Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

కొడాలి నాని విశ్వాసం లేని కుక్క…బుద్ధా వెంకన్న

కొడాలి నాని లాంటి విశ్వాసం లేని కుక్కలను చంద్రబాబు పెంచారు: బుద్ధా వెంకన్న

  • వెన్నుపోటంటే ఏమిటో జగన్ కు బాగా తెలుసు
  • బాబాయిని, సొంత చెల్లెలిని వెన్నుపోటు పొడిచారు
  • కొడాలి నాని లాంటి నీచులను తరిమికొట్టాలన్న వెంకన్న 

ఏపీ మంత్రి కొడాలి నానిపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ కు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని కొంతమంది వెధవలు ప్రచారం చేస్తున్నారని… పార్టీ నాశనమైపోతోందనే ఆవేదనతోనే ఆనాడు ఆ నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పారు. చంద్రబాబుకు ఎన్టీఆర్ కుటుంబసభ్యులు కూడా మద్దతునిచ్చారని అన్నారు.

అయితే, వెన్నుపోటంటే ఏమిటో జగన్ కు బాగా తెలుసని… తన తండ్రి వైయస్ ను బెదిరించి బాబాయ్ వివేకాకు వెన్నుపోటు పొడిచారని చెప్పారు. అప్పుడు సొంత కుటుంబసభ్యులు కూడా జగన్ కు మద్దతు ఇవ్వలేదని అన్నారు.

టీడీపీని కాపాడి అధికారంలోకి తెచ్చిన ఘనత చంద్రబాబుదని… బాబాయిని చంపిన వారిని కాపాడుతున్న వ్యక్తి జగన్ అని… ఇద్దరిలో వెన్నుపోటుదారుడు ఎవరని ప్రశ్నించారు. తన విజయం కోసం పని చేసిన సొంత చెల్లెలికే వెన్నుపోటు పొడిచిన చరిత్ర జగన్ దని అన్నారు.

‘పప్పు అంటూ కారుకూతలు కూసే కొడాలి నానీ… మీ నాయకుడు గన్నేరుపప్పు అనే విషయం తెలుసుకో’ అని వెంకన్న ఎద్దేవా చేశారు. కొడాలి నాని లాంటి విశ్వాసం లేని కుక్కలను చంద్రబాబు పెంచి పోషించారని అన్నారు. కొడాలి నాని లాంటి నీచులను తరిమికొట్టాలని వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ గురించి మాట్లాడే కొడాలి నాని… వారి కుటుంబసభ్యులను సిగ్గులేకుండా తిడతారని మండిపడ్డారు.

హత్యా రాజకీయాల చరిత్ర జగన్ దని అన్నారు. చంద్రబాబే రౌడీయిజం చేసేవారైతే నాని లాంటి వారి నోళ్లు లేచేవా? అని ప్రశ్నించారు. వీరులు పుట్టిన గడ్డలో కొడాలి నాని లాంటి సన్యాసులు ఎలా పుట్టారని అన్నారు. ఏనుగులు పోతుంటే కుక్కలు మొరుగుతాయని.. కొడాలి నాని లాంటి వాళ్లు కుక్కల కంటే హీనమని మండిపడ్డారు. జగన్ దగ్గర మార్కులు పడతాయని చంద్రబాబును నాని తిడుతున్నాడని.. ఆయన మాట్లాడే ప్రతి మాట నాశనానికే దారి తీస్తుందని చెప్పారు.

Related posts

కర్ణాటక ఎన్నికలపై తెలుగు రాష్ట్రాల్లో జోరుగా బెట్టింగ్…

Drukpadam

హుజురాబాద్ లో హరీష్ రావు హల్చల్ …బైక్ నడిపి కార్యకర్తలను ఉత్సాహపరించిన మంత్రి!

Drukpadam

పోలవరంపై వైసీపీ , టీడీపీ డిష్యుం …డిష్యుం .. !

Drukpadam

Leave a Comment