Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

అమ్మాయిల కోసం, డ్రగ్స్ కోసమైతే ఇక్కడకు రావొద్దు:ఆమ్‌స్టర్‌డామ్ మేయర్ వినతి!

అమ్మాయిల కోసం, డ్రగ్స్ కోసమైతే ఇక్కడకు రావొద్దు: పర్యాటకులకు ఆమ్‌స్టర్‌డామ్ మేయర్ వినతి!

  • ఆమ్‌స్టర్‌డామ్‌లో వ్యభిచారం, డ్రగ్స్ చట్టబద్ధం 
  • వీటి కోసం పోటెత్తుతున్న పర్యాటకులు
  • నైతికత కోల్పోయేందుకు రావొద్దంటున్న మేయర్

ఐరోపాలో ఉన్న నెదర్లాండ్ దేశ ముఖ్యపట్టణమైన ఆమెస్టర్ డ్యామ్ ప్రపంచంలో కెల్లా అందమైన ప్రదేశాల్లో ఒకటిగా భాసిల్లుతోంది . ఎటు చూసినా రకరకాల పూల తోటలు అందమైన వృక్షాలు గృహాలు కాలువలు ఉన్నాయి. దీంతో పర్యాటకులు ఎక్కువగా ఇక్కడికి వస్తుంటారు. దీంతో ఈ నగరానికి ప్రాముఖ్యత ఏర్పడింది. ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుండి ఇక్కడికి పర్యాటకులు వస్తుంటారు . కేవలం ఎనిమిది లక్షల పైగానే జనాభా ఉండగా పర్యాటకులే దీని ముఖ్య ఆధారంగా ఉంది. ఆమే.. స్టార్ అనే నది పై కట్టిన దీనికి డ్యామ్ డ్యామ్ అని పేరు వచ్చింది. ఇక్కడ వ్యభిచారం, డ్రగ్స్ వాడటం చట్టబద్ధం. దీంతో అనేక మంది పర్యాటకులు దీనికోసం వస్తుంటారనేది ఉంది. అందువల్ల పర్యాటకులు దీనికోసం ఇక్కడకు రావద్దని మేయర్ స్పష్టం చేశారు. గంజాయి లాంటి వాడకం కూడా అందికంగానే ఉంది. ఇక్కడకు వచ్చేవాళ్ళు ప్రకృతి అందాలను తిలకించి వాటి ద్వారా తాము అనుభూతి పొంది బయట ప్రపంచానికి తెలియజెప్పాలని తాము కురుకుంటున్నామని మేయర్ అన్నారు .

ఆమ్‌స్టర్‌డ్యామ్.. నెదర్లాండ్స్ రాజధాని అయిన ఈ నగరం ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఎటుచూసినా అందమైన కాలువలు, అంతే సుందరమైన వీధులు, గొప్పగొప్ప మ్యూజియాలతో అలరారే ఈ నగరాన్ని చూసేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పర్యాటకులు పోటెత్తుతుంటారు.

భూతల స్వర్గంలా ఉండే ఈ నగరానికి మరో మరక కూడా ఉంది. దీనిని ‘సిటీ ఆఫ్ సిన్’ (పాపపు నగరం)గా కూడా పిలుస్తుంటారు. దీనికి ఓ కారణం ఉంది. ఇక్కడ వ్యభిచారం చట్టబద్ధమైనది. గంజాయి వాడడం కూడా నేరం కాదు. ఇక్కడ ఈ రెండూ పెద్ద ఆదాయ వనరులు. ఈ నేపథ్యంలో ఆమ్‌స్టర్‌డామ్ అందాలను ఆస్వాదించడానికే కాదు.. అమ్మాయిల పొందు కోరేందుకు, డ్రగ్స్ కోసం కూడా పర్యాటకులు ఇక్కడికి పెద్ద ఎత్తున వస్తుంటారు.

ఈ నేపథ్యంలో నగర మేయర్ ఎమ్కే హల్సేమా (56) తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. ‘బ్లూమ్‌బర్గ్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. ఆమ్‌స్టర్‌డామ్ అందాలు చూసేందుకు, మ్యూజియంలు తిలకించేందుకు, లేదంటే ఇక్కడి సంస్కృతీసంప్రదాయల గురించి తెలుసుకునేందుకు వచ్చే పర్యాటకులను స్వాగతిస్తానని చెప్పారు.

నైతికతతో విహార యాత్రకు వచ్చే వారిని తాము ఆహ్వానిస్తామన్న ఆమె.. ప్రజలు తమ నైతికతను కోల్పోవాలనుకుంటే మాత్రం ఇక్కడకు రావొద్దని స్పష్టంగా పేర్కొన్నారు. నగరం చాలామంది నాన్‌రెసిడెంట్‌లకు మాత్రమే వసతి కల్పిస్తోందన్న ఆమె.. వీరి కారణంగా నగర జీవనం మరింత ఖరీదైనదిగా మారుతోందన్నారు. కాబట్టి సెక్స్ కోసం, డ్రగ్స్ కోసమైతే ఇక్కడకు రావొద్దని పర్యాటకులకు ఆమె విజ్ఞప్తి చేశారు.

రాజధానిలో పర్యాటకులకు సాఫ్ట్ డ్రగ్స్ విక్రయించే కాఫీ షాపులు సర్వసాధారణం. వ్యవస్థీకృత నేరాలు, మనీలాండరింగ్‌తో ఇవి ముడిపడి ఉన్నాయి. దీంతో నేరాలు కూడా ఇబ్బడిముబ్బడిగా పెరుగుతున్నాయి. 2018లో హల్సేమా ఆమ్‌స్టర్‌డామ్‌కు మొదటి మహిళా మేయర్ అయినప్పటి నుంచి నగరంలోని రెడ్‌లైట్ డిస్ట్రిక్ట్‌ను మార్చేందుకు, సెక్స్ వర్కర్లను రక్షించేందుకు ఓ చట్టాన్ని ప్రతిపాదించారు. ఇందులో నగరంలోని వేశ్యాగృహాలను తగ్గించడం,  లేదంటే పూర్తిగా మూసివేయడం, లేదంటే వాటిని పూర్తిగా వేరే చోటికి తరలించడం వంటివి ఉన్నాయి.

Amsterdam mayor says tourists coming for sex and drugs not welcome

Related posts

హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిపై ట్రాఫిక్ కష్టాలు!

Drukpadam

భద్రాద్రిలో నిరాడంబరంగా శ్రీరామ నవమి వేడుకలు… మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

Drukpadam

ఢిల్లీలో అత్యంత నాటకీయ పరిణామాలు…ఈడీ విచారణకు కవిత డుమ్మా…!

Drukpadam

Leave a Comment