రాజకీయ వార్తలు

చినజీయర్  దిష్టి బొమ్మలను తగులబెట్టాలి: టీఆర్ఎస్ ఎమ్మెల్యే పిలుపు!

చినజీయర్  దిష్టి బొమ్మలను తగులబెట్టాలి: టీఆర్ఎస్ ఎమ్మెల్యే పిలుపు!
వ‌న‌దేవ‌త‌లు స‌మ్మ‌క్క‌-సార‌ల‌మ్మ‌ల‌పై చినజీయ‌ర్ స్వామి వ్యాఖ్య‌లు
టీఆర్ఎస్ నుంచి కూడా స్పంద‌నలు
ప్రభుత్వ విప్‌, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు ఫైర్
చినజీయర్ క్షమాపణలు చెప్పాల్సిందేన‌ని డిమాండ్

చిన్నజియ్యర్ స్వామి సమ్మక్క సారలమ్మలపై చేసిన అనుచిత వ్యాఖ్యలు ఇప్పట్లో చెల్లరేలా లేవు . కోట్లాది మంది పూజించే సమ్మక్క సారలమ్మలు దేవతలా ? వాళ్లు కేవలం గ్రామదేవతలు ,పిచ్చిజనం విఫరీతంగా అక్కడకు పోవడం ఏమిటి మొక్కులు చెల్లించుకోవడం ఏమిటి ? చదువుకున్న వాళ్ళ ,వ్యాపారులు అదేపనిగా వెళ్లడమపి ఏమిటి ? పిచికాకపోతే అనే అర్థం వచ్చే రీతిలో చిన్నజియ్యర్ మాట్లాడారు . దానిపై ములుగు ఎమ్మెల్యే సీతక్క నిన్ననే గట్టిగానే కౌంటర్ ఇచ్చారు . ఆదివాసీ సంఘాలు గిరిజన దేవతలను కించపరిచినందున చిన్నజియ్యర్ పై దుమ్ముగూడెం పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టారు . నేడుటీఆర్ యస్ కు చెందిన పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు చిన్నజియ్యర్ పై ఫైర్ అయ్యారు . చిన్నజియ్యర్ దిష్టి బొమ్మలను తగలబెట్టాలని పిలుపు నిచ్చారు. దీంతో అటు అధికార ప్రతిపక్షాలు చిన్నజియ్యర్ చర్యలపై భగ్గు భగ్గు మంటున్నాయి.

వ‌న‌ దేవ‌త‌లు స‌మ్మ‌క్క‌-సార‌ల‌మ్మ‌ల‌పై చినజీయ‌ర్ స్వామి చేసిన వ్యాఖ్య‌ల‌పై వివాదం కొన‌సాగుతోంది. ఈ విష‌యంపై టీఆర్ఎస్ నుంచి కూడా స్పంద‌నలు వ‌స్తున్నాయి. ఆ పార్టీ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు, ప్రభుత్వ విప్‌, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు చినజీయ‌ర్ స్వామిపై మండిప‌డుతూ ఓ పోస్ట్ చేశారు. ఆదివాసీల‌ ఆరాధ్య దైవాలు సమ్మక్క-సారలమ్మలను కించపరుస్తూ మాట్లాడిన చినజీయర్ క్షమాపణలు చెప్పాల్సిందేన‌ని ఆయ‌న‌ డిమాండ్ చేశారు.

ఆదివాసీ వనదేవతలైన సమ్మక్క, సారలమ్మలను కోట్లాది మంది ప్ర‌జ‌లు కొలుస్తున్నారని ఆయ‌న చెప్పారు. చినజీయర్ స్వామిలా మోసాల‌కు పాల్ప‌డ‌డం తమ జాతికి తెలియదని ఆయ‌న తెలిపారు. ఆదివాసీల‌ గుడేలలో చినజీయర్ దిష్టిబొమ్మలను తగులబెట్టాలని ఆయ‌న‌ పిలుపు నిచ్చారు. కాగా, నిన్న కూడా ప‌లు ప్రాంతాల్లో చినజీయర్ దిష్టిబొమ్మలను తగులబెట్టి, హుందాగా మెల‌గాల‌ని ఆయ‌న‌పై ప‌లువురు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

Related posts

ఏ ముఖం పెట్టుకుని హైదరాబాద్ కు వస్తున్నారు?: ప్రధాని మోదీని ప్రశ్నించిన కేటీఆర్!

Drukpadam

పొంగులేటి కాంగ్రెస్ లోకి జూన్ 8 లేదా ..12 న అని ప్రచారం …?

Drukpadam

ఈ నెల 12న పొంగలేటి ప్రకటన.: మల్లు రవి 

Drukpadam