Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

చిక్కుల్లో సుబ్ర‌హ్మ‌ణ్య‌స్వామి.. బీజేపీ ఎంపీపై ప‌రువు న‌ష్టం దావా!

చిక్కుల్లో సుబ్ర‌హ్మ‌ణ్య‌స్వామి.. బీజేపీ ఎంపీపై ప‌రువు న‌ష్టం దావా!
తేజీంద‌ర్‌ బ‌గ్గాపై కేసులున్నాయ‌ని ట్వీటిన స్వామి
కోర్టును ఆశ్ర‌యించిన‌ తేజీంద‌ర్ బ‌గ్గా
స్వామికి స‌మ‌న్లు జారీ చేసిన కోర్టు

సీనియ‌ర్ రాజ‌కీయ‌వేత్త‌, బీజేపీ ఎంపీ సుబ్ర‌హ్మ‌ణ్య‌స్వామి చిక్కుల్లో ప‌డ్డారు. సొంత పార్టీ నేత‌ ఆయ‌న‌పై ప‌రువు న‌ష్టం దావా దాఖ‌లు చేశారు. ఈ మేర‌కు ఢిల్లీలోని రౌజ్ ఎవెన్యూ కోర్టు సుబ్ర‌హ్మ‌ణ్య స్వామికి నోటీసులు జారీ చేసింది. ఈ వ్య‌వ‌హారం ఇప్పుడు వైర‌ల్‌గా మారింది.

ఢిల్లీకి చెందిన యువ‌ నేత తేజీంద‌ర్ బ‌గ్గా గ‌తేడాది బీజేపీలో చేరారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న వ్యక్తిత్వంపై సుబ్ర‌హ్మ‌ణ్య‌స్వామి ఓ ట్వీట్ సంధించారు. తేజీంద‌ర్ బ‌గ్గా ప‌లు కేసుల్లో నిందితుడి ఉన్నార‌ని, ఆయ‌న‌ను పార్టీలో ఎలా చేర్చుకుంటున్నార‌ని కొంద‌రు జ‌ర్న‌లిస్టులు స్వామిని ప్ర‌శ్నించార‌ట‌. ఇదే విష‌యాన్ని ప్ర‌స్తావిస్తూ స్వామి ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ను చూసిన బ‌గ్గా.. స్వామిపై రౌజ్ ఎవెన్యూ కోర్టులో బ‌గ్గా ప‌రువు న‌ష్టం దావా దాఖ‌లు చేశారు. ఈ పిటిష‌న్‌ను విచార‌ణ‌కు స్వీక‌రించిన కోర్టు.. స్వామికి నోటీసులు జారీ చేసింది.

Related posts

చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ప్రధాని సహా ప్రముఖులు… 7 వేల మంది పోలీసులతో బందోబస్తు

Ram Narayana

భారతీయ రైళ్లకు పేరు ఎలా పెడతారో తెలుసా..?

Drukpadam

క్లాస్ రూమ్ లో విద్యార్థినులతో చిందులేసిన టీచర్!

Drukpadam

Leave a Comment