Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

మోడీ పదిలక్షల ఉద్యోగాలు వట్టి భూటకం…రాహుల్ ధ్వజం!

మోడీ పదిలక్షల ఉద్యోగాలు వట్టి భూటకం…రాహుల్ ధ్వజం!
-ఇది మహా తప్పుడు హామీ అని రాహుల్ విమర్శలు
-మోదీ ఉద్యోగాల సృష్టిలో నిపుణుడు కాదు…
-ఉద్యోగాలపై వార్తలు సృష్టించడంలో నిపుణుడు:
-10 లక్షల ఉద్యోగాల భర్తీకి కేంద్రం నిర్ణయం
-పీఎంవో నుంచి ప్రకటన
-ఏడాదిన్నరలో నియామకాలు జరగాలని ఆదేశం

రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ప్రజలను మరోసారి మోసగించాలనే ఉద్దేశంతో 10 లక్షల ఉద్యోగాలు భర్తీకి చర్యలు తీసుకుంటున్నామని చెప్పడం మోసపూరితమేనని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మోడీ ప్రభుత్వం పై నిప్పులు చెరిగారు ..

వచ్చే ఒకటిన్నర సంవత్సర కాలంలో 10 లక్షల ఉద్యోగాల భర్తీకి ఆదేశాలు జారీ చేస్తూ ప్రధానమంత్రి కార్యాలయం నుంచి ప్రకటన వెలువడడం తెలిసిందే. దేశంలో అన్ని ప్రభుత్వ శాఖల్లోని ఖాళీలను గుర్తించి యుద్ధ ప్రాతిపదికన నియామకాలు చేపట్టాలని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. దీనిపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. ఇది వట్టి భూటకమని ధ్వజమెత్తారు . మోడీ ప్రభుత్వం సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన మాటలు ఏమైయ్యాయని అన్నారు .

ఎనిమిదేళ్ల కిందట ఇలాగే హామీలిచ్చారని వెల్లడించారు. అప్పుడు ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారని, ఇప్పుడు 10 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలని చెప్పడం కూడా అదే కోవలోకి వస్తుందని విమర్శించారు. ఇది తప్పుడు హామీలు ఇచ్చే ప్రభుత్వం కాదని, మహా తప్పుడు హామీలు ఇచ్చే ప్రభుత్వం అని ధ్వజమెత్తారు. ప్రధాని మోదీ ఉద్యోగాల సృష్టిలో నిపుణుడు కాదు… ఉద్యోగాలపై వార్తలు సృష్టించడంలో నిపుణుడు అని ఎద్దేవా చేశారు.

Related posts

వైసీపీ ఎమ్మెల్యే పద్మావతి కనపడటం లేదంటూ పోస్టర్లు…పద్మావతి స్పందన!

Drukpadam

కేసీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన అసోం సీఎం హిమంత బిస్వా

Drukpadam

తిరుపతి నుంచి బీజేపీ అభ్యర్థి పోటీ… స్పష్టతనిచ్చిన పవన్

Drukpadam

Leave a Comment