా గుర్తించారు. ఇటీవలే పై చదువుల కోసం అమెరికా వెళ్లిన సత్యకృష్ణ ఓల్డ్ బర్మింగ్ హామ్ లో పార్ట్ టైమ్ ఉద్యోగంలో చేరాడు. ఓ స్టోర్ లో పనిచేస్తున్నాడు. అలబామాలో జరిగిన కాల్పుల ఘటనలో 27 ఏళ్ల చిట్టూరి సత్యకృష్ణ మృత్యువాతపడ్డాడు. సత్యకృష్ణ మృతితో విశాఖలోని అతడి కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

Related posts

ట్రాఫిక్ చలానా పేరుతో సైబ‌ర్‌ మోసం.. రూ. 1.36ల‌క్ష‌లు మాయం…

Ram Narayana

అమెరికా చట్ట సభలో కొత్త బిల్లుతో భారతీయులకు మరింత ఊరట!

Drukpadam

టీఆర్ఎస్ పిటిషన్ ను అత్యవసరంగా విచారించేందుకు నిరాకరించిన హైకోర్టు!

Drukpadam