Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ఉక్రెయిన్‌ పై ర‌ష్యా చేస్తోంది భీక‌ర యుద్ధ‌మే..

ర‌ష్యా చేస్తోంది భీక‌ర యుద్ధ‌మే.. ఉక్రెయిన్‌లో దెబ్బ‌తిన్న అపార్ట్‌మెంట్లు..

  • ర‌ష్యా-ఉక్రెయిన్ మ‌ధ్య యుద్ధం
  • కీల‌క ప్రాంతాల్లోకి చొచ్చుకెళ్లిన ర‌ష్యా
  • ముంద‌స్తు ప్ర‌ణాళిక ప్రకారం దాడులు
russia attacks in ukrain

ర‌ష్యా-ఉక్రెయిన్ మ‌ధ్య యుద్ధం జ‌రుగుతోన్న విష‌యం తెలిసిందే. ఉక్రెయిన్లోని కీల‌క ప్రాంతాల్లోకి చొచ్చుకెళ్లిన ర‌ష్యా బ‌ల‌గాలు ముంద‌స్తు ప్ర‌ణాళిక ప్రకారం దాడులు జ‌రుపుతున్నాయి. ఉక్రెయిన్ సైనిక స్థావ‌రాల‌పై ప్ర‌ధానంగా దాడులు జ‌రుగుతున్నాయి.

జ‌నావాస ప్రాంతాల్లో దాడులు చేయ‌ట్లేద‌ని ర‌ష్యా ప్ర‌క‌ట‌న‌లు చేస్తున్నప్ప‌టికీ ప‌లు అపార్ట్‌మెంట్లపై బాంబులు ప‌డుతుండ‌‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోల‌ను ప‌లు స్థానిక‌, అంత‌ర్జాతీయ మీడియా సంస్థ‌లు బ‌య‌ట‌పెట్టాయి. ర‌ష్యా భీక‌ర యుద్ధ‌మే చేస్తున్న‌ట్లు స్ప‌ష్ట‌మవుతోంది. ఉక్రెయిన్ సైనిక స్థావ‌రాల‌పై కూడా ర‌ష్యా దాడుల‌కు పాల్ప‌డింది. ప్రాణ‌న‌ష్టంపై వివ‌రాలు స్ప‌ష్టంగా తెలియ‌రావ‌ట్లేదు.

వంద‌లాది మంది మృతి చెందార‌ని మీడియాలో వార్త‌ల వేళ‌.. మ‌ర‌ణాల‌పై ఉక్రెయిన్ అధికారిక‌ ప్ర‌క‌ట‌న‌చేసింది .ఇప్పటివరకు ఏడుగురు చనిపోయారని ,తొమ్మిది మందికి తీవ్ర గాయాలు అయ్యాయని తెలిపింది అమాయ‌క ప్ర‌జ‌లూ మృతి చెందుతున్నారని యుక్రెయిన్ ఆందోళన వ్యక్తం చేసింది.

ర‌ష్యా-ఉక్రెయిన్ మ‌ధ్య యుద్ధం జ‌రుగుతోన్న విష‌యం తెలిసిందే. ఉక్రెయిన్‌లో ఇప్ప‌టికే వంద‌లాది మంది ప్ర‌జ‌లు ప్రాణాలు కోల్పోయిన‌ట్లు ప‌లు మీడియా సంస్థ‌లు చెబుతున్నాయి. ఈ నేప‌థ్యంలో ఉక్రెయిన్ మ‌ర‌ణాల సంఖ్య‌పై అధికారికంగా ఓ ప్ర‌క‌ట‌న చేసింది.

ర‌ష్యా దాడుల్లో ఇప్ప‌టివ‌ర‌కు ఏడుగురు మృతి చెందార‌ని, తొమ్మిది మందికి తీవ్ర‌గాయాల‌య్యాయని తెలిపింది. కాగా, ఉక్రెయిన్లోని కీల‌క ప్రాంతాల్లో సైనిక స్థావ‌రాల‌పై ర‌ష్యా జ‌రుపుతోన్న దాడుల్లో అమాయ‌క ప్ర‌జ‌లూ బ‌ల‌వుతున్నట్లు తెలుస్తోంది. యుద్ధాన్ని ఆపాల‌ని ప‌లు దేశాలు కోరుతున్నాయి. రేపు జీ7 దేశాల స‌మావేశం ఏర్పాటు చేయ‌నున్నారు.

 భారత విద్యార్థుల ఆవేదన

ఉక్రెయిన్ లోని భారత విద్యార్థులను వెనక్కి వచ్చేయాలని కొన్ని రోజులుగా భారత రాయబార కార్యాలయం, విదేశాంగ శాఖ కోరుతున్నా.. పట్టించుకోని విద్యార్థులు ఇప్పుడు లబోదిబోమంటున్నారు. రష్యా యుద్ధానికి దిగకపోవచ్చన్న అంచనాలు, వ్యయ భారాన్ని చూసి వారు అక్కడి నుంచి కదలకపోవడం, ఇప్పుడు యుద్ధం ఆరంభం కావడంతో దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. అటువంటి వారిలో శివ కూడా ఒకడు.

రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉక్రెయిన్ పై యుద్ధాన్ని ప్రకటించినట్టు తెలుసుకున్న శివ, అతడి తోటి భారతీయ విద్యార్థులు 50 మంది వెంటనే బ్యాగ్ సర్దుకుని రైలు ద్వారా రాజధాని కీవ్ కు చేరుకున్నారు. ఎయిర్ ఇండియా విమానం ద్వారా వెనక్కి వచ్చేద్దామని వారి ఆలోచన. కానీ, గగనతలాన్ని ఉక్రెయిన్ మూసివేయడంతో ఎయిర్ ఇండియా విమానం ఖాళీగా వెనుదిరిగింది.

కీవ్ కు చేరుకున్న భారత విద్యార్థుల బృందానికి ఎయిర్ స్పేస్ మూసేసిన విషయం తెలిసింది. తిరిగి యూనివర్సిటీకి వెళ్లిపోదామన్నా ప్రజా రవాణా పూర్తిగా నిలిచిపోయింది. అతడితోపాటు 50 మంది భారత విద్యార్థులు కీవ్ రైల్వే స్టేషన్ లో చిక్కుకుపోయారు.

‘‘ఏం జరుగుతుందో చెప్పలేను. మమ్మల్ని కాపాడేందుకు విమానాన్ని ఏర్పాటు చేయాలి. భారత్ వెళ్లిపోతాం’’ అని శివ చెప్పాడు. కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నామని, కొందరు విద్యార్థులు భారత ఎంబసీని సంప్రదించినట్టు తెలిపాడు. అంతర్జాతీయ విద్యార్థులను యూనివర్సిటీ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రజారవాణా అందుబాటులోకి వస్తే తిరిగి యూనివర్సిటీకి అయినా వెళ్లిపోతామని చెప్పాడు.

 

సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకోండి.. ఉక్రెయిన్ లోని భారతీయులకు రాయబార కార్యాలయం సూచనలు

ఎప్పుడు ఏం జరిగేది తెలియట్లేదు

కీవ్ కు వెళ్లేవాళ్లు, కీవ్ నుంచి వెళుతున్న వారు వెంటనే వెనక్కు వెళ్లిపోండిపాశ్చాత్య దేశాల సరిహద్దు ప్రాంతాలకు వెళ్లాలని సూచన

Indian Embassy Advisory To Indians In Ukraine

ఉక్రెయిన్ లోని యుద్ధ పరిస్థితులపై అక్కడి భారతీయులకు భారత రాయబార కార్యాలయం ముఖ్యమైన సూచనలను చేసింది. ప్రస్తుతం ఉక్రెయిన్ లో పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయని, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి అని పేర్కొంది. ప్రస్తుత పరిస్థితుల్లో అందరూ ప్రశాంతంగా ఉండాలని సూచించింది. భారతీయులంతా ఎక్కడున్నా సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకోవాలని, ఇల్లు, హాస్టల్ లేదా ప్రయాణాల్లో ఉన్నా భద్రంగా ఉండాలని సూచన చేసింది.

కీవ్ కు వెళ్లేవాళ్లు, కీవ్ నుంచి వేరే సిటీలకు వెళుతున్న వారు వెంటనే తమ తమ ఇళ్లకు వెనక్కు వెళ్లిపోవాలని సూచించింది. సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని పేర్కొంది. ఉక్రెయిన్ లోని పాశ్చాత్య దేశాల సరిహద్దుల వెంబడి ప్రాంతాలకు వెళ్లాలని సూచించింది. ఉక్రెయిన్ యుద్ధ పరిస్థితులకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్ డేట్లు ఇస్తుంటామని తెలిపింది.

Related posts

ఏపీలో పరిస్థితులు దిగజారిపోయాయి…చర్యలు తీసుకోండి రాష్ట్రపతి ,ప్రధానికి చంద్రబాబు లేఖ …

Ram Narayana

తమిళనాడులో కొత్త ప్రయోగం.. అందరికి ఆరోగ్యం బిల్లుకు కసరత్తు!

Drukpadam

బహుభార్యత్వం భరించాల్సిందే కానీ.. ప్రోత్సహించాల్సినది కాదు…

Drukpadam

Leave a Comment